నేటి రోజుల్లో హెల్త్ ట్రాకింగ్ కోసం వేలాది మంది స్మార్ట్‌వాచ్‌లను ధరిస్తున్నారు. అయితే నిరంతరం వచ్చే నోటిఫికేషన్ల గోల, బరువైన డిజైన్, తరచుగా ఛార్జింగ్ పెట్టాల్సిన తిప్పలు చాలామందికి విసుగు తెప్పిస్తుంటాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తమ సరికొత్త ప్రొడక్ట్ ‘ఫిట్‌బిట్ ఎయిర్’ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అసలు స్క్రీనే లేకుండా (స్క్రీన్‌లెస్ డిజైన్), చిన్న పెబుల్ రూపంలో ఉండే ఈ పరికరం రోజంతా, రాత్రంతా మన ఆరోగ్యాన్ని సైలెంట్‌గా మానిటర్ చేస్తుంది.

భారత్‌లో దీని ధరను రూ. 13,999గా నిర్ణయించారు. గూగుల్ స్టోర్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్, రిటైల్ స్టోర్లలో అక్టోబర్ 2వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఈ నేపథ్యంలో ఈ గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్- డిస్ట్రాక్షన్ లేని డిజైన్..
ఫిట్‌బిట్ ఎయిర్‌ను అత్యంత తేలికగా (కేవలం 12 గ్రాముల బరువు) రూపొందించారు. దీనికి స్క్రీన్ ఉండదు కాబట్టి, మన మణికట్టుపై నిరంతరం డిస్‌ప్లే వెలగడం లేదా నోటిఫికేషన్‌లు వచ్చి డిస్టర్బ్ చేయడం వంటివి ఉండవు.
24/7 హెల్త్ మానిటరింగ్: స్క్రీన్ లేకపోయినా ఇందులో అత్యాధునిక హెల్త్ సెన్సార్లు ఉంటాయి! 24 గంటల గుండె వేగం (హార్ట్ రేట్), హృదయ స్పందనల లయ (AFib అలర్ట్‌లు సహా), రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు (SpO2), రెస్టింగ్ హార్ట్ రేట్, హార్ట్ రేట్ వేరియబిలిటీ (హెచ్ఆర్వీ) వంటి ప్రతి కీలకమైన రికార్డును ఇది కచ్చితత్వంతో నమోదు చేస్తుంది.
నిద్ర నాణ్యత అంచనా: స్మార్ట్‌వాచ్‌లు పెట్టుకుని పడుకోవడం కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఫిట్‌బిట్ ఎయిర్ చాలా తేలికగా ఉండటం వల్ల పడుకునేటప్పుడు ఉన్నట్లు కూడా అనిపించదు. ఇది రాత్రంతా నిద్ర దశలను, నిద్ర సమయాన్ని నిశితంగా పరిశీలిస్తుంది.
పవర్ఫుల్ బ్యాటరీ జీవితం: ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజుల పాటు (7 రోజులు) బ్యాటరీ వస్తుంది. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే, కేవలం 5 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా రోజంతా పనికొచ్చే పవర్ సాధించవచ్చు.
గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్- గూగుల్ హెల్త్ కోచ్ అసిస్టెన్స్..
{{/usCountry}}పవర్ఫుల్ బ్యాటరీ జీవితం: ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజుల పాటు (7 రోజులు) బ్యాటరీ వస్తుంది. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే, కేవలం 5 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా రోజంతా పనికొచ్చే పవర్ సాధించవచ్చు.
గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్- గూగుల్ హెల్త్ కోచ్ అసిస్టెన్స్..
{{/usCountry}}ఈ ట్రాకర్ రికార్డ్ చేసిన డేటానంతా మీ ఫోన్‌లోని గూగుల్ హెల్త్ యాప్‌లో క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే 'గూగుల్ హెల్త్ కోచ్' మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వ్యక్తిగత సూచనలను, సలహాలను అందిస్తుంది.
వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలను ఇది ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. ఒకవేళ మీరు జిమ్‌లో వర్కవుట్ చేస్తుంటే, అక్కడి ఎక్విప్‌మెంట్ లేదా వైట్‌బోర్డ్‌పై రాసిన వర్కవుట్ చాట్‌ను ఫోన్‌తో ఫోటో తీస్తే చాలు, అది నేరుగా యాప్‌లో లాగ్ అవుతుంది.
గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్- స్టైలిష్ బ్యాండ్స్, కలర్స్..
ఫిట్‌బిట్ ఎయిర్ ఫిట్నెస్ ట్రాకర్.. అబ్సీడియన్, బెర్రీ, లావెండర్, ఫాగ్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. డ్రెస్సింగ్ స్టైల్‌కు తగ్గట్టుగా మార్చుకోవడానికి విభిన్నమైన బ్యాండ్లు అందుబాటులో ఉన్నాయి:
పర్ఫార్మెన్స్ లూప్ బ్యాండ్: మైక్రో-అడ్జస్టబుల్ డిజైన్‌తో శ్వాస ప్రక్రియకు అనువుగా ఉంటుంది (ఇది గ్యాడ్జెట్ బాక్స్‌తో పాటే వస్తుంది).
యాక్టివ్ బ్యాండ్: చెమట పట్టినా ఏమీ కాకుండా సిలికాన్ మెటీరియల్‌తో వర్కవుట్ల కోసం రూపొందించారు.
ఎలివేటెడ్ మోడరన్ బ్యాండ్: సాధారణ ఫిట్నెస్ గ్యాడ్జెట్‌లా కాకుండా బ్రాస్‌లెట్ లుక్ ఇచ్చే క్లాసిక్ డిజైన్.
ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేసిన వారికి 3 నెలల ఉచిత గూగుల్ హెల్త్ ప్రిమియం సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.