...
...
Next Story

Runanubandham Serial: ఛానళ్ల మధ్య రేటింగ్స్ యుద్ధం- టీవీలోకి సరికొత్త సీరియల్ రుణానుబంధం- పుట్టిల్లే మెట్టినిల్లు అయితే?

Runanubandham Serial TV Premiere Date: బుల్లితెరపై ఓవైపు ఛానళ్ల మధ్య రేటింగ్ యుద్ధం నడుస్తుంటే మరోవైపు టీవీలోకి సరికొత్త సీరియల్ రుణానుబంధం ప్రారంభం కానుంది. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, నటి నీలిమ, అనగ ప్రధాన పాత్రల్లో నటించిన రుణానుబంధం టీవీ ప్రీమియర్ ఎక్కడ, ఎప్పుడు అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 19, 2026, 14:18:10 IST
Advertisement

Runanubandham Serial TV Premiere Date And Time: తెలుగు బుల్లితెరపై వైవిధ్యమైన కుటుంబ కథాచిత్రాలు, ఎమోషనల్ డ్రామాలతో అగ్రగామిగా దూసుకుపోతున్న జీ తెలుగు ఛానల్ మరో సరికొత్త ప్రయోగానికి తెరలేపింది.

సూపర్ హిట్ సీరియల్స్‌తో

ఛానళ్ల మధ్య రేటింగ్స్ యుద్ధం- టీవీలోకి సరికొత్త సీరియల్ రుణానుబంధం- పుట్టిల్లే మెట్టినిల్లు అయితే?
ఛానళ్ల మధ్య రేటింగ్స్ యుద్ధం- టీవీలోకి సరికొత్త సీరియల్ రుణానుబంధం- పుట్టిల్లే మెట్టినిల్లు అయితే?

ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ఛానల్ ఇప్పుడు సరికొత్త కథ, ఉత్కంఠభరితమైన మలుపులతో సాగే 'రుణానుబంధం' అనే సీరియల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. జూన్ 22వ తేదీ నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు రోజువారీ ప్రైమ్ టైమ్ స్లాట్ అయిన రాత్రి 7 గంటలకు ఈ సరికొత్త ధారావాహిక ప్రసారం కానుంది.

రేటింగ్స్ యుద్ధం

సాధారణంగా రాత్రి 7 గంటల సమయం అంటే ఛానళ్ల మధ్య రేటింగ్స్ యుద్ధం నడుస్తుంది. ఈ కీలక సమయంలో జీ తెలుగు ఒక విభిన్నమైన సెంటిమెంట్ కథను నమ్ముకుని బరిలోకి దిగుతుండటం విశేషం.

తోలుబొమ్మలాట నేపథ్యం..

సీరియల్ కథాంశం చాలా భిన్నంగా, తెలుగు రాష్ట్రాల సాంప్రదాయక కళ అయిన తోలుబొమ్మలాట నేపథ్యంలో సాగుతుంది. మైనావతి (నటి నీలిమ) అనే ఒక అత్యంత ధనవంతురాలు, సమాజంలో పేరుప్రతిష్టలు ఉన్న ప్రతిభావంతమైన మహిళ.

మైనావతి వదిలేసిన బిడ్డ

ఒక వర్షం కురుస్తున్న చీకటి రాత్రి వేళ ఊహించని పరిస్థితుల్లో తనకు పుట్టిన ఆడబిడ్డను వదిలేస్తుంది మైనావతి. ఆ అనాథ బిడ్డను సాంప్రదాయ తోలుబొమ్మలాట కళాకారుడైన అప్పన్న (నటుడు ప్రభాకర్) చేరదీస్తాడు. ఆమెకు ధరణి (నటి అనగ) అని పేరు పెట్టి సొంత కూతురిలా పెంచుతాడు.

సమాజంలో జరిగే అన్యాయాలపై

ధరణి అసలు ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు, ఆమెపై పగ తీర్చుకునేందుకు మైనావతి కన్నకూతుళ్లు సంజన (నేహాల్), నయన (దివ్య) కలిసి అనేక కుట్రలు పన్నుతారు. అందులో భాగంగానే గ్రామాధినేత, మైనావతి సోదరుడైన ధర్మతేజ (సతీష్)తో బలవంతంగా ధరణికి వివాహం జరిపిస్తారు.

నాలుగు గోడల మధ్య

పెళ్లయిన తర్వాత అత్తగారింట్లో అడుగుపెట్టిన ధరణిని నాలుగు గోడల మధ్య బంధించి శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభిస్తారు. ద్రోహం, ప్రతీకారం, స్వార్థం నిండిన ఆ ఇంట్లో ధరణి ఒంటరిగా ఎలాంటి నరకాన్ని అనుభవించింది? ఆ కష్టాలను ఎదుర్కొని ఎలా నిలబడింది? అనే అంశాలను దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా మలిచారు.

క్షమాగుణం విజయం సాధిస్తుందా?

ధరణి తన కన్నకూతురేననే నిజాన్ని మైనావతి ఎప్పటికైనా గుర్తిస్తుందా? కన్నతల్లి ప్రేమ ఆ బిడ్డకు దక్కుతుందా? చివరకు పగ, ద్వేషంపై క్షమాగుణం ఎలా విజయం సాధించింది? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే జూన్ 22 నుంచి ప్రారంభం కానున్న 'రుణానుబంధం' సీరియల్ చూడాల్సిందే.

ప్రభాకర్, నీలిమ తదితరులు

బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, నీలిమ వంటి పాపులర్ తారాగణం ఉండటం ఈ సీరియల్‌కు మరింత బలాన్ని ఇస్తోంది. వీరితోపాటు అనగ, నేహాల్, నయన, సతీష్ తదితరులు ఇతర పాత్రలు పుట్టిల్లే మెట్టినిల్లుగా మారే ఈ సీరియల్ రుణానుబంధంలో మెప్పించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe