చలికాలం వచ్చిందంటే చాలు.. వాతావరణంలో మార్పుల వల్ల మన రోగనిరోధక శక్తి నెమ్మదిస్తుంది. దీనివల్ల అలర్జీలు, చర్మం పొడిబారడం, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఈ సమయంలో శరీరాన్ని లోపల నుంచి దృఢంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఢిల్లీకి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్, ఫంక్షనల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ ఆలోక్ చోప్రా, చలికాలంలో మనం తప్పనిసరిగా తీసుకోవాల్సిన 5 రకాల ఆహారాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

"రోగనిరోధక శక్తి అనేది రాత్రికి రాత్రే వచ్చేది కాదు.. మనం రోజూ తినే ఆహారం ద్వారానే అది సాధ్యమవుతుంది" అని డాక్టర్ చోప్రా స్పష్టం చేశారు. సప్లిమెంట్ల కంటే సహజ సిద్ధమైన ఆహారమే మేలని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ చోప్రా సూచించిన ఆ 5 సూపర్ ఫుడ్స్ ఇవే:
1. ఆవ ఆకు కూర (Mustard Greens):
ఉత్తర భారతదేశంలో 'సర్సో'గా పిలిచే ఆవాకు కూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, సి, కె ఉండటమే కాకుండా పీచు పదార్థం (Fiber) అధికంగా ఉంటుంది. "ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది" అని డాక్టర్ వివరించారు.
2. పచ్చి పసుపు (Fresh Turmeric):
పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, వాపును తగ్గించే గుణాలు (Anti-inflammatory) మెండుగా ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. డాక్టర్ చోప్రా ఒక విభిన్నమైన చిట్కాను కూడా పంచుకున్నారు. ఆయన తన 'బుల్లెట్ కాఫీ'లో పచ్చి పసుపు, కొద్దిగా నెయ్యి లేదా ఎంసీటీ ఆయిల్, దాల్చినచెక్క పొడిని కలుపుకుని తాగుతారట. ఇది శరీరంలో మంటను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.
3. ఖర్జూరం (Dates):
శరీరానికి తక్షణ శక్తిని, వెచ్చదనాన్ని అందించడంలో ఖర్జూరం సాటిలేనిది. ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు అలసటను దూరం చేసి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. నీరసంగా ఉన్నప్పుడు ఇవి మంచి స్నాక్ లా పనిచేస్తాయని డాక్టర్ సూచించారు.
4. ఉసిరి (Amla):
{{/usCountry}}శరీరానికి తక్షణ శక్తిని, వెచ్చదనాన్ని అందించడంలో ఖర్జూరం సాటిలేనిది. ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు అలసటను దూరం చేసి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. నీరసంగా ఉన్నప్పుడు ఇవి మంచి స్నాక్ లా పనిచేస్తాయని డాక్టర్ సూచించారు.
4. ఉసిరి (Amla):
{{/usCountry}}విటమిన్ సి నిధిగా పిలిచే ఉసిరి, చలికాలంలో వచ్చే జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. "ఉసిరిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే.. దాన్ని కోసిన తర్వాత కూడా అందులోని పోషకాలు త్వరగా నశించవు. అందుకే దీన్ని ఏ రూపంలో తీసుకున్నా పూర్తి ప్రయోజనం అందుతుంది" అని డాక్టర్ చోప్రా పేర్కొన్నారు. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
5. నువ్వులు (Sesame Seeds):
చిన్నవిగా కనిపించినా నువ్వుల్లో శక్తి అపారం. ఇవి శరీరంలో వేడిని పుట్టించే గుణాన్ని (Thermogenic) కలిగి ఉంటాయి. అన్ని రకాల గింజల కంటే నువ్వులలోనే కాల్షియం అత్యధికంగా ఉంటుందని, ఇది ఎముకల బలానికి, కీళ్ల ఆరోగ్యానికి ఎంతో అవసరమని డాక్టర్ వివరించారు. లడ్డూలు లేదా చిక్కీల రూపంలో వీటిని తీసుకోవడం ఉత్తమం.
చలికాలంలో ఈ ఐదు రకాల ఆహారాలను మీ డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని డాక్టర్ చోప్రా భరోసా ఇచ్చారు.