...
...
Next Story

Char Dham Yatra : చార్‌ధామ్ యాత్రకు వెళ్తున్నారా? మీరు వెళ్లే దారిలో ఈ ప్రదేశాలు దాగి ఉన్నాయ్!

Char Dham Yatra : మీరు చార్‌ధామ్‌కు వెళ్లే మార్గంలో ఎన్నో అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. అయితే మీరు త్వరత్వరగా వెళ్లకుండా.. ఆగి నెమ్మదిగా అన్నీ చూసుకుంటూ వెళ్లాలి.

Published on: Apr 24, 2026, 08:06:28 IST
Advertisement

చార్‌ధామ్ యాత్ర కేవలం ఒక మతపరమైన ప్రయాణం మాత్రమే కాదు.. ప్రకృతిలోని అత్యంత అందమైన రూపాలను చూసేందుకు లభించే ఒక అవకాశం కూడా. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలను సందర్శించడానికి బయలుదేరుతారు. కానీ ఆలయానికి చేరుకోవాలనే తొందరలో మార్గమధ్యంలోని అద్భుతమైన ప్రదేశాలను చూడకుండానే యాత్ర ముగిస్తారు.

చార్‌ధామ్ యాత్రలో  ముఖ్యమైన ప్రదేశాలు
చార్‌ధామ్ యాత్రలో ముఖ్యమైన ప్రదేశాలు

చార్‌ధామ్ యాత్రను మరింత గుర్తిండిపోయేలా మార్చుకోండి. ఉత్తరాఖండ్ లోయలలో అలాంటి అనేక ప్రదేశాలు దాగి ఉన్నాయి. అక్కడ ప్రశాంతత, పచ్చదనం, పర్వతాల అందం మనసుకు హాయిని కలిగిస్తాయి. మీరు కూడా చార్‌ధామ్‌కు వెళుతున్నట్లయితే.. కాసేపు ఆగి ఈ ప్రదేశాలను సందర్శించండి.

దేవప్రయాగ సంగమం

దేవప్రయాగ సంగమం ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ గర్వాల్ జిల్లాలో ఉన్న పవిత్రమైన ప్రదేశం ఇది. ఇక్కడ భాగీరథి, అలకనంద నదులు కలిసి గంగానదిగా ఏర్పడతాయి. పర్వతాల నడుమ జరిగే ఈ సంగమం చూడటానికి ఎంతో సుందరంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. అద్భుతమైన ఫోటోలు తీసుకునే అవకాశం, ఆధ్యాత్మిక అనుభూతి ఇక్కడ లభిస్తాయి.

హర్సిల్ లోయ

గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ఈ లోయ అత్యంత సుందరంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో, భాగీరథి నది ఒడ్డున 2,620 మీటర్ల ఎత్తులో ఉన్న హర్సిల్ లోయ ప్రకృతి సౌందర్యంతో అలరారే ఒక ప్రశాంతమైన ప్రదేశం. ఇక్కడి ఆపిల్ తోటలు, నదీ తీరాలు మనోహరమైన దృశ్యాలను అందిస్తాయి. తక్కువ జనసందోహం, సహజ సౌందర్యం, వాతావరణంలోని ప్రశాంతతతో మంచి అనుభూతి దక్కుతుంది.

చోప్టా మినీ స్విట్జర్లాండ్

మీరు ప్రకృతి ప్రేమికులైతే, ఔలిని తప్పక సందర్శించాలి. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న ఔలి అద్భుతమైన హిల్ స్టేషన్. మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని ప్రకృతి, ప్రయాణాలు, హిమాలయాల అద్భుత దృశ్యాలు మీ హృదయాన్ని మంత్రముగ్ధులను చేస్తాయి.

కొన్ని చిట్కాలు

మీ ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. తొందరపడకండి, దారిలో ఆగి ప్రకృతిని ఆస్వాదించండి. వాతావరణానికి అనుగుణంగా బట్టలు ఉంచుకోండి. మీ కెమెరా లేదా మొబైల్‌ను ఛార్జ్ చేసి ఉంచుకోండి, ప్రతిచోట ఫోటోలు తీసుకోవడం విలువైనదే.

స్థానిక ప్రజలతో మాట్లాడండి, మీకు రహస్య ప్రదేశాల గురించి సమాచారం లభిస్తుంది. చార్ ధామ్ యాత్ర కేవలం దేవాలయాలను సందర్శించడం మాత్రమే కాదని గుర్తుంచుకోవాలి. ఇది ఆధ్యాత్మికత, ప్రకృతి, సాహసాల మేళవింపుతో కూడిన ఒక అనుభవం.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe