...
...
Next Story

Egg freshness test : పాడైపోయిన గుడ్లను ఎలా గుర్తుపట్టాలి? సింపుల్ వాటర్ టెస్ట్ ఇదిగో..

మనం రోజూ తినే గుడ్లు తాజాగా ఉన్నాయా? లేక పాడైపోయాయా? అనేది తెలుసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. దీనికోసం భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ) కేవలం ఒక గ్లాసు నీటితో చేసే సులువైన చిట్కాను వెల్లడించింది. వివరాలు మీకోసం..

Published on: Sep 9, 2026, 09:10:38 IST
Advertisement

భారతీయ కుటుంబాల్లో దాదాపు ప్రతి ఇంట్లో గుడ్లు నిత్య అవసర ఆహార వస్తువుగా మారిపోయాయి. ప్రొటీన్లకు నిలయమైన గుడ్లను బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం వరకు రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. అయితే, మనం వండుకునే ముందు ఆ గుడ్డు నిజంగా ఫ్రెష్​గా ఉందా లేదా పాడైపోయిందా అనేది గుర్తించడం ఆరోగ్యం దృష్ట్యా చాలా ముఖ్యం. పైగా.. పైన ఉండే పెంకును చూసి గుడ్డు మంచిదో కాదో చెప్పడం కష్టం.

గుడ్ల ఫ్రెష్​నెస్​ని టెస్ట్ చేసే విధానం..
గుడ్ల ఫ్రెష్​నెస్​ని టెస్ట్ చేసే విధానం..

ఫ్రిజ్‌లో కొన్ని రోజులు నిల్వ ఉంచిన తర్వాత అవి ఎప్పుడు కొన్నామో గుర్తుండక గందరగోళానికి గురవుతుంటాం. ఈ సమస్యకు పరిష్కారంగా 'భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ' (ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ) సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఒక సింపుల్​ టెస్ట్​ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

కేవలం ఒక గ్లాసు నీటితో 'వాటర్ టెస్ట్'!

ఆహార భద్రతపై అవగాహన కల్పిస్తూ ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియోను విడుదల చేసింది. గుడ్డు తాజాదనాన్ని పరీక్షించడానికి కేవలం ఒక గ్లాసు నీళ్లు ఉంటే సరిపోతుందని తెలిపింది.

పరీక్షించే విధానం ఇదిగో:

ఒక గాజు గ్లాసులో సగానికి పైగా నీటిని తీసుకోండి. అందులో మీరు పరీక్షించాలనుకుంటున్న గుడ్డును నెమ్మదిగా వేయండి.

గుడ్డు పూర్తిగా కింది వరకు వెళ్లి మునిగిపోయి, ఫ్లాట్‌గా పడుకుంటే: అది చాలా తాజాగా ఉందని అర్థం. ధైర్యంగా వండుకోవచ్చు.

గుడ్డు అడుగున నిలువుగా (అప్‌రైట్‌గా) నిలబడితే: అది కాస్త పాతబడిన గుడ్డు అని అర్థం. అయినప్పటికీ ఉపయోగించుకోవడానికి వీలుంటుంది.

గుడ్డు నీటిపై తేలితే: అది ఖచ్చితంగా పాడైపోయినట్లే! అందులో బ్యాక్టీరియా చేరి వాయువులు పూరితమవ్వడం వల్ల నీటిపై తేలుతుంది. దానిని వెంటనే పారవేయడం శ్రేయస్కరం.

గుడ్డు పగలకుండా గుర్తించే ఇతర సంకేతాలు..

గుడ్లు త్వరగా పాడవకుండా ఉండటానికి, వాటిలోని పోషకాలు దెబ్బతినకుండా ఉండటానికి నిల్వ చేసే విధానంలో కొన్ని మార్పులు చేయాలి:

సొంత కేటలాగ్/బాక్స్‌లోనే ఉంచండి: గుడ్లను కొనుగోలు చేసిన కంటైనర్ లేదా బాక్స్‌లోనే ఉంచడం మంచిది. ఇది ఫ్రిజ్‌లోని ఇతర పదార్థాల వాసనలను గుడ్లు పీల్చుకోకుండా కాపాడుతుంది.

ఫ్రిజ్ తలపుల వైపు పెట్టకండి: సాధారణంగా చాలామంది ఫ్రిజ్ తలుపుల వద్ద ఉన్న రాక్‌లలో గుడ్లను పెడతారు. కానీ తలుపు తరచూ తీసి వేయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు మారుతుంటాయి. కాబట్టి ఫ్రిజ్ లోపలి షెల్ఫ్‌లలోనే నిల్వ చేయాలి.

ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండాలి: ఫ్రిజ్ లోపల ఉష్ణోగ్రత 4°డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు బ్యాక్టీరియా వేగంగా పెరగదు.

ఫ్రిజ్‌లో పెట్టేముందు కడగవద్దు: మార్కెట్లో లభించే గుడ్లపై సహజమైన రక్షణ పొర ఉంటుంది. నీటితో కడిగితే ఆ పొర దెబ్బతిని బ్యాక్టీరియా లోపలికి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి వండే ముందు మాత్రమే కడగాలి.

పాత గుడ్లను ముందే వాడండి: కొన్న తేదీ ఆధారంగా పాతబడిన గుడ్లను ముందుగా వాడే పద్ధతిని అలవాటు చేసుకోండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON