ఈ యాలకుల పరిహారాలతో సంపద రెట్టింపు.. చాలా సమస్యలు దూరం!

జ్యోతిష్య, వాస్తు విశ్వాసాల ప్రకారం ఆకుపచ్చ యాలకులను జేబులో లేదా పర్సులో ఉంచడం సానుకూల శక్తి, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుందని చెబుతారు. ముఖ్యంగా శుక్రుడు, బుధ గ్రహాల అనుగ్రహం కోసం ఈ పరిహారాన్ని పాటించవచ్చని భావిస్తారు. 

Published on: Sep 8, 2026, 12:30:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే, ఈ రోజు కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి అద్భుతమైన పరిహారాల గురించి చూద్దాం.

ఈ యాలకుల పరిహారాలతో సంపద రెట్టింపు.. చాలా సమస్యలు దూరం! (AI)
ఈ యాలకుల పరిహారాలతో సంపద రెట్టింపు.. చాలా సమస్యలు దూరం! (AI)

భారతీయ వంటగదిలో యాలకులకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. టీ నుంచి మిఠాయిల వరకు చాలా రకాల వంటకాల్లో యాలకులను వాడతారు. అయితే, వంటలకే పరిమితం కాదు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో కూడా ఈ యాలకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలకులు సానుకూల శక్తిని పెంపొందించడానికి, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడానికి కూడా సహాయం చేస్తాయి.

అందుకే జేబులో లేదా పర్సులో యాలకులను పెట్టుకుంటే మనిషికి శుక్ర, బుధ గ్రహాల అనుగ్రహం. ఆకుపచ్చని యాలకులను శుక్రుడు, బుధ గ్రహాలకు కారకులు అని చెప్తారు. భోగభాగ్యాలు, ఐశ్వర్యాన్ని అందించే శుక్రుడు, బుద్ధి కుశలత, సంభాషణ మొదలైన వాటికి కారకుడైన బుధుడు జాతకంలో బలంగా ఉంటే వ్యక్తి జీవితంలో తిరుగే ఉండదు.

ఇంటర్వ్యూలు, వ్యాపార సమావేశాలు

ఏదైనా ముఖ్యమైన ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశాల్లో పాల్గొంటున్నట్లయితే, మీ జేబులో లేదా పర్సులో రెండు లేదా మూడు శుభ్రమైన ఆకుపచ్చ యాలకులను ఉంచండి. దీంతో సానుకూల ఫలితాలను చూడొచ్చు.

అలాగే, దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు, పరీక్షలు రాయడానికి వెళ్లేటప్పుడు కూడా ఈ పరిహారాన్ని పాటిస్తే మంచిది. దీని వలన ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వ్యక్తి తన భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి కూడా వీలవుతుంది. ఏకాగ్రత కూడా రెట్టింపు అవుతుంది.

రాహువు, కేతువుల ప్రభావం

రాహువు, కేతువుల ప్రభావం నుంచి ఉపశమనాన్ని పొందడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. గందరగోళాలను తొలగించడానికి కూడా వీలవుతుంది.

సరైన విధంగా యాలకులను ఎలా ఉంచాలి?

ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జేబులో లేదా పర్సులో రెండు లేదా మూడు శుభ్రమైన యాలకులను ఉంచండి. తర్వాత రోజు పాత వాటిని తొలగించి, కొత్త వాటిని చేర్చండి.

పాత వాటిని పారేయకుండా మామూలుగా వంటల్లో వాడుకోవచ్చు. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే, వాటిని పచ్చటి మొక్కలు వేసేయండి.

నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More