రేపే Tata Punch facelift లాంచ్​- ఈ 5 మార్పులతో..

టాటా మోటార్స్ తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ 'పంచ్' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రేపు విడుదల చేయనుంది. కొత్త కలర్స్, టర్బో పెట్రోల్ ఇంజిన్, 360 డిగ్రీ కెమెరా వంటి అత్యాధునిక హంగులతో రానున్న ఈ కారు విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 12, 2026, 11:30:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాటా మోటార్స్ తన మోస్ట్ సక్సెస్‌ఫుల్ మైక్రో, ఫ్యామిలీ ఎస్‌యూవీ 'పంచ్' కొత్త వెర్షన్‌ను రేపు, జనవరి 13న భారత మార్కెట్​లో గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలైన టీజర్లు ఈ కారుపై భారీ అంచనాలను పెంచేశాయి.

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​..
టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​..

ఈ నేపథ్యంలో ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో వినియోగదారులను ఆకట్టుకునే టాప్ 5 మార్పులును ఇక్కడ తెలుసుకోండి..

రేపే టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​- ఈ మార్పులతో..

1. సరికొత్త రంగుల్లో మెరిసిపోతూ..

2026 టాటా పంచ్ ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుంది. సయంటఫిక్, కారామెల్, బెంగాల్ రూజ్, డేటోనా గ్రే, కూర్గ్ క్లౌడ్స్, ప్రిస్టైన్ వైట్ కలర్ ఆప్షన్లతో ఈ ఎస్​యూవీ మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది.

2. అదిరిపోయే ఎక్స్‌టీరియర్ లుక్..

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ ఎక్స్​టీరియర్​ లుక్ పరంగా టాటా మోటార్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ దీనికి మంచి కళను ఇచ్చాయి. అంతేకాకుండా 16 ఇంచ్​ రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్, కొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఈ మైక్రో ఎస్‌యూవీకి మరింత బోల్డ్ లుక్‌ను తెచ్చిపెట్టాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీ రంగంలో గట్టి పోటీ ఇచ్చేలా దీని డిజైన్ ఉంది.

3. లగ్జరీ ఇంటీరియర్..

2026 టాటా పంచ్​ ఇంటీరియర్​ భాగాన్ని కూడా ప్రీమియంగా మార్చారు. నెక్సాన్​లో చూసినట్లుగానే, వెలుగులీనే టాటా లోగోతో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఇందులో ప్రత్యేక ఆకర్షణ. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కోసం టచ్ ప్యానల్, బ్లూ అండ్ గ్రే కలర్ సీట్ల అప్​హోలిస్ట్రీ, సరికొత్త 7 ఇంచ్​ డ్రైవర్ డిస్​ప్లే ఇంటీరియర్‌కు హైటెక్ లుక్‌ను జోడించాయి.

  • ప్రభాస్ గ్యారేజీలో కోట్లు విలువచేసే లగ్జరీ కార్లు- ఇది మన రాజా సాబ్​ రేంజ్! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

4. భద్రతకు పెద్దపీట.. హైటెక్ ఫీచర్లు..

సేఫ్టీ విషయంలో టాటా ఎప్పుడూ ముందుంటుంది. ఇక టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​లోని అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తున్నాయి. వీటితో పాటు:

  • 360-డిగ్రీ కెమెరా (హై ఎండ్ వేరియంట్లలో)
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్
  • వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్
  • వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్
  • రైన్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

5. పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజిన్..

ఈసారి టాటా పంచ్‌లో అతిపెద్ద అప్‌డేట్ 'టర్బో పెట్రోల్' ఇంజిన్. టీజర్ల ద్వారా ఈ విషయాన్ని సంస్థ ధృవీకరించింది. దీనివల్ల కారు పర్ఫార్మెన్స్ మరింత మెరుగ్గా ఉండబోతోంది.

అయితే, ఇంజిన్ ట్యూనింగ్, గేర్‌బాక్స్ ఆప్షన్ల వివరాలను కంపెనీ రేపు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడించనుంది.

ఈ ఎస్​యూవీ ధరకు సంబంధించిన విషయాలు కూడా లాంచ్​ ఈవెంట్​లో వెల్లడవుతాయి.

మొత్తానికి అదిరిపోయే ఫీచర్లు, అప్డేటెడ్ ఇంజిన్‌తో వస్తున్న టాటా పంచ్ ఫేస్​లిఫ్ట్​ తన విభాగంలో మళ్లీ టాప్ గేర్‌లో దూసుకుపోవడానికి సిద్ధమైంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More