AIBE 21 : నేటి నుంచి ఏఐబీఈ 21 రిజిస్ట్రేషన్లు- పూర్తి వివరాలు..
భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ) 21 రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేటి నుంచి (ఫిబ్రవరి 11, 2026) ప్రారంభించనుంది. భారతదేశంలో న్యాయవాద వృత్తిని చేపట్టాలనుకునే ఎల్ఎల్బీ గ్రాడ్యుయేట్లు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
న్యాయశాస్త్రం పూర్తి చేసి ప్రాక్టీస్ చేయాలనుకునే అభ్యర్థులకు బిగ్ అప్డేట్! ఏఐబీఈ 21 (ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ XXI) రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు ఫిబ్రవరి 11న ప్రారంభంకానుంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తులను స్వీకరించబోమని, అలాగే గడువు పొడిగింపు ఉండదని బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది.

ఏఐబీఈ 21- ముఖ్యమైన తేదీలు ఇవే..
ఏఐబీఈ 21 రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 11, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2026
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మే 1, 2026
దరఖాస్తు సవరణ: మే 3, 2026
హాల్ టికెట్ల జారీ: మే 22, 2026
పరీక్ష తేదీ: జూన్ 7, 2026
ఏఐబీఈ 21- అర్హతలు ఎవరికి ఉన్నాయి?
ఈ ఏఐబీఈ 21 పరీక్ష రాయడానికి కింది వారు అర్హులు:
చివరి సెమిస్టర్ విద్యార్థులు: బీసీఐ గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో 3 ఏళ్ల లేదా 5 ఏళ్ల ఎల్ఎల్బీ చదువుతూ, మునుపటి సెమిస్టర్లలో ఎటువంటి బ్యాక్‌లాగ్స్ లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ పూర్తి చేసిన వారు: కోర్సు పూర్తయి, ఇంకా డిగ్రీ సర్టిఫికేట్ చేతికి రాని వారు కూడా అప్లై చేయవచ్చు.
నమోదు చేసుకోని గ్రాడ్యుయేట్లు: ఎల్ఎల్బీ పూర్తి చేసినా ఇంకా స్టేట్ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోని వారు, లేదా గతంలో నమోదు చేసుకుని ఆ తర్వాత ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికేట్‌ను వెనక్కి ఇచ్చేసిన వారు కూడా ఈ పరీక్ష రాయవచ్చు.
ఏఐబీఈ 21- దరఖాస్తు ప్రక్రియ ఇలా..
అభ్యర్థులు allindiabarexamination.com వెబ్‌సైట్ ద్వారా కింది పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి:
స్టెప్ 1- వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ఉన్న 'Registration' లింక్‌పై క్లిక్ చేసి ప్రాథమిక సమాచారం నమోదు చేయాలి.
స్టెప్ 2- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌తో సైన్-ఇన్ అవ్వాలి.
స్టెప్ 3- అప్లికేషన్ ఫారమ్‌లో పూర్తి వివరాలు నింపి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 4- నిర్ణీత దరఖాస్తు రుసుము చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.
ఏఐబీఈ 21- పరీక్ష ఫీజు..
జనరల్/ ఓబీసీ- రూ. 3,500
జనరల్- పీడబ్ల్యూడీ/ ఓబీసీ-పీడబ్ల్యూడీ రూ. 3,500
ఎస్సీ/ ఎస్టీ- రూ. 2,500
ఎస్సీ-పీడబ్ల్యూడీ/ ఎస్టీ-పీడబ్ల్యూడీ రూ. 2,500
ఈడబ్ల్యూఎస్/ మహిళలు- రూ. 3,500
చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు గడువు వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


