ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది తింటే దంతాలకు ఎంత నష్టమో తెలుసా?
చిరుతిళ్లు ఎక్కువగా తినే అలవాటు ఉందా? జాగ్రత్త! మీ దంతాల ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందని గుర్తించుకోవాలి! చిరుతిళ్ల వల్ల దంతాలకు కలిగే నష్టాలపై నిపుణులు చెబుతున్న విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
మీకు ఎప్పుడూ, ఏదో ఒకటి తినే అలవాటు ఉందా? ఈ అలవాటు (రోజుకు రెండుసార్లు క్రమం తప్పకుండా బ్రష్ చేసినప్పటికీ) మీ దంతాల ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉంది మీకు తెలుసా? రోజంతా చిరుతిళ్లు (స్నాకింగ్) తింటూనే ఉండటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని, అందుకే అతిగా తినాలనే కోరికను నియంత్రించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకు చిరుతిళ్ల అలవాటును అదుపులో పెట్టుకోవాలో అర్థం చేసుకోవడానికి, హెచ్‌టీ లైఫ్‌స్టైల్, దంతవైద్య నిపుణురాలు, స్మైల్ కాన్సెప్ట్స్ మల్టీ-స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ నికితా మోత్వానిని సంప్రదించింది.
ఆమె చెప్పిన దాని ప్రకారం.. మీరు రోజుకు రెండుసార్లు బ్రష్ చేసినా కూడా, నిరంతరాయంగా స్నాక్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టం పూడ్చలేనిది! డాక్టర్ మోత్వాని తన క్లినికల్ ప్రాక్టీస్ ఆధారంగా తన పరిశీలనను పంచుకున్నారు: “సరైన బ్రషింగ్ పాటిస్తున్నప్పటికీ, చిరుతిళ్లు తీసుకునే సమయం, వాటిలోని పదార్థాల కారణంగా పుచ్చు సమస్యలతో బాధపడే నా రోగులను నేను నిరంతరం చూస్తున్నాను.”
స్నాకింగ్ వల్ల దంతాలకు ఎందుకు హాని?
చిరుతిళ్లు మీ దంతాల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో దంతవైద్యురాలు వివరించారు.
“మీరు చక్కెర లేదా పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం లేదా పానీయం తీసుకున్నప్పుడల్లా, మీ నోటిలోని బ్యాక్టీరియా ఈ రెండింటినీ యాసిడ్స్‌గా మారుస్తుంది. ఈ ఆమ్లం దంతాల ఉపరితలంపై (ఎనామెల్‌పై) క్షీణత ప్రభావాన్ని చూపుతుంది. ఇది నోటిలో సాధారణంగా ఉండాల్సిన పీహెచ్ స్థాయిని తగ్గిస్తుంది. దీనివల్ల యాసిడ్ అటాక్ జరుగుతుంది. మీరు ఏదైనా తిన్న లేదా తాగిన తర్వాత ఈ యాసిడ్ ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు ఉంటుంది,” అని ఆమె తెలిపారు.
బ్రష్ చేయడం వల్ల మీ దంతాలు సేఫ్ అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు ప్రతిసారీ ఏదైనా తిన్నప్పుడల్లా, మీ నోరు యాసిడ్ అటాక్‌కి గురవుతుంది. అది పంటి సమస్యకు కారణమవుతుంది.
అంతేకాక, చాలా మంది బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్, కాఫీ, సాయంత్రం వేళల్లో నిరంతరం తింటూ ఉండే 'గ్రేజింగ్ జీవనశైలిని' పాటిస్తున్నారని డాక్టర్ మోత్వాని వెల్లడించారు.
“దీని ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నాయి, ఎందుకంటే దంతాలకు అసలు విరామం దొరకదు. ఈ నిరంతర స్నాకింగ్ కారణంగా, నోరు గంటల తరబడి యాసిడిక్ స్వభావంలోనే ఉండిపోతుంది. దీనివల్ల లాలాజలం ఎనామెల్‌ను సరిచేయడానికి వీలు లేకుండా పోతుంది. ఫలితంగా, దంతాల్లో పుచ్చు ఏర్పడే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. దీనికి బదులుగా, మీ దంతాలకు ఎక్కువ రికవరీ టైమ్ ఇవ్వడానికి ఒక నిర్దిష్ట సమయ పట్టిక ప్రకారం తినాలి,” అని ఆమె సిఫార్సు చేశారు.
దంతాలకు హానికరమైన చిరుతిళ్లు
మీరు పరిమాణం విషయంలో జాగ్రత్తగా లేకపోతే, దంత సంబంధిత సమస్యలను పెంచే ఈ కింది చిరుతిళ్ల గురించి దంతవైద్యురాలు హెచ్చరించారు:
జిగురుగా ఉండే డ్రై ఫ్రూట్స్: ఎండు ద్రాక్ష, ఖర్జూరం, అంజీర్ రోల్స్, ఎనర్జీ బార్స్ దంతాల మధ్య ఇరుక్కుని, గంటల తరబడి అక్కడే ఉంటాయి.
ఇండియన్ నమ్‌కీన్- చిప్స్: కార్బ్స్ చక్కెరగా విడిపోతాయి. చిన్న ముక్కలు దంతాల పగుళ్లలో ఇరుక్కుపోతాయి.
గ్రాన్యులా / ఎనర్జీ బార్స్: మనం తినే చాలా గ్రాన్యులా/ఎనర్జీ బార్లలో అవసరం లేని చక్కెరలు ఉంటాయి. చాలా బార్లలో తేనె లేదా సిరప్ అధికంగా ఉంటుంది.
ఫ్రూట్ జ్యూస్ / స్మూతీ / కొబ్బరి నీరు: ఇవి చాలా ఎక్కువ చక్కెర, యాసిడ్‌ని కలిగి ఉంటాయి. ప్రత్యేకంగా చక్కెర కలపకపోయినా, పండ్ల నుంచి యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.
మసాలా చాయ్ / కోల్డ్ కాఫీ: మీరు ప్రతిరోజూ అధిక చక్కెరతో మసాలా చాయ్ లేదా కాఫీ తాగితే, అది యాసిడ్ అటాక్‌గా మారుతుంది. ఒక గంట పాటు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల 4 నుంచి 5 సార్లు విడివిడిగా యాసిడ్ అటాక్స్ జరుగుతాయి.














