దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘టాటా మోటార్స్’.. మార్కెట్లోకి తన మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ సరికొత్త '2026 టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్', ‘టియాగో ఈవీ’ మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. సరికొత్త లుక్, లగ్జరీ ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లతో వచ్చిన ఈ కారు పెట్రోల్ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 4.69 లక్షలుగా, ఎలక్ట్రిక్ వేరియంట్ ప్రారంభ ధరను రూ. 6.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. మార్కెట్లో మారుతీ సుజుకీ స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కార్లకు పోటీగా టాటా ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను తీసుకువచ్చింది.

పాత మోడల్‌తో పోలిస్తే 2026 టాటా టియాగో డిజైన్, ఫీచర్ల పరంగా పూర్తిగా మారిపోయింది. ఇందులో కస్టమర్ల కోసం పెట్రోల్, సీఎన్జీ, ఈవీ అనే మూడు రకాల ఇంధన ఆప్షన్లను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.
ఈ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ కార్ల పూర్తి వివరాలు, వేరియంట్లు, స్పెసిఫికేషన్లు ఇక్కడ చూద్దాము..
2026 టాటా టియాగో సిరీస్ ధరల వివరాలు..
టియాగో పెట్రోల్ (ఐసీఈ): ప్రారంభ ధర రూ. 4.69 లక్షలు.
టియాగో ఐసీఎన్జీ (సీఎన్‌జీ): ప్రారంభ ధర రూ. 5.79 లక్షలు.
| మోడల్ | స్మార్ట్ | ప్యూర్ | ప్యూర్+ | ప్యూర్+ ఏ | క్రియేటివ్ | క్రియేటివ్+ |
|---|---|---|---|---|---|---|
| పెట్రోల్ ఎంటీ | 4.69లక్షలు | 5.49లక్షలు | 5.99లక్షలు | 6.49లక్షలు | 6.99లక్షలు | 7.29లక్షలు |
| సీఎన్జీ ఎంటీ | 5.79లక్షలు | 6.49లక్షలు | 6.99లక్షలు | 7.49లక్షలు | 7.99లక్షలు |
టియాగో ఈవీ : పూర్తి స్థాయి ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు.
టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ బీఏఏఎస్ ఆప్షన్ (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్): ఒకవేళ టియాగో ఈవీని బ్యాటరీ రెంటింగ్ పద్ధతిలో కొనుగోలు చేస్తే, కారు ధర కేవలం రూ. 4.69 లక్షలకే లభిస్తుంది. దీనికి అదనంగా కిలోమీటరుకు రూ. 2.6 చొప్పున బ్యాటరీ వినియోగ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
{{/usCountry}}టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ బీఏఏఎస్ ఆప్షన్ (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్): ఒకవేళ టియాగో ఈవీని బ్యాటరీ రెంటింగ్ పద్ధతిలో కొనుగోలు చేస్తే, కారు ధర కేవలం రూ. 4.69 లక్షలకే లభిస్తుంది. దీనికి అదనంగా కిలోమీటరుకు రూ. 2.6 చొప్పున బ్యాటరీ వినియోగ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
{{/usCountry}}పైన చెప్పినవి ఇంట్రొడక్టరీ ఎక్స్‌షోరూం ధరలు అని గుర్తుపెట్టుకోవాలి.
1. శార్పర్ లుక్ అండ్ మోడర్న్ డిజైన్..
కొత్త టియాగో ఫేస్‌లిఫ్ట్ మునుపటి కంటే చాలా స్పోర్టీగా, లగ్జరీగా కనిపిస్తుంది.
ఫ్రంట్ ప్రొఫైల్: కారు ముందు భాగంలో ఐబ్రో-స్టైల్ డీఆర్‌ఎల్‌లతో కూడిన సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, కొత్త బంపర్, సెంటర్‌లో గ్లోసీ బ్లాక్ ప్యానెల్‌ను అందించారు. ఈవీ మోడల్‌లో ఈ బ్లాక్ ప్యానెల్ స్థానంలో బాడీ-కలర్ ప్యానెల్ ఉంటుంది.
