Bajaj bike : బజాజ్ నుంచి సరికొత్త ‘అవెంజర్ 220 స్ట్రీట్’- త్వరలోనే మార్కెట్లోకి..
Bajaj Avenger 220 Street : బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్‌ని సంస్థ తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 1.3లక్షల వరకు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Bajaj Avenger 220 Street India Launch : క్రూయిజర్ బైక్ ప్రియులకు బజాజ్ ఆటో ఒక తీపి కబురు అందించింది. తన పాపులర్ అవెంజర్ సిరీస్‌లో ‘అవెంజర్ 220 స్ట్రీట్’ మోడల్‌ను తిరిగి ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ బైక్‌ను లిస్ట్ చేసింది. గతంలో ఉన్న స్ట్రీట్ 160 మోడల్‌ను డిస్కంటిన్యూ చేసి, దాని స్థానంలో మరింత శక్తివంతమైన ఈ 220 సీసీ వెర్షన్‌ను బజాజ్ తీసుకువస్తుండటం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అవెంజర్ 220 క్రూయిజ్ ధర సుమారు రూ. 1.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది, కొత్త స్ట్రీట్ వెర్షన్ కూడా దాదాపు ఇదే ధరలో ఉండే అవకాశం ఉంది.

బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్- పవర్ ప్యాక్డ్ ఇంజిన్
అవెంజర్ 220 స్ట్రీట్‌లో లెజెండరీ ‘పల్సర్ 220 ఎఫ్’లో వాడే అదే నమ్మకమైన ఇంజిన్‌ను అమర్చారు.
ఇంజిన్: 220 సీసీ, ఎయిర్-ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్.
పవర్: 8,500 ఆర్పీఎం వద్ద 19.03 పీఎస్ పీక్ పవర్‌ని విడుదల చేస్తుంది.
టార్క్: 7,000 ఆర్పీఎం వద్ద 17.55 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.
గేర్‌బాక్స్: 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్.
బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్- డిజైన్, రంగులు..
స్ట్రీట్ వెర్షన్ ఎప్పుడూ మోడ్రన్, స్పోర్టీ లుక్‌తో ఉంటుంది. క్రూయిజ్ వెర్షన్‌లో క్రోమ్ ఫినిషింగ్ ఎక్కువగా ఉంటే, స్ట్రీట్ వెర్షన్ బ్లాక్-అవుట్ థీమ్‌తో వస్తుంది. ఇది రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది. అవి..
- ఇబోనీ బ్లాక్
- కాక్టెయిల్ వైన్ రెడ్
బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్- హార్డ్‌వేర్, బ్రేకింగ్..
ఈ బైక్ ప్రయాణాన్ని సులభతరం చేసేలా మెరుగైన హార్డ్‌వేర్ ఫీచర్లను కలిగి ఉంది:
సస్పెన్షన్: ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో 5-స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి.
బ్రేకింగ్: భద్రత కోసం ముందు 280 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక 130 ఎంఎం డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. దీనికి తోడు 'సింగిల్ ఛానల్ ఏబీఎస్' (ఏబీఎస్) అదనపు రక్షణను ఇస్తుంది.
వీల్స్ అండ్ టైర్స్: ఈ మోడల్‌లో అల్లాయ్ వీల్స్‌తో కూడిన ట్యూబ్‌లెస్ టైర్లను అందించారు. క్రూయిజ్ బైక్ వెర్షన్‌లో స్పోక్ వీల్స్ ఉండటం వల్ల ట్యూబ్ టైర్లు వాడాల్సి వచ్చేది, కానీ స్ట్రీట్ వెర్షన్‌లో ట్యూబ్‌లెస్ సౌకర్యం వల్ల పంచర్ల భయం తక్కువ.
బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్- కొలతలు, బరువు..
అవెంజర్ సిరీస్ దాని తక్కువ సీటు ఎత్తుకు ప్రసిద్ధి. 737 ఎంఎం సీటు హైట్ ఉండటం వల్ల తక్కువ ఎత్తు ఉన్న వారు కూడా ఈ బైక్‌ను సులభంగా నడపవచ్చు.
బరువు: 160 కిలోలు.
ఫ్యూయల్ ట్యాంక్: 13 లీటర్ల కెపాసