Tata Punch EV : రూ. 9.69 లక్షలకే టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్- రేంజ్ ఎంతంటే..
మచ్ అవైటెడ్ టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ని టాటా మోటార్స్ శుక్రవారం లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ రేంజ్, ఫీచర్స్, ధర సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గత నెలలో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ని లాంచ్ చేసిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్.. శుక్రవారం మచ్ అవైటెడ్ 2026 టాటా పంచ్ ఈవీని విడుదల చేసింది. ఈ మేరకు ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్‌ని నిర్వహించి ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన కీలక వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ రేంజ్, ఫీచర్స్ సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్- ఎక్స్టీరియర్..
2026 టాటా పంచ్ ఈవీ కొత్త ఫ్రెంట్ డిజైన్‌తో కూడిన పాత సిల్హౌట్‌ని కలిగి ఉంటుంది. ఫలితంగా ఇది ఫ్రెంట్ డిజైన్ విషయంలో నెక్సాన్ ఈవీ, హారియర్ ఈవీ సరసన చేరింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఫ్రెంట్ ఇప్పుడు మరింత క్లీన్‌గా కనిపిస్తోంది. పాత మోడల్లో ఉన్న బ్లాక్ స్ట్రిప్‌ని తీసేసి, ముందువైపు క్లోజ్డ్ గ్రిల్ మాత్రమే ఉంచారు. ఇప్పుడు లుక్ ఫ్రెష్‌గా ఉంది. ఇందులో ఫుల్ విడ్త్ లైట్ స్ట్రిప్‌తో కూడిన డీఆర్ఎల్స్ ఉంటాయి. బంపర్‌కి కూడా స్వల్పంగా మార్పులు చేశారు.
ఇక ఈ ఈవీ సైడ్ ప్రొఫైల్ పాత మోడల్‌నే పోలి ఉంది. ఫ్రెంట్లో పుల్-స్టైల్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. రేర్లోని డోర్ హ్యాండిల్స్ సీ-పిల్లర్కే ఉంటాయి.
ఇప్పుడు టాటా పంచ్ ఈవీ బరువు 1360 కేజీలు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 195ఎంఎం. 450ఎంఎం లోతున్న నీటిలో కూడా ఈ ఎలక్ట్రిక్ కారు ప్రయాణించగలదు.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్- ఇంటీరియర్..
టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇంటీరియర్ ఇప్పుడు ఉదయ్‌పూర్ థీమ్‌తో కూడిన లెథరెట్ అప్‌హోలిస్ట్రీ, డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డు, లైట్ కలర్స్, టాగిల్ స్విఛ్లతో వస్తోంది.
ఇందులో నేవిగేషన్, ఎనలిటిక్స్, రిమోట్ కమాండ్స్‌తో పాటు మరిన్ని ఆపరేషన్స్ చేగలగే కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఉంటుంది.
{{/usCountry}}ఇందులో నేవిగేషన్, ఎనలిటిక్స్, రిమోట్ కమాండ్స్‌తో పాటు మరిన్ని ఆపరేషన్స్ చేగలగే కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఉంటుంది.
{{/usCountry}}గతంలో ఉన్న 10.2 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ని 12.3 ఇంచ్‌తో రిప్లేస్ చేసింది టాటా మోటార్స్. ఇక హయ్యర్ వేరియంట్లలో ప్రీమియం ఆడియో సిస్టెమ్ని కూడా అమర్చింది.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్- సరికొత్త ఈటీఎక్స్వీ సిస్టెమ్..

{{/usCountry}}2026 టాటా పంచ్‌లో, సెగ్మెంట్లోనే తొలి ఈటీఎక్స్వీ సిస్టెమ్ ఉందని సంస్థ వెల్లడించింది. ఈ వ్యవస్థ క్యాబిన్ని ఆప్టిమైజ్ చేస్తుందని, బ్యాటరీని కూల్ చేస్తుందని పేర్కొంది. దీని వల్ల ప్యాసింజర్‌కి సౌకర్యం పెరగడంతో పాటు ఎఫీషియెన్సీ 1శాతం వృద్ధి చెందుతుందని స్పష్టం చేసింది.

