2025లో భారత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ అనూహ్యమైన వేగంతో పుంజుకుంది! అనేక కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు మార్కెట్లోకి రావడంతో కొనుగోలుదారులకు మునుపెన్నడూ లేనంతగా ఆప్షన్స్ లభించాయి. చిన్నపాటి సిటీ క్రాస్ఓవర్ల నుంచి పెద్ద ఫ్యామిలీ ఎస్‌యూవీల వరకు ఈ ఏడాది మార్కెట్‌ను ఒక ఊపు ఊపిన 7 కీలక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల వివరాలను ఇక్కడ చూసేయండి..
2025లో అదరగొట్టిన ఎలక్ట్రిక్ కార్లు ఇవి..

1. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్-
భారతదేశంలో అత్యధిక ఆదరణ పొందిన క్రెటా మోడల్, 2025లో ఎలక్ట్రిక్ రూపంలో అడుగుపెట్టింది. ఇది 42 కేడబ్ల్యూహెచ్, 51.4 కేడబ్ల్యూహెచ్ అనే రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 133 బీహెచ్పీ నుంచి 169 బీహెచ్పీ వరకు పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ సుమారు 420 కి.మీ నుంచి 510 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.
2. టాటా హారియర్ ఈవీ-
టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ హారియర్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. కొత్త acti.ev Plus ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ కారులో 65 కేడబ్ల్యూహెచ్, 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఇది గరిష్టంగా 627 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) ఆప్షన్, లెవల్-2 అడాస్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
3. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్-
మహీంద్రా నుంచి వచ్చిన ఈ 7-సీటర్ ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కుటుంబ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. ఇందులో 59 కేడబ్ల్యూహెచ్, 70 కేడబ్ల్యూహెచ్, 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఇది 521 కి.మీ నుంచి 679 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, ట్రిపుల్ డిజిటల్ స్క్రీన్స్ దీని ప్రత్యేకతలు.
4. కియా కారెన్స్ క్లావిస్ ఈవీ-
{{/usCountry}}4. కియా కారెన్స్ క్లావిస్ ఈవీ-
{{/usCountry}}ఇది టెక్నికల్‌గా ఎంపీవీ అయినప్పటికీ, ఎస్‌యూవీ తరహా లుక్, 7-సీటర్ సౌకర్యంతో వస్తోంది. 42 కేడబ్ల్యూహెచ్, 51.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలతో వస్తున్న ఈ కారు 404 కి.మీ నుంచి 490 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, పానోరమిక్ సన్‌రూఫ్ వంటి కంఫర్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
5. విన్‌ఫాస్ట్ వీఎఫ్7-
వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ కంపెనీ వీఎప్7 మోడల్‌తో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది 70.8–75.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 438 కి.మీ నుంచి 532 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. సింగిల్, డ్యూయల్ మోటార్ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది.
6. విన్‌ఫాస్ట్ వీఎఫ్6-
ఇది విన్‌ఫాస్ట్ నుంచి వచ్చిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ముఖ్యంగా సిటీలో డ్రైవ్ చేసేవారికి, బడ్జెట్ చూసుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది! ఇందులో 59.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది సుమారు 468 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. చిన్న కారు అయినప్పటికీ, గ్రౌండ్ క్లియరెన్స్- స్పేస్ విషయంలో రాజీ పడలేదు!
7. వోల్వో ఈఎక్స్30
లగ్జరీ సెగ్మెంట్‌లో వోల్వో ఈఎక్స్30 ఒక పవర్‌ఫుల్ ఎంట్రీ. ఇది 69 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 272 బీహెచ్పీ పవర్‌ను విడుదల చేస్తుంది. కేవలం 5.3 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట రేంజ్ 480 కి.మీ. కేవలం 28 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ అయ్యే ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం దీని సొంతం.