బ్యాంకు పనులు ఉన్నవారికి ముఖ్య గమనిక! ఆగస్టు నెలలో బ్యాంకులకు వెళ్లే ఆలోచన ఉంటే ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. వచ్చే నెలలో జాతీయ పండుగలు, ప్రాంతీయ ఉత్సవాలు, సాధారణ వారాంతపు హాలిడేస్ అన్నీ కలిపి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి! ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆగస్టు 2026 నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది.

అయితే, ఈ 15 రోజుల సెలవులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ ఒకేసారి వర్తించవని గుర్తుంచుకోవాలి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ సెలవులు మాత్రమే దేశమంతటా ఒకేలా ఉంటాయి. మిగిలిన సెలవులు ఆయా రాష్ట్రాల స్థానిక పండుగలు, సంస్కృతి ఆధారంగా మారుతుంటాయి.
చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బ్యాంక్ ఖాతాదారులు ఈ సెలవుల జాబితాను ముందే చూసుకోవడం శ్రేయస్కరం
ఆగస్టులో బ్యాంకు సెలవుల లిస్ట్..
ఆగస్టు 4 (మంగళవారం): కెర్ పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 8 (రెండో శనివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూతపడతాయి. దీనితో పాటు సిక్కింలో కాంచనజంగా పర్వతాన్ని పూజించే 'తెండాంగ్ లో రుమ్ ఫాట్' పండుగ సందర్భంగా అక్కడ స్థానిక సెలవు ఉంటుంది.
ఆగస్టు 10 (సోమవారం) : బోనాలు సందర్భంగా తెలంగాణలోని బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 13 (గురువారం): పేట్రియాట్స్ డే సందర్భంగా మణిపూర్‌లో బ్యాంకులకు హాలిడే.
ఆగస్టు 15 (శనివారం): స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పనిచేయవు.
ఆగస్టు 19 (బుధవారం): మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి సందర్భంగా త్రిపురలో సెలవు.
{{/usCountry}}ఆగస్టు 19 (బుధవారం): మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి సందర్భంగా త్రిపురలో సెలవు.
{{/usCountry}}ఆగస్టు 25 (మంగళవారం): మిలాద్-ఉన్-నబీ / మొదటి ఓనం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి.
ఆగస్టు 26 (బుధవారం): ఈద్-ఎ-మిలాద్ / తిరువోణం సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మణిపూర్, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, కేరళ, ఢిల్లీ ఎన్‌సీఆర్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఆగస్టు 28 (శుక్రవారం): రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) / శ్రీనారాయణ గురు జయంతి / అయ్యన్కాళి జయంతి / పాంగ్-లాబ్‌సోల్ సందర్భంగా తెలంగాణ, ఏపీ మినహా గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు మూతపడతాయి.
ఆగస్టులో వారాంతపు సెలవులు ఇలా..
జాతీయ, ప్రాంతీయ పండుగల సెలవులతో పాటు సాధారణ నిబంధనల ప్రకారం ఆదివారాలైన ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అలాగే రెండో శనివారం (ఆగస్టు 8), నాలుగో శనివారం (ఆగస్టు 22) రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
ఆన్‌లైన్ సేవలు అందుబాటులోనే ఉంటాయి!
ఈ సెలవు రోజుల్లో నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌లకు వెళ్లే సేవలు మాత్రమే నిలిచిపోతాయి. ఏటీఎం సేవలు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు ఎప్పటిలాగే 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అత్యవసర డబ్బు ట్రాన్స్‌ఫర్లు, బిల్లు చెల్లింపులను డిజిటల్ విధానంలో సులభంగా పూర్తి చేసుకోవచ్చని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.