మీ కుటుంబంలోని పెద్దల కోసం లేదా మీకు తెలిసిన సీనియర్ సిటిజన్ల కోసం కారు కొనాలని ఆలోచిస్తున్నప్పుడు, ముందుగా ఒక ప్రశ్న తలెత్తుతుంది! "వారి అవసరం ఏంటి?" అని. మెజారిటీ భారతీయ నగరాల్లో దీనికి సమాధానం.. ఇరుకైన వీధుల్లో సులభంగా నడపగలిగే, పార్కింగ్ చేయడానికి వీలుగా ఉండే కాంపాక్ట్ కార్లు. అంతేకాకుండా, వయసు పైబడిన వారికి ట్రాఫిక్ రద్దీలో పదే పదే క్లచ్ నొక్కడం చాలా కష్టమైన పని. అందుకే వారికి 'ఆటోమేటిక్ గేర్‌బాక్స్' అనేది ఒక విలాసం కాదు, కనీస అవసరం.

సీనియర్ సిటిజన్ల కోసం మేు సిఫార్సు చేస్తున్న ఐదు ఉత్తమ కార్ల వివరాలు కింద ఉన్నాయి. ఈ జాబితా నుంచి మేము 'ఏఎంటీ' టైప్ కార్లను ఉద్దేశపూర్వకంగా తొలగించాను. ఎందుకంటే అవి యాంత్రికంగా మాన్యువల్ గేర్‌బాక్స్‌లే, కేవలం క్లచ్ ఆపరేషన్ మాత్రమే ఆటోమేటిక్. ఇవి తక్కువ ధరకే లభించినప్పటికీ, గేర్లు మారేటప్పుడు జెర్కులు రావడం, తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు స్పందన నెమ్మదిగా ఉండటం వల్ల పెద్దలు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది.
1. హ్యుందాయ్ ఐ20 (ఐవీటీ గేర్‌బాక్స్‌తో)..
హ్యుందాయ్ ఐ20 ఒక స్టైలిష్, మోడరన్ హ్యాచ్‌బ్యాక్. దీనిలోని 'ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్' (ఐవీటీ) ట్రాఫిక్‌లో ఎంతో స్మూత్‌గా ఉంటుంది. దీనిలో గేర్లు మారేటప్పుడు ఎటువంటి కుదుపులు ఉండవు, పవర్ డెలివరీ కూడా చాలా లీనియర్‌గా ఉంటుంది. ఇది ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కావడం వల్ల స్టీరింగ్ కూడా చాలా తేలికగా ఉంటుంది. క్యాబిన్‌లో క్లైమేట్ కంట్రోల్ వంటి అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అలాగే రోడ్డు, పార్కింగ్ స్పష్టంగా కనిపించేలా విజిబిలిటీ బాగుంటుంది. పెద్ద కార్లు ఇష్టపడని, కానీ సౌకర్యాన్ని కోరుకునే పెద్దలకు ఇది నా మొదటి ఎంపిక.
ధర: రూ. 8.13 లక్షలు - రూ. 10.57 లక్షలు (ఎక్స్-షోరూమ్)
2. టాటా ఆల్ట్రోజ్ (డీసీఏ గేర్‌బాక్స్‌తో)..
{{/usCountry}}ధర: రూ. 8.13 లక్షలు - రూ. 10.57 లక్షలు (ఎక్స్-షోరూమ్)
2. టాటా ఆల్ట్రోజ్ (డీసీఏ గేర్‌బాక్స్‌తో)..
{{/usCountry}}టాటా ఆల్ట్రోజ్ ఎంపిక చేసిన పెట్రోల్ వేరియంట్లలో 6-స్పీడ్ డీసీఏ (డ్యూయెల్ క్లచ్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందిస్తోంది. సాధారణంగా డ్యూయల్ క్లచ్ సిస్టమ్ స్పోర్టీ డ్రైవింగ్ కోసం వాడతారని అనుకుంటారు, కానీ ఆల్ట్రోజ్‌లో దీనిని పెద్దలకు వీలుగా చాలా స్మూత్‌గా ట్యూన్ చేశారు. దీని బలమైన బాడీ నిర్మాణం, అత్యుత్తమ సేఫ్టీ రేటింగ్స్ డ్రైవర్లకు, వారి కుటుంబ సభ్యులకు భరోసానిస్తాయి.
ధర: రూ. 9.42 లక్షలు - రూ. 10.51 లక్షలు (ఎక్స్-షోరూమ్)
3. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ (టార్క్ కన్వర్టర్ ఓటీ)
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ 1.0 టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 'టార్క్ కన్వర్టర్' ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది ఏఎంటీ వేరియంట్ల కంటే చాలా స్మూత్‌గా ఉంటుంది, తక్కువ వేగంతో వెళ్లేటప్పుడు రిలాక్స్‌డ్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ట్రాఫిక్ రద్దీలో ఇది పెద్దలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఫ్రాంక్స్ గ్రౌండ్ క్లియరెన్స్ (ఎత్తు) ఎక్కువగా ఉండటం వల్ల పెద్దలు కారు ఎక్కడానికి, దిగడానికి ఇతర తక్కువ ఎత్తు ఉన్న హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే చాలా సులభంగా ఉంటుంది.
ధర: రూ. 10.98 లక్షలు - రూ. 11.83 లక్షలు (ఎక్స్-షోరూమ్)
4. సిట్రోయెన్ సీ3 (ఆటోమేటిక్)
సిట్రోయెన్ సీ3 టర్బో పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. సిట్రోయెన్ కంపెనీ ప్రధానంగా రైడ్ కంఫర్ట్, సస్పెన్షన్ ట్యూనింగ్‌పై దృష్టి పెడుతుంది. దీనివల్ల రోడ్డుపై గుంతలు ఉన్నా లోపల ఉన్న వారికి పెద్దగా తెలియదు, ప్రయాణంలో అలసట కలగదు. విజిబిలిటీ కోసం దీని డైమెన్షన్స్ కూడా కొంచెం ఎత్తుగా ఉంటాయి. ప్రశాంతమైన ప్రయాణం కావాలనుకునే వారు దీనిని పరిశీలించవచ్చు.
ధర: సుమారు రూ. 9.45 లక్షలు (ఎక్స్-షోరూమ్)
5. టాటా పంచ్ ఈవీ (ఎలక్ట్రిక్ కారు)
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ జాబితాలో ఒక ఈవీ ఉండటం సముచితం. టాటా పంచ్ ఈవీ సరసమైన ధర, ఎత్తుగా ఉండటం వల్ల పెద్దలకు మంచి ఎంపిక. ఎక్కువ రేంజ్ కావాలనుకునే వారి కోసం టాటా ఇప్పుడు పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కూడా అందిస్తోంది. ఎలక్ట్రిక్ కార్లలో అస్సలు గేర్లు మార్చాల్సిన పనే ఉండదు కాబట్టి సీనియర్ డ్రైవర్లకు ఇవి చాలా సౌకర్యం. అయితే, వీటిలో ఉండే ఇన్‌స్టంట్ టార్క్ (వేగంగా దూసుకువెళ్లడం) అలవాటు చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది.
ధర: రూ. 9.69 లక్షలు - రూ. 12.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)