Hemoglobin Boosters : శరీరంలో హీమోగ్లోబిన్ పెరగటం ఎలా..? న్యూట్రిషనిస్ట్‌ సూచించిన డైట్ ప్లాన్ మీకోసం

Natural Hemoglobin Boosters : చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యను సహజంగా అధిగమించి, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవడానికి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ సూచించిన పక్కా డైట్ ప్లాన్ మీకోసం….

Published on: Apr 27, 2026, 16:02:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Natural Hemoglobin Boosters : నేటి కాలంలో రక్తహీనత (Anemia) అనేది ఒక అతిపెద్ద పోషకాహార సమస్యగా మారింది. శరీరంలో ఐరన్ లోపం వల్ల అలసట, బలహీనత, జుట్టు రాలడం, చిరాకు, చర్మం నిర్జీవంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది దీని కోసం వెంటనే సప్లిమెంట్ల వైపు మొగ్గు చూపుతారు.

ఐరన్ పెంచే డైట్ ప్లాన్ (Unsplash)
ఐరన్ పెంచే డైట్ ప్లాన్ (Unsplash)

మన ఇంట్లో దొరికే సహజ ఆహార పదార్థాలతోనే హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచుకోవచ్చని సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ సూచిస్తున్నారు. ఏప్రిల్ 23, 2026 నాటి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆమె ఐరన్ స్థాయిలను పెంచేందుకు కొన్ని కీలక చిట్కాలను పంచుకున్నారు.

విటమిన్-సి తో ఐరన్ శోషణ….

మనం ఐరన్ ఉన్న ఆహారం తిన్నప్పటికీ… అది శరీరానికి వంటబట్టాలంటే విటమిన్ -సి చాలా అవసరం. వేసవి కాలంలో లభించే మామిడి పండ్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది, ఇది ఐరన్ గ్రహించడంలో సహాయపడుతుంది. మామిడితో పాటు జామ, జీడిపప్పు పండ్లు వంటి కాలానుగుణ పండ్లను రోజూ తీసుకోవాలని రుజుతా సిఫార్సు చేస్తున్నారు.

పప్పుధాన్యాలు… పెరుగు కలయిక..

పెసర, శనగ, మట్కీ, కులిత్ వంటి పప్పుధాన్యాలలో విటమిన్-బి, అమైనో ఆమ్లాలు మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటిని కేవలం కూరలుగా కాకుండా అన్నం లేదా చపాతీతో కలిపి తింటేనే పూర్తి ప్రయోజనం ఉంటుంది. అలాగే, భోజనంలో పెరుగు లేదా లస్సీని చేర్చుకోవడం వల్ల విటమిన్ బి12 లభిస్తుంది, ఇది శరీరంలో ఐరన్ సమీకరణను వేగవంతం చేస్తుంది.

సాంప్రదాయ చిరుతిళ్లు

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన శనగలు, బెల్లం కలయిక ఒక అద్భుతమైన ఐరన్ బూస్టర్. శనగల్లో ఉండే ప్రొటీన్, మెగ్నీషియం మరియు పొటాషియం శరీరానికి శక్తినిస్తాయి. అలాగే, రోజుకు ఒక నేరేడు పండు తినడం మరియు ఆహారంలో 'అలీవ్ లడ్డూ' (హలీమ్ గింజల లడ్డూ) చేర్చుకోవడం వల్ల హిమోగ్లోబిన్ వేగంగా పెరుగుతుంది.

వంట పాత్రల్లో మార్పు

ఆహార పదార్థాల ద్వారానే కాకుండా, వంట చేసే విధానంలో మార్పుల ద్వారా కూడా ఐరన్ పొందవచ్చు. అల్యూమినియం లేదా నాన్-స్టిక్ పాత్రలకు బదులుగా ఇనుప పాత్రలను వాడటం వల్ల ఆహారానికి సహజంగానే ఇనుము లభిస్తుందని రుజుతా పేర్కొన్నారు. హిమోగ్లోబిన్ పెరగడం వల్ల థైరాయిడ్ సమస్యలు తగ్గడమే కాకుండా, మానసిక స్థితి మరియు చర్మ సౌందర్యం మెరుగుపడుతుందని ఆమె వివరించారు.

  • మద్యం సేవించడం వల్ల కాలేయంపై ప్రభావం పడి…. ఐరన్ సమీకరణ తగ్గుతుంది.
  • అధికంగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఐరన్ శోషణకు ఆటంకం ఏర్పడుతుంది.
  • కేవలం సలాడ్లపైనే ఆధారపడటం, మితిమీరిన స్మూతీలు లేదా భేదిమందులు వాడటం ఐరన్ స్థాయిలను తగ్గిస్తుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More