వినాయక చవితి 2026: గణపతికి ఇష్టమైన నైవేద్యాలు.. ఉండ్రాళ్లు, పానకం, వడపప్పును ఇలా సులువుగా చేసేయచ్చు!
వినాయక చవితి 2026 సందర్భంగా గణపతికి ఇష్టమైన సంప్రదాయ నైవేద్యాలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, బూందీ లడ్డు, పులిహోర, చలిమిడి, పానకం, వడపప్పు, కొబ్బరి, అరటి పండ్లు, ఇతర పండ్లను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు.
వినాయక చవితి 2026: వినాయక చవితి నాడు వినాయకుడికి ఇష్టమైన ఈ నైవేద్యాలను సమర్పిస్తే వినాయకుని అనుగ్రహం కలిగి శుభ ఫలితాలను చూడొచ్చు. వినాయక చవితి నాడు ఏ ప్రసాదాలను చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే వినాయకుడికి ఇష్టమైన ఈ ప్రసాదాలను తప్పక తయారు చేయండి. వినాయకుని పూర్తి అనుగ్రహంతో సంతోషంగా ఉండండి.

వినాయక చవితి నాడు గణపతికి సాంప్రదాయంగా సమర్పించే ముఖ్యమైన నైవేద్యాలు ఇవి. వినాయకుడికి ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, బూందీ లడ్డు, పులిహోర, చలిమిడి, పానకం, వడపప్పు, కొబ్బరి, అరటి పండ్లు, ఇతర పండ్లను నైవేద్యంగా పెట్టడం మంచిది. అలాగే వినాయకుని పూజలో కచ్చితంగా ఎర్ర మందారాలు, గరిక, కొబ్బరి కూడా ఉండేటట్టు చూసుకోవాలి.
వినాయక చవితికి ఉండ్రాళ్లను ఇలా సులువుగా తయారు చేసుకోండి
వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లను తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
ఒక కప్పు బియ్యం రవ్వ, రెండు కప్పుల నీళ్లు, రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము, నీళ్లలో నానబెట్టిన శనగపప్పు ఒక టేబుల్ స్పూన్.
ఉండ్రాళ్లను తయారు చేసే విధానం
శనగపప్పుని నానబెట్టండి:
ముందు శనగపప్పుని అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోండి.
నీళ్లను మరిగించండి:
ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి, అందులో ఉప్పు, జీలకర్ర, నెయ్యి వేసి మరిగించండి.
బియ్యం రవ్వ:
నీళ్లు మరిగిన తర్వాత బియ్యం రవ్వను ఆ నీళ్లల్లో వేసేసి, ఉండలు కట్టకుండా కలుపుకోండి. రవ్వకు డబుల్ నీళ్లు ఉంటే సరిపోతుంది. మూత పెట్టి సిమ్‌లో ఉంచి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు రవ్వను బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత పొయ్యి ఆపేసి చల్లారబెట్టుకోవాలి.
వీటిని కలపండి
అది చల్లారిన తర్వాత నానబెట్టిన శనగపప్పు, కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. చేతులకి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
ఆవిరిపై ఉడికించండి
ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ఉండ్రాళ్లను ఇడ్లీ ప్లేట్ లేదా స్టీమర్‌లో పెట్టి ఆవిరిపై ఉడికించుకోవాలి. ఉండ్రాళ్లు మెత్తగా రావాలంటే బియ్యం రవ్వను నీటిలో సరైన నిష్పత్తిలో ఉడికించుకోవాలి. ఆవిరిపై ఎక్కువ సేపు ఉంచకుండా చూసుకోవాలి.
ఇలా చిటికెలో పానకం, వడపప్పుని తయారు చేసుకోండి
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి నీళ్లలో ఒక గంట పాటు నానబెట్టండి.
పెసరపప్పు బాగా నానిన తర్వాత నీటిని పూర్తిగా తీసేసి, పెసరపప్పును పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అందులో కొంచెం కొబ్బరి తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్స్ చేయాలి.
చివరగా నిమ్మరసం వేసుకుంటే రుచి బాగుంటుంది.
పానకాన్ని కూడా ఇలా సులువుగా తయారు చేసుకోవచ్చు
ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని, అందులో బెల్లం వేసి కరిగించండి. ఆ తర్వాత మిరియాల పొడి, యాలకుల పొడి, అల్లం తురుము, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకోండి.
అన్ని పదార్థాలు నీళ్లలో బాగా కలిసిన తర్వాత ఆ పానకాన్ని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


