...
...
Next Story

8వ పే కమిషన్ : ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్ 1.83 మాత్రమేనా? ఉద్యోగులకు షాక్ తప్పదా?

8వ వేతన సంఘం అమలుతో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు పెరగడంతో పాటు కేంద్రంపై రూ. 7.2 లక్షల కోట్ల భారం పడే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, బకాయిల లెక్కలపై పలు కీలక విషయాలను వెల్లడించింది.

Published on: Nov 28, 2026, 10:44:53 IST
Advertisement

8వ వేతన సంఘం పనులు వేగంగా జరుగుతున్న సమయంలో ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ జేపీ మోర్గాన్ బాంబు లాంటి రిపోర్టును బయటపెట్టింది! జీతాలు, పింఛను పెంపులో కీలక పాత్ర పోషించే ‘ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​’.. 1.83గా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​ అనేది కనీసం 3.83 కన్నా ఎక్కువ ఉండాలని అనేక ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్న వేళ.. జేపీ మోర్గాన్ తాజా రిపోర్టు కలవరపెడుతోంది!

జేపీ మోర్గాన్ అంచనా ప్రకారం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, జీతం పెంపు ఎంత?

8వ పే కమిషన్ లేటెస్ట్ అప్డేట్స్..
8వ పే కమిషన్ లేటెస్ట్ అప్డేట్స్..

8వ వేతన సంఘం అమలు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పింఛన్లలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఖర్చుల బిల్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. అమలు తేదీ, బకాయిల చెల్లింపు విధానం వంటి అంశాల ఆధారంగా, ప్రతిపాదిత వేతన సవరణ ప్రభుత్వానికి దాదాపు రూ. 7.2 లక్షల కోట్ల ఖర్చు అవుతుందని జేపీ మోర్గాన్ అంచనాలు చెబుతున్నాయి. ఇందులో సుమారు రూ. 4 లక్షల కోట్ల బకాయిలు కూడా కలిసే అవకాశం ఉంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మల్టిప్లయర్ సుమారు 1.83 వరకు ఉండవచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. దీనివల్ల స్థూల వేతనంలో (గ్రాస్ పే) దాదాపు 14–15 శాతం పెరుగుదల వస్తుందని లెక్కించింది. 2025 డిసెంబర్ 31తో అధికారికంగా గడువు ముగిసిన "7వ వేతన సంఘం" అందించిన వేతన వృద్ధికి ఈ గణాంకాలు దాదాపు సమానంగా ఉన్నాయి.

60 శాతం కరవు భత్యం (డీఏ), స్థూల వేతనంలో 14 శాతం పెరుగుదలను ప్రాతిపదికగా తీసుకుని జేపీ మోర్గాన్ ఈ లెక్కలు కట్టింది.

Also Read 8th Pay Commission advances work after Ladakh visit; 33 queries raised
జేపీ మోర్గాన్ అంచనాలు

ఉద్యోగుల డిమాండ్లు.. నివేదిక అంచనాల మధ్య తేడా

జేపీ మోర్గాన్ అంచనాలు

రూ. 7.2 లక్షల కోట్ల ఖర్చు.. ఆర్థిక సంవత్సరాల వారీగా లెక్కలిలా..

ఆర్థిక సంవత్సరాలు 2028, 2029ల్లో 8వ వేతన సంఘం వల్ల కేంద్రానికి అదనంగా రూ. 7.2 లక్షల కోట్ల వ్యయం అవుతుందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది.

ఈ ఖర్చులో బకాయిల వాటానే పెద్ద మొత్తంలో ఉంటుందని నివేదిక వివరించింది. సవరించిన వేతన నిర్మాణాన్ని 2026 జనవరి 1 నుంచి అమలు చేస్తే బకాయిలు సుమారు రూ. 4 లక్షల కోట్ల వరకు చేరవచ్చని అంచనా వేశారు. ఒకవేళ అమలు తేదీని 2027 జనవరి 1కి మార్చితే, ఈ బకాయిల మొత్తం దాదాపు రూ. 1.8 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉంది.

ఇప్పటి నుంచి సుమారు ఏడాది తర్వాత, అంటే 2027 నవంబర్ నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి రావచ్చని జేపీ మోర్గాన్ భావిస్తోంది!

అయితే ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే! ఖరారైన ప్రభుత్వ నిర్ణయాలు కావు అని గుర్తుపెట్టుకోవాలి. జీతాల సవరణ, అమలు తేదీ, బకాయిల అంశాలు కమిషన్ సిఫార్సులు, కేంద్ర ప్రభుత్వ ఆమోదంపై ఆధారపడి ఉంటాయి. 8వ వేతన సంఘం తన నివేదికను 2027 మే, జూన్ నాటికి ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.

Also Read 8th Pay Commission arrears: How a delay could cost the Centre more
 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks