...
...
Next Story

Workout Timings : పొద్దున్నా లేక సాయంత్రమా? ఏ సమయంలో వర్కౌట్ చేస్తే త్వరగా రిజల్ట్ వస్తుంది!

Morning vs evening workout : వర్కౌట్స్​ అనేవి ఉదయం చేయడం మంచిదా? లేక సాయంత్రం చేస్తే బెటర్​ ఆ? మన శరీరానికి ఏది సూట్​ అవుతుందో ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని ఇక్కడ చూసేయండి..

Published on: Apr 26, 2026, 14:01:37 IST
Advertisement

Best time for workouts : వ్యాయామం అనగానే మనం ఎన్ని సెట్లు చేస్తున్నాం, ఎంత బరువు ఎత్తుతున్నాం అనే దానిపైనే దృష్టి పెడతాం. కానీ ఏ సమయంలో వ్యాయామం చేస్తున్నాం అనేది పట్టించుకోము! కానీ టైమింగ్​ కూడా ఫలితాలపై ప్రభావం చూపుతుందా? ఉదయం పూట చెమట చిందించడం మంచిదా లేక రోజంతా పనులు ముగించుకుని సాయంత్రం జిమ్‌కి వెళ్లడం మేలా?

వర్కౌట్స్​.. మార్నింగ్​ చేయాలా? లేక ఈవినింగ్​ బెటర్​ ఆ? (Freepik)
వర్కౌట్స్​.. మార్నింగ్​ చేయాలా? లేక ఈవినింగ్​ బెటర్​ ఆ? (Freepik)

ఈ సందేహాలపై 'ఎనీటైమ్ ఫిట్‌నెస్ ఇండియా' నిపుణుడు కుశాల్ పాల్ సింగ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సమయం ఏదైనా సరే, మీ శరీరతత్వం, జీవనశైలిని బట్టి ప్రయోజనాలు మారుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఉదయం పూట వర్కౌట్స్​..

చాలామంది ఫిట్‌నెస్ ఫ్రీక్స్ ఉదయాన్నే వర్కౌట్స్ చేయడానికి ఇష్టపడతారు. దీనికి ప్రధాన కారణం క్రమశిక్షణ.

ప్రయోజనాలు:

కన్సిస్టెన్సీ: ఉదయాన్నే వ్యాయామం పూర్తి చేయడం వల్ల ఆ రోజంతా వచ్చే ఆఫీస్ మీటింగ్‌లు లేదా ఇతర పనుల వల్ల వర్కౌట్ మిస్ అయ్యే అవకాశం ఉండదు. కన్సిస్టెన్సీ మెరుగ్గా ఉంటుంది.

మెటబాలిజం బూస్ట్: పొద్దున్నే చేసే వర్కౌట్ మీ జీర్ణక్రియను వేగవంతం చేసి, రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.

ఏకాగ్రత: ఉదయాన్నే చెమట చిందించడం వల్ల మెదడు చురుగ్గా మారి, ఆఫీసు పనులపై శ్రద్ధ పెరుగుతుంది.

విజయ భావన: రోజును ఒక మంచి పనితో ప్రారంభించామనే తృప్తి మీ మూడ్‌ని రోజంతా పాజిటివ్‌గా ఉంచుతుంది.

లోపాలు:

ఉదయం వేళ శరీరం కొంత బిగుసుకుపోయి (స్టిఫ్) ఉంటుంది. అలాగే ఎనర్జీ లెవల్స్ తక్కువగా ఉండవచ్చు. అందుకే ఉదయం పూట వర్కౌట్ చేసేవారు నేరుగా బరువులు ఎత్తకుండా, కచ్చితంగా వార్మప్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

సాయంత్రం పూట వర్కౌట్స్..

శారీరక పటుత్వం: రోజంతా మనం కదులుతూ ఉంటాం కాబట్టి, సాయంత్రానికి శరీరం సహజంగానే వార్మప్ అయి ఉంటుంది. దీనివల్ల కండరాలు సరళంగా మారి, భారీ బరువులు ఎత్తడానికి సహకరిస్తాయి.

ఒత్తిడి తగ్గింపు: ఆఫీసులో లేదా బయట పడ్డ రోజంతా టెన్షన్‌ను వదిలించుకోవడానికి ఈవినింగ్ వర్కవుట్ ఒక 'స్ట్రెస్ బస్టర్'లా పనిచేస్తుంది.

హై-ఇంటెన్సిటీ: తీవ్రమైన వ్యాయామాలు చేయడానికి సాయంత్రం వేళ మన శరీరం ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది.

లోపాలు:

సాయంత్రం పూట తీవ్రమైన వ్యాయామాలు చేస్తే కొందరిలో నిద్ర పట్టడం కష్టమవ్వచ్చు. అలాగే రోజంతా పని చేసి అలసిపోవడం వల్ల 'ఇవాళ వద్దులే' అని జిమ్‌కి వెళ్లకుండా, వ్యాయామాలు చేయకుండా బద్ధకించే అవకాశం ఉంది.

మీకు ఏది సెట్ అవుతుంది?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సమయం కంటే ‘కన్సిస్టెన్సీ’ ముఖ్యం!

మీకు ఒక క్రమపద్ధతి, రూటీన్ కావాలనుకుంటే ఉదయం సమయాన్ని ఎంచుకోండి.

మీకు బలం, పర్ఫార్మెన్స్ పెంచుకోవడమే లక్ష్యం అయితే సాయంత్రం సమయం మేలు.

మీ శరీరంలోని శక్తి స్థాయిలను బట్టి, మీ దైనందిన జీవితానికి ఏది అడ్డంకి కాదో ఆ సమయాన్నే ఖరారు చేసుకోవడం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో గడియారం ముల్లు కంటే మీ సంకల్పమే ముఖ్యం!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON