పొట్ట దగ్గర కొవ్వు కరగాలా..? ఈ 5 డ్రింక్స్‌తో ఈజీగా వెయిట్ లాస్ కావొచ్చు
బరువు తగ్గడం అనేది ఒక సవాలుతో కూడిన ప్రక్రియ. అయితే మీ వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో చేసే పానీయాలతో కూడా తగే అవకాశం ఉంది.
ప్రస్తుతం కాలంలో పెరిగిన పని ఒత్తిడి, మారిన జీవనశైలి కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక బరువు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా బొడ్డు చుట్టూ పేరుకుపోయే కొవ్వు… చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే… అనేక సమస్యలకు దారి తీస్తుంది.

బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది మౌలిక సూత్రాలు. కేవలం ఇలా మాత్రమే కాకుండా… కొన్ని సహజ పానీయాలు కూడా మేలు చేస్తాయి. కేవలం జీవక్రియను (Metabolism) వేగవంతం చేయడమే కాకుండా… రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి.
ప్రముఖ న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ నిపుణురాలు ఖుషీ ఛబ్రా… బరువు తగ్గాలనుకునే వారి కోసం ఐదు అద్భుతమైన పానీయాలను సూచించారు. ముఖ్యమంగా బొడ్డు చుట్టూ ఉండే కొవ్వును కరిగించాలంటే ప్రతిరోజూ ఈ పానీయాలను తీసుకుంటే… వెయిట్ లాస్ జర్నీని చాలా సులభతరమవుతందని అభిప్రాయపడ్డారు.
1. ఆపిల్ సైడర్ వెనిగర్: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. దీనిని భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చు. అసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ (GERD) సమస్యలు ఉంటే మాత్రం దీనికి దూరంగా ఉండటం మంచిదని ఆమె సూచించారు.
2. గ్రీన్ టీ: గ్రీన్ టీలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతాయి. దీనివల్ల క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. రోజులో ఎప్పుడైనా గ్రీన్ టీ తాగొచ్చు. కానీ, సాయంత్రం 6 గంటల తర్వాత తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే కెఫీన్ నిద్రకు ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది.
3. షుగర్ లేని బ్లాక్ కాఫీ:
బ్లాక్ కాఫీలో ఉండే 'పాలీఫెనాల్స్' రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించి బరువు తగ్గడానికి సహాయపడతాయి. కాఫీలో చక్కెర అస్సలు కలపకూడదు. అలాగే భోజనం చేస్తున్న సమయంలో దీనిని తాగకూడదు. ఎందుకంటే ఇది ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. దీనిని కూడా సాయంత్రం 6 లోపే ముగించాలి.
4. దాల్చినచెక్క టీ (Cinnamon Tea): దాల్చినచెక్క వంటింట్లో దొరికే ఒక అద్భుతమైన మసాలా దినుసు. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. తిన్న తర్వాత రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా అడ్డుకుంటుంది.ఈ అద్భుతమైన టీని రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు.
5. అల్లం టీ (Ginger Tea):
అల్లం సహజంగానే ఆకలిని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో దీనికి సాటి లేదు. కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించడం ద్వారా మనం అనవసర ఆహారం తీసుకోకుండా ఇది కాపాడుతుంది. అల్లం టీని రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు.
కేవలం ఈ పానీయాలు తాగితేనే సరిపోదు. వీటితో పాటు సరైన పోషకాహారంతో శారీరక శ్రమ తోడైనప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని అని ఖుషీ ఛబ్రా స్పష్టం చేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ):
ప్రశ్న: బరువు తగ్గడానికి ఈ పానీయాలు మాత్రమే సరిపోతాయా?
జ: లేదు, ఇవి కేవలం సహాయకారిగా మాత్రమే పనిచేస్తాయి. వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, పౌష్టికాహారం తప్పనిసరి.
ప్రశ్న: గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ రాత్రి సమయంలో తీసుకోవచ్చా..?
జ: వద్దు. వీటిలో ఉండే కెఫీన్ వల్ల రాత్రి నిద్ర పట్టకపోవచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల లోపే వీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రశ్న : అసిడిటీ ఉన్నవారు ఆపిల్ సైడర్ వెనిగర్ వాడవచ్చా?
జ: అసిడిటీ లేదా కడుపులో మంట వంటి సమస్యలు ఉన్నవారు ఆపిల్ సైడర్ వెనిగర్‌కు దూరంగా ఉండటమే ఉత్తమం.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

