వినాయక చవితి 2026: వినాయక చవితి నాడు వినాయకుడికి ఇష్టమైన ఈ నైవేద్యాలను సమర్పిస్తే వినాయకుని అనుగ్రహం కలిగి శుభ ఫలితాలను చూడొచ్చు. వినాయక చవితి నాడు ఏ ప్రసాదాలను చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే వినాయకుడికి ఇష్టమైన ఈ ప్రసాదాలను తప్పక తయారు చేయండి. వినాయకుని పూర్తి అనుగ్రహంతో సంతోషంగా ఉండండి.

వినాయక చవితి నాడు గణపతికి సాంప్రదాయంగా సమర్పించే ముఖ్యమైన నైవేద్యాలు ఇవి. వినాయకుడికి ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, బూందీ లడ్డు, పులిహోర, చలిమిడి, పానకం, వడపప్పు, కొబ్బరి, అరటి పండ్లు, ఇతర పండ్లను నైవేద్యంగా పెట్టడం మంచిది. అలాగే వినాయకుని పూజలో కచ్చితంగా ఎర్ర మందారాలు, గరిక, కొబ్బరి కూడా ఉండేటట్టు చూసుకోవాలి.
వినాయక చవితికి ఉండ్రాళ్లను ఇలా సులువుగా తయారు చేసుకోండి
వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లను తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
ఒక కప్పు బియ్యం రవ్వ, రెండు కప్పుల నీళ్లు, రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము, నీళ్లలో నానబెట్టిన శనగపప్పు ఒక టేబుల్ స్పూన్.
ఉండ్రాళ్లను తయారు చేసే విధానం
శనగపప్పుని నానబెట్టండి:
ముందు శనగపప్పుని అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోండి.
నీళ్లను మరిగించండి:
ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి, అందులో ఉప్పు, జీలకర్ర, నెయ్యి వేసి మరిగించండి.
బియ్యం రవ్వ:
నీళ్లు మరిగిన తర్వాత బియ్యం రవ్వను ఆ నీళ్లల్లో వేసేసి, ఉండలు కట్టకుండా కలుపుకోండి. రవ్వకు డబుల్ నీళ్లు ఉంటే సరిపోతుంది. మూత పెట్టి సిమ్‌లో ఉంచి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు రవ్వను బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత పొయ్యి ఆపేసి చల్లారబెట్టుకోవాలి.
వీటిని కలపండి
అది చల్లారిన తర్వాత నానబెట్టిన శనగపప్పు, కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. చేతులకి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
ఆవిరిపై ఉడికించండి
{{/usCountry}}అది చల్లారిన తర్వాత నానబెట్టిన శనగపప్పు, కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. చేతులకి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
ఆవిరిపై ఉడికించండి
{{/usCountry}}ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ఉండ్రాళ్లను ఇడ్లీ ప్లేట్ లేదా స్టీమర్‌లో పెట్టి ఆవిరిపై ఉడికించుకోవాలి. ఉండ్రాళ్లు మెత్తగా రావాలంటే బియ్యం రవ్వను నీటిలో సరైన నిష్పత్తిలో ఉడికించుకోవాలి. ఆవిరిపై ఎక్కువ సేపు ఉంచకుండా చూసుకోవాలి.
ఇలా చిటికెలో పానకం, వడపప్పుని తయారు చేసుకోండి
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి నీళ్లలో ఒక గంట పాటు నానబెట్టండి.
పెసరపప్పు బాగా నానిన తర్వాత నీటిని పూర్తిగా తీసేసి, పెసరపప్పును పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అందులో కొంచెం కొబ్బరి తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్స్ చేయాలి.
చివరగా నిమ్మరసం వేసుకుంటే రుచి బాగుంటుంది.
పానకాన్ని కూడా ఇలా సులువుగా తయారు చేసుకోవచ్చు
ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని, అందులో బెల్లం వేసి కరిగించండి. ఆ తర్వాత మిరియాల పొడి, యాలకుల పొడి, అల్లం తురుము, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకోండి.
అన్ని పదార్థాలు నీళ్లలో బాగా కలిసిన తర్వాత ఆ పానకాన్ని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి.