Thailand Travel Rules 2026 : భారతీయుల ఫేవరెట్ టూరిస్ట్ డెస్టినేషన్స్‌లో థాయ్‌లాండ్ ఒకటి. ఇక ఇప్పుడు భారతీయుల కోసం ఆ దేశం రూల్స్‌ని మరింత సింప్లిఫై చేసింది! ఇప్పటివరకు ఉన్న వీసా ఆన్ అరైవల్ చిక్కులు, ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు ఇకపై ఉండవు. భారతీయ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఇప్పుడు ఎటువంటి ముందస్తు వీసా లేకుండానే థాయ్‌లాండ్‌లో నేరుగా అడుగుపెట్టవచ్చు. అంతేకాదు, లాంగ్ స్టే కోరుకునే వారి కోసం కూడా కొత్త వెసులుబాటును కల్పించింది.
60 రోజుల పాటు వీసా ఫ్రీ ఎంట్రీ!

గతంలో భారతీయులకు కేవలం 30 రోజుల వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉండేది. దీనికోసం ఎయిర్‌పోర్ట్‌లో ఫీజు చెల్లించి, లైన్లలో నిలబడి డాక్యుమెంటేషన్ పూర్తి చేయాల్సి వచ్చేది. కానీ తాజా నిబంధనల ప్రకారం, భారతీయులు ఇప్పుడు ఎటువంటి వీసా లేకుండానే 60 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో ఉండవచ్చు. అంతేకాకుండా, అవసరమైతే మరో 30 రోజులు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. అంటే మొత్తం 90 రోజుల సుదీర్ఘ పర్యటనను ప్లాన్ చేసుకోవచ్చు.
పర్యాటకులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..
థాయ్‌లాండ్ వీసా అవసరం లేనప్పటికీ, ప్రయాణికులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది:
పాస్‌పోర్ట్: కనీసం ఆరు నెలల వాలిడిటీ ఉన్న చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉండాలి.
రిటర్న్ టికెట్: మీరు తిరిగి వచ్చే లేదా ఇతర దేశానికి వెళ్లే విమాన టికెట్లు చూపించాల్సి ఉంటుంది.
వసతి సౌకర్యం: హోటల్ బుకింగ్ వివరాలు లేదా స్నేహితులు/బంధువుల వద్ద ఉంటున్నట్లయితే ఆ అడ్రస్ ప్రూఫ్ సిద్ధంగా ఉంచుకోవాలి.
టీడీఏసీ కార్డ్: థాయ్‌లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ (టీడీఏసీ)ని ప్రయాణానికి కనీసం 3 రోజుల ముందే ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి. ఇది పాత వీసా డాక్యుమెంటేషన్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
కొత్తగా 'టూరిస్ట్ ఎంట్రీ ఫీజు'..
వీసా ప్రక్రియను సులభతరం చేసిన థాయ్‌లాండ్, విమాన మార్గంలో వచ్చే విదేశీ పర్యాటకులపై చిన్నపాటి ఫీజును విధించే ఆలోచనలో ఉంది. ఇది అమలులోకి వస్తే, ఒక్కో పర్యాటకుడు సుమారు 300 థాయ్ బాట్ (దాదాపు రూ. 860) ఎంట్రీ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
డిజిటల్ నోమాడ్స్ కోసం సరికొత్త ఆఫర్లు..
{{/usCountry}}వీసా ప్రక్రియను సులభతరం చేసిన థాయ్‌లాండ్, విమాన మార్గంలో వచ్చే విదేశీ పర్యాటకులపై చిన్నపాటి ఫీజును విధించే ఆలోచనలో ఉంది. ఇది అమలులోకి వస్తే, ఒక్కో పర్యాటకుడు సుమారు 300 థాయ్ బాట్ (దాదాపు రూ. 860) ఎంట్రీ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
డిజిటల్ నోమాడ్స్ కోసం సరికొత్త ఆఫర్లు..
{{/usCountry}}చదువుకుంటూ పని చేసుకోవాలనుకునే వారి కోసం 'ఈడీ ప్లస్' వీసాను, రిమోట్ వర్క్ చేసుకునే ప్రొఫెషనల్స్ కోసం (డిజిటల్ నోమాడ్స్) 'డీటీవీ' వీసాను థాయ్‌లాండ్ పరిచయం చేసింది. దీనివల్ల బ్యాంకాక్ లేదా ఫుకెట్ వంటి అందమైన ప్రదేశాల్లో ఉంటూ తమ ఆఫీస్ పనులు కూడా చేసుకోవచ్చు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!..
పర్యాటక వీసాపై వచ్చిన వారు అక్కడ ఉద్యోగాలు చేయడం లేదా వ్యాపారాలు చేయడం చట్టవిరుద్ధం. నిర్దేశించిన గడువు కంటే ఎక్కువ కాలం అనుమతి లేకుండా ఉంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష లేదా ఆ దేశంలోకి రాకుండా జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. భారతీయులకు థాయ్‌లాండ్ వీసా ఫ్రీ ఎంట్రీ ఎన్ని రోజులు ఉంటుంది?
భారతీయులు ఇప్పుడు ఎటువంటి వీసా లేకుండా 60 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చు.
2. 60 రోజుల తర్వాత కూడా అక్కడ ఉండవచ్చా?
అవును, మరో 30 రోజుల పాటు పొడిగింపు తీసుకోవచ్చు. దీనివల్ల మొత్తం 90 రోజులు ఉండే అవకాశం లభిస్తుంది.
3. థాయ్‌లాండ్ వెళ్లే ముందు ఏ డాక్యుమెంట్లు అవసరం?
వాలిడ్ పాస్‌పోర్ట్, రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ వివరాలు, థాయ్‌లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ తప్పనిసరి.