మరో సండే వచ్చేస్తోంది. ఈ సండేను మరింత స్పెషల్ గా మార్చేందుకు మూవీ మహోత్సవంతో జీ తెలుగు ఛానెల్ రెడీ అయిపోయింది. తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ఆదివారం ఏకంగా అయిదు బ్లాక్ బస్టర్లను ప్రీమియర్ చేయనుంది. ఇందులో ఫ్యాంటసీ, యాక్షన్, హారర్ థ్రిల్లర్లు, కామెడీ సినిమాలున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.
5 బ్లాక్ బస్టర్లు

జీ తెలుగు ఐదు వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ‘సండే మూవీ మహోత్సవం’ను అందిస్తోంది. రేపు (డిసెంబర్ 21) ఈ అయిదు సినిమాలు వరుసగా తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనున్నాయి. జీ తెలుగు తన ప్రత్యేక కార్యక్రమాల విభాగం ‘సండే మూవీ మహోత్సవం’తో ఈ ఆదివారాన్ని ఒక అద్భుతమైన సినిమా పండుగగా మార్చబోతోంది.
ఫ్యాంటసీ థ్రిల్లర్
జీ తెలుగు సండే సినిమా మారథాన్ ఉదయం 9:00 గంటలకు మెగా హిట్ సూపర్ హీరో ఫ్యాంటసీ థ్రిల్లర్ హనుమాన్‌తో ప్రారంభమవుతుంది. థియేటర్లలో హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో తేజ సజ్జా హీరో. ఈ సినిమాలోని విజువల్స్ ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి.
యాక్షన్ మూవీతో
ఆ తర్వాత జీ తెలుగులో మధ్యాహ్నం 12:00 గంటలకు కల్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఘర్షణ ప్రసారమవుతుంది. విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే ఇది స్పెషల్ సినిమా అన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఉత్కంఠభరితమైన మధ్యాహ్నానికి నాంది పలుకుతుంది.
తొలిసారి
మధ్యాహ్నం 3:00 గంటలకు సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ అయలాన్ తెలుగు ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేస్తుంది. ఇది వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా తొలిసారి టీవీలో ప్రసారం కానుంది. ఇది ఏ స్క్రీన్‌పై అయినా తెలుగులో మొదటిసారిగా ప్రసారం కావడం విశేషం. ఈ వేడుకకు ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
కామెడీ సందడి
{{/usCountry}}మధ్యాహ్నం 3:00 గంటలకు సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ అయలాన్ తెలుగు ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేస్తుంది. ఇది వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా తొలిసారి టీవీలో ప్రసారం కానుంది. ఇది ఏ స్క్రీన్‌పై అయినా తెలుగులో మొదటిసారిగా ప్రసారం కావడం విశేషం. ఈ వేడుకకు ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
కామెడీ సందడి
{{/usCountry}}ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటి సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీతో కలిసి వెంకటేష్ అందించిన ఫన్ అంతా ఇంతా కాదు. ఈ మూవీ ఆదివారం సాయంత్రం 6:00 గంటలకు జీ తెలుగులో పండుగ వాతావరణాన్ని నింపుతుంది. ఈ చిత్రంతో వినోదం కొనసాగుతుంది.
హారర్ థ్రిల్లర్
జీ తెలుగు సండే మహోత్సవం రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే హారర్ థ్రిల్లర్ కిష్కింధపురితో ముగుస్తుంది. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఇదో ఉత్కంఠ రేపే థ్రిల్లర్. రేడియో స్టేషన్ చుట్టూ కథ అల్లుకుని ఉంటుంది. ప్రేక్షకులను ఇది భయపెడుతుంది.