రియర్ ప్రొఫైల్: వెనుక వైపు వర్టికల్ లైన్స్ ఉన్న సరికొత్త ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లు, ఒకదానికొకటి కనెక్ట్ అయినట్లు ఉండే డిజైన్, కొత్త బంపర్, వైపర్ అమర్చారు. కారుకు సరికొత్త అల్లాయ్ వీల్స్ (ఈవీలో ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్) జతచేశారు.
కలర్ ఆప్షన్స్: వారణాసి వైబ్రెన్స్, సోబో సర్జ్, పాంగాంగ్ పల్స్, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే, డేటోనా గ్రే రంగులలో ఇది లభిస్తుంది. టియాగో ఈవీలో అదనంగా 'డెహ్రాడూన్ డ్యూ' కలర్ ఆప్షన్ కలదు.
2. లగ్జరీ ఇంటీరియర్ అండ్ సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు..
కారు క్యాబిన్‌ను టాటా మోటార్స్ ప్రీమియం లుక్‌తో పూర్తిగా మార్చేసింది.
డ్యాష్‌బోర్డ్: బ్లాక్ అండ్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్‌లో నిలువుగా ఉండే డ్యాష్‌బోర్డ్, డ్రైవర్ కోసం సరికొత్త స్టాండ్-అలోన్ డిస్‌ప్లే, మధ్యలో మెరిసే టాటా లోగోతో కూడిన 2-స్పోక్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు.
టెక్నాలజీ: ఇందులో 10.25-ఇంచ్ భారీ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణ.
కీలక ఫీచర్లు: డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటర్, రియర్ ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, ఏఎంటీ గేర్‌బాక్స్‌తో పాటు ప్యాడల్ షిఫ్టర్లు కూడా అందించారు.
సేఫ్టీ: ప్రయాణికుల రక్షణ కోసం 6 స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), హిల్-హోల్డ్ కంట్రోల్, మెరుగైన ఛాసిస్‌ను అందించారు. ఈ కారు గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
3. ఇంజన్, సీఎన్జీ, ఈవీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్..
టియాగో పెట్రోల్ అండ్ సీఎన్జీ :
ఇందులో నమ్మకమైన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 86 హెచ్‌పీ పవర్, 113 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది.
ట్విన్-సిలిండర్ సీఎన్జీ: టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ సీఎన్జీ మోడల్ 75 హెచ్‌పీ పవర్, 96 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. బూట్ స్పేస్ తగ్గకుండా ఇందులో టాటా పేటెంటెడ్ డ్యూయల్-సిలిండర్ టెక్నాలజీని వాడారు.
గేర్‌బాక్స్: పెట్రోల్, సీఎన్జీ రెండూ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. ఈ సెగ్మెంట్‌లో ఒక సీఎన్జీ కారుకు ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి.
2026 టియాగో ఈవీ..
టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది: 19.2 కేడబ్ల్యూహెచ్, 24 కేడబ్ల్యూహెచ్.
రేంజ్: సింగిల్ ఛార్జ్‌పై ఇది కస్టమర్ల వాస్తవ వినియోగంలో 205 కిమీ నుంచి 215 కిమీ మైలేజ్ (రేంజ్) ఇస్తుంది. (ఎంఐడీసీ క్లెయిమ్డ్ రేంజ్ 285 కిమీ).
ఛార్జింగ్: 30 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 18 నిమిషాల ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్‌ను ఇది పొందగలదు. దీనితో పాటు 3.3 కేడబ్ల్యూ పోర్టబుల్ ఛార్జర్, 7.2 కేడబ్ల్యూ హోమ్ ఛార్జర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ ఫీచర్లు, గరిష్ట భద్రత, అద్భుతమైన ఇంధన సామర్థ్యం (మైలేజ్/ఈవీ రేంజ్) కోరుకునే మధ్యతరగతి కుటుంబాలకు 2026 టాటా టియాగో సిరీస్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.