{{/usCountry}}ఈ పంచ్ ఈవీలో ఐ-ఎఫ్ఏటీసీ సెటప్ కూడా ఉంది. ఇదొక ఇంటెలిజెంట్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వ్యవస్థ అని, దీని ద్వారా మొత్తం ఈవీ పర్ఫార్మెన్స్ మెరుగుపడుతుందని సంస్థ పేర్కొంది.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్- బ్యాటరీ, రేంజ్..

{{/usCountry}}టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని సంస్థ ఇచ్చింది. ఈ 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 468 కి.మీ ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్‌ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. రియల్- వరల్డ్‌లో దీని రేంజ్ 355 కి.మీ వరకు ఉంటుందని స్పష్టం చేసింది.

{{/usCountry}}అంతేకాదు ఇందులో 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని కొనసాగించారు. దీని రియల్ వరల్డ్ రేంజ్ 265 కి.మీ నుంచి 280 కి.మీ వరకు ఉంటుంది.
పాత 25 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని సంస్థ డిస్కంటిన్యూ చేసింది.
ఈ కొత్త పంచ్ ఈవీలో 95 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఈ మైక్రో ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. 0-100 కేఎంపీహెచ్ స్పీడ్‌ని కేవలం 9 సెకన్లలో అందుకుంటుందని టాటా మోటార్స్ స్పష్టం చేసింది.
ఈ 2026 టాటా పంచ్‌ని ఫాస్ట్ ఛార్జర్‌తో 20-80శాతం ఛార్జ్ చేసేందుకు కేవలం 26 నిమిషాల సమయం పడుతుందని సంస్థ ప్రకటించింది. 15 నిమిషాల ఛార్జింగ్‌తో 135 కి.మీ దూరం ప్రయాణించవచ్చని వివరించింది. అంతేకాదు మల్టిపుల్ ఛార్జింగ్ ఆప్షన్స్ (డీసీ ఫాస్ట్ ఛార్జర్, వాల్‌బాక్స్ ఛార్జర్, హోమ్ ఛార్జర్)ని సంస్థ ప్రవేశపెట్టింది.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్- సేఫ్టీ ఫీచర్స్..
భద్రతకు పెట్టింది పేరుగా గుర్తింపు ఉన్న టాటా మోటార్స్.. ఈ పంచ్ ఈవీలో కూడా అనేక సేఫ్టీ ఫీచర్స్‌ని ఇచ్చింది. ప్రతి వేరియంట్‌కి ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐ-టీపీఎంఎస్, ISOFIX మౌంట్స్ స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి.
అంతేకాదు, కొత్త ఐ- హై బీమ్ అసిస్ట్ కూడా ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఉంటుంది. ఇది హై బీమ్‌ని డిటెక్ట్ చేసి, డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ 10కేఎంపీహెచ్- 40కేఎంపీహెచ్ స్పీడ్‌లో పనిచేస్తుంది. ఇది అన్ని వేరియంట్లకు స్టాండర్డ్‌గా లభిస్తుంది.
మొత్తం మీద ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి 5 స్టార్ సేఫ్టీ లభిస్తుందని టాటా మోటార్స్ ప్రకటించింది.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్- వేరియంట్లు, వాటి ధరలు..
టాటా పంచ్ ఈవీ 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. అవి..
స్మార్ట్- రూ. 9.69 లక్షలు
స్మార్ట్+ - రూ. 10.29 లక్షలు
ఇక టాటా పంచ్ ఈవీ 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 4 వేరియంట్లలో లభిస్తోంది. అవి..
స్మార్ట్+ - రూ. 10.89 లక్షలు
అడ్వెంచర్- రూ. 11.59 లక్షలు
ఎంపవర్డ్- రూ. 12.29 లక్షలు
ఎంపవర్డ్+ ఎస్- రూ. 12.59 లక్షలు
* ఇవి ఇంట్రొడక్టరీ ఎక్స్‌షోరూం ధరలు అని గుర్తుపెట్టుకోవాలి.
ఈ 2026 టాటా పంచ్ ఈవీలో బీఏఏఎస్ (బ్యాటరీ ఆస్ ఏ సర్వీస్) ప్రోగ్రామ్ని కూడా సంస్థ ప్రారంభించింది. ఈ బీఏఏఎస్ ప్రారంభ ధర రూ. 6.49లక్షలు + రూ. 2.6 / కి.మీ బ్యాటరీ ఈఎంఐగా సంస్థ నిర్ణయించింది.