ఓటీటీలోకి ప్రతివారం డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అందులోనూ శుక్రవారం నాడు మరిన్ని ఎక్కువగా ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఇవాళ (నవంబర్ 21) 20కిపైగా ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్ కాగా అందులో రొమాంటిక్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
జిద్దీ అంటే అర్థం ఇదే

ఆ వెబ్ సిరీసే జిద్దీ ఇష్క్. జిద్దీ అంటే హిందీలో మొండి అని అర్థం వస్తుంది. హిందీలో రొమాంటిక్ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన జిద్దీ ఇష్క్‌లో మెయిన్ లీడ్‌లో బాలీవుడ్ బ్యూటీ అదితి పోహంకర్ నటించింది. లాయి బారి, స్టార్, షీ, ఆశ్రం, మండాల మర్డర్స్ వంటి ఓటీటీ కంటెంట్‌తో తెగ పాపులర్ అయిన బ్యూటీ అదితి పోహంకర్.
జిద్దీ ఇష్క్ నటీనటులు
జిద్దీ ఇష్క్ ఓటీటీ సిరీస్‌లో అదితితోపాటు పరంబ్రత చటోపాధ్యాయ్, సుమీత్ వ్యాస్, బర్ఖా బిష్త్, రియా సేన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ హిందీ వెబ్ సిరీస్‌కు రాజ్ చక్రవర్తి కథ, దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ అంతా బెంగాల్ నేపథ్యంలో సాగుతుంది.
లవర్ సూసైడ్
మెహల్ (అదితి పోహంకర్), శేఖర్ దా (పరంబ్రత చటోపాధ్యాయ్) ఇద్దరు ప్రేమికుల చుట్టూ సాగుతుంది. టీనేజ్ అమ్మాయి అయిన మెహల్, శేఖర్ గాఢంగా ప్రేమించుకుంటారు. శేఖర్‌ను మెహల్ ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తుంది. అయితే, ఓ రోజు శేఖర్ దా సూసైడ్ చేసుకుంటాడు.
యూనికార్న్ కంపెనీలో జాబ్
సూసైడ్ కావడంతో శేఖర్ దా మరణాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ, శేఖర్ దా ఎలాంటి వాడో తెలిసిన మెహల్ తన ప్రేమికుడి చావుకు గల కారణం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే యూనికార్న్ అనే సాఫ్ట్‌వెర్ కంపెనీలో జాబ్‌లో జాయిన్ అవుతుంది.
మెహల్ ప్రతీకారం
ఆ తర్వాత ఏమైంది? యూనికార్న్ ఆఫీస్‌కు శేఖర్ దాకు సంబంధం ఏంటీ? శేఖర్‌ది సూసైడ్ కాదా? అతన్ని ఎవరు చంపారు? ఎందుకు హత్య చేశారు? దాని వెనుక ఎంతమంది ఉన్నారు?, మెహల్ ప్రతీకారం తీర్చుకుందా? అనే విషయాలు తెలియాలంటే మొండి ప్రేమ అయిన జిద్దీ ఇష్క్ చూడాల్సిందే.
స్టన్నింగ్ యాక్షన్స్‌తో
{{/usCountry}}ఆ తర్వాత ఏమైంది? యూనికార్న్ ఆఫీస్‌కు శేఖర్ దాకు సంబంధం ఏంటీ? శేఖర్‌ది సూసైడ్ కాదా? అతన్ని ఎవరు చంపారు? ఎందుకు హత్య చేశారు? దాని వెనుక ఎంతమంది ఉన్నారు?, మెహల్ ప్రతీకారం తీర్చుకుందా? అనే విషయాలు తెలియాలంటే మొండి ప్రేమ అయిన జిద్దీ ఇష్క్ చూడాల్సిందే.
స్టన్నింగ్ యాక్షన్స్‌తో
{{/usCountry}}రొమాంటిక్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన జిద్దీ ఇష్క్ సిరీస్‌లో హీరోయిన్ అదితి చేసే యాక్షన్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇదివరకు సిరీస్‌లలో స్టన్నింగ్ యాక్షన్స్‌తో అట్రాక్ట్ చేసిన అదితి పోహంకర్ మరోసారి ఫ్యాన్స్‌ను అలరించేలా జిద్దీ ఇష్క్ ఫైటింగ్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
ఇకపోతే జియో హాట్‌స్టార్‌లో జిద్దీ ఇష్క్ ఓటీటీ రిలీజ్ అయింది. నేటి నుంచి (నవంబర్ 21) హాట్‌స్టార్‌లో హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలి వంటి ఏడు భాషల్లో జిద్దీ ఇష్క్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు జిద్దీ ఇష్క్ ఓటీటీ సిరీస్‌ను ట్రై చేయొచ్చు.