...
...
Next Story

Budget Electric Scooter : ఈ బడ్జెట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రేంజ్​ 120 కి.మీ- ధర రూ. 60వేలు!

Electric Scooter : జెలియో ఈ-మొబిలిటీ భారత మార్కెట్లోకి తన కొత్త 2026 X-Men+ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 60,000 (ఎక్స్-షోరూమ్) ధరతో తీసుకొచ్చింది. 120 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ లో-స్పీడ్ ఈ-స్కూటర్ ముఖ్యంగా విద్యార్థులు, ఆఫీసుకు వెళ్లేవారికి మంచి ఆప్షన్​గా నిలుస్తోంది.

Published on: Mar 23, 2026, 07:31:04 IST
Advertisement

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ జెలియో ఈ-మొబిలిటీ ఇటీవలే లాంచ్​ చేసిన ఒక బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. అదే.. 2026 ఎక్స్​- మెన్​ ప్లస్​ (X-Men+). దీని ధరను రూ. 60,000 (ఎక్స్-షోరూమ్) ఉండటం విశేషం. కాలేజీ యువత, ఆఫీసు ఉద్యోగులు, రోజువారీ నగర ప్రయాణికులకు ఇది ఒక ఆదర్శవంతమైన ఎంపికగా నిలవనుంది. 80 కిలోల బరువున్న ఈ స్కూటర్, గరిష్టంగా 180 కిలోల బరువును మోయగలదు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

రిఫ్రెష్డ్ లుక్.. కొత్త రంగులు..

బడ్జెట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది..
బడ్జెట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది..

2026 X-Men+ స్కూటర్ సరికొత్త స్టైలింగ్‌తో పాటు నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో (డార్క్ నైట్ బ్లాక్, వైట్, మిడ్ నైట్ బ్లూ, నార్డో గ్రే) అందుబాటులోకి వచ్చింది. గత మోడల్‌లో ఉన్న 10-అంగుళాల వెనుక చక్రాన్ని తీసివేసి, మెరుగైన స్థిరత్వం కోసం ఈసారి 12-అంగుళాల పెద్ద చక్రాన్ని అమర్చారు. ముందు, వెనుక భాగాల్లో హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ సస్పెన్షన్ బాధ్యతలు నిర్వహిస్తాయి. రెండు వైపులా 90-100-10 టైర్లను వాడారు.

ఫీచర్లు, భద్రత..

ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. మన్నిక కోసం అలాయ్ ఫ్రంట్ రిమ్, హబ్ మోటార్ రియల్ రిమ్‌ను అమర్చారు. ఇందులో ఉన్న ఇతర ఆధునిక ఫీచర్లు ఇవే:

రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్

డిజిటల్ డిస్​ప్లే

యాంటీ-థెఫ్ట్ అలారం (దొంగతనం జరగకుండా)

యూఎస్‌బీ ఛార్జింగ్, సెంట్రల్ లాకింగ్

ఆటో రిపేర్ స్విచ్

కంపెనీ ఈ వాహనంపై రెండు ఏళ్ల వారంటీని, బ్యాటరీపై ఒక ఏడాది వారంటీని అందిస్తోంది.

బ్యాటరీ, పనితీరు..

2026 X-Men+ ఎలక్ట్రిక్ స్కూటర్ లిథియం- లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది. లిథియం బ్యాటరీ ఛార్జ్ కావడానికి 4–5 గంటలు పట్టగా, లెడ్ బ్యాటరీకి 8–10 గంటల సమయం పడుతుంది. ఇది ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 120 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలోని 60/72V BLDC ఎలక్ట్రిక్ మోటార్ కేవలం 1.5 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకుంటుంది. లో-స్పీడ్ కేటగిరీ కావడంతో దీని గరిష్ట వేగం గంటకు 25 కిమీగా నిర్ణయించారు.

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై జెలియో ఈ-మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఆర్య మాట్లాడుతూ.. "పట్టణ ప్రయాణాల్లో సౌకర్యం, నమ్మకం చాలా ముఖ్యం. దాన్ని దృష్టిలో ఉంచుకునే X-Men+ 2026 వేరియంట్‌ను రూపొందించాం. భారత్‌లో ప్రయోగాత్మక ఎలక్ట్రిక్ మొబిలిటీని అందించడమే మా లక్ష్యం," అని పేర్కొన్నారు.

2021లో ప్రారంభమైన జెలియో ఈ-మొబిలిటీ, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ప్రస్తుతం కంపెనీకి 20 రాష్ట్రాల్లో 350కి పైగా సేల్స్, సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఏడాదికి 72,000 యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ఈ సంస్థ కలిగి ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks