8th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు ఎంత? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, బేసిక్​ పే లెక్కలు ఇవే!

8th Pay Commission latest news : 8వ వేతన సంఘంలో ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​ కీలకంగా మారనుంది. దాని బట్టే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్​ పేని నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​ ఎంత ఉంటే బేసిక్​ పే ఎంతకు పెరుగుతుంది వంటి వివరాలాను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 13, 2026, 06:03:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

8th Pay Commission salary : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం కసరత్తు వేగవంతమైంది. ద్రవ్యోల్బణం, మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా జీతాలు ఎంత పెరగనున్నాయనే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో 8వ పే కమిషన్​ నిర్ణయించే ‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’ ప్రాధాన్యత సంతరించుకుంది.

8వ వేతన సంఘం- బేసిక్​ పే ఎంత ఉంటుంది?
8వ వేతన సంఘం- బేసిక్​ పే ఎంత ఉంటుంది?

8వ పే కమిషన్- ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? దీని ప్రాధాన్యత ఏంటి?

కొత్త పే కమిషన్ అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక వేతనాన్ని (బేసిక్ పే) నిర్ణయించడానికి ఉపయోగించే మల్టిప్లయర్​నే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటారు. ఇది కేవలం జీతాలనే కాకుండా పెన్షన్లు, అలవెన్సులను కూడా ప్రభావితం చేస్తుంది.

నిర్ణయించే అంశాలు: దేశంలోని ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు, ఉద్యోగుల అవసరాలు, ప్రభుత్వ ఆర్థిక శక్తిని పరిగణనలోకి తీసుకుని ఈ సంఖ్యను ఖరారు చేస్తారు.

ప్రస్తుత పరిస్థితి: 7వ వేతన సంఘం ప్రకారం ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 గా ఉంది. దీనివల్ల కనిష్ట ప్రాథమిక వేతనం రూ. 18,000కు చేరింది.

జీతం ఎలా మారుతుంది? (ఫార్ములా)

మీ కొత్త జీతాన్ని లెక్కించడానికి ప్రభుత్వం ఈ కింది సూత్రాన్ని ఉపయోగిస్తుంది:

కొత్త బేసిక్ పే = ప్రస్తుత బేసిక్ పే x ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

ఉదాహరణకు.. 7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉండటం వల్ల, అంతకుముందు ఉన్న రూ. 7,000 కనిష్ట వేతనం రూ. 18,000 (7,000 x 2.57) గా మారింది.

అయితే, ప్రతి కొత్త కమిషన్ వచ్చినప్పుడు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) సున్నాకు రీసెట్ అవుతుందని గమనించాలి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వర్గీకరణ (18 లెవల్స్)

ప్రభుత్వ ఉద్యోగులను వారి బాధ్యతలు, హోదాలను బట్టి 18 స్థాయిలుగా విభజించారు:

లెవల్ 1: ఎంట్రీ లెవల్ / గ్రూప్-డి ఉద్యోగులు.

లెవల్ 2–9: గ్రూప్-సీ ఉద్యోగులు.

లెవల్ 10–12: గ్రూప్-బీ ఉద్యోగులు.

లెవల్ 13–18: గ్రూప్-ఏ అధికారులు (వీరిలో క్యాబినెట్ సెక్రటరీల వంటి ఉన్నతాధికారులు ఉంటారు).

7వ పే కమిషన్ ప్రకారం వివిధ స్థాయిల బేసిక్ శాలరీ ఇలా ఉంది

లెవల్ 1- రూ. 18,000

లెవల్ 5- రూ. 29,200

లెవల్ 10- రూ. 56,100

లెవల్ 15- రూ. 1,82,200

లెవల్ 18- రూ. 2,50,000

ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​ 2.57గా ఉంటే, రివైజ్డ్​ బేసిక్​ పే ఎంత ఉంటుంది?

లెవల్​బేసిక్​ పే రేంజ్ (రూ. )
L1 to L446,260 to 65,535
L5to L875,044 to 1,22,332
L9 to L121,36,467 to 2,02,516
L13 to L13A3,16,367 to 3,36,927
L14 to L183,70,594 to 6,42,500

ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​ 3.0గా ఉంటే రివైజ్డ్​ బేసిక్​ పే ఎంత ఉంటుంది?

లెవల్​ రేంజ్బేసిక్ పే రేంజ్​ (రూ.)
L1 to L454,000 to 76,500
L5to L887,600 to 1,42,800
L9 to L121,59,300 to 2,36,400
L13 to L13A3,69,300 to 3,93,300
L14 to L184,32,600 to 7,50,000

ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​ 3.25గా ఉంటే రివైజ్డ్​ బేసిక్​ పే ఎంత ఉంటుంది?

లెవల్​ రేంజ్బేసిక్​ పే రేంజ్ (రూ.)
L1 to L558,500 to 94,900
L6 to L101,15,050 to 1,82,325
L11 to L122,20,025 to 2,56,100
L13 to L13A4,00,075 to 4,26,075
L14 to L184,68,650 to 8,12,500

8వ వేతన సంఘంలో జీతం ఎంత ఉండొచ్చు?

ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న కొన్ని అంచనాలను పరిశీలిస్తే:

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉంటే: బేసిక్ పే యథాతథంగా ఉన్నప్పటికీ, అలవెన్సుల్లో స్వల్ప మార్పు ఉంటుంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే: ఒకవేళ ప్రభుత్వం దీనిని 2.86 లేదా 3.00 కు పెంచితే, కనిష్ట వేతనం రూ. 21,000 నుంచి రూ. 25,000 వరకు పెరిగే అవకాశం ఉంది.

ప్రభుత్వ ఉద్యోగి జీతంలో ఏ ఏ భాగాలు ఉంటాయి?

సాధారణంగా ఒక ఉద్యోగి గ్రాస్​ శాలరీలో ఇవి ఉంటాయి..

ప్రాథమిక వేతనం (బేసిక్ పే): 51.5%

కరువు భత్యం (డీ): 30.9%

ఇంటి అద్దె భత్యం (హెచ్​ఆర్​ఏ): 15.4%

రవాణా భత్యం (టీఏ): 2.2%

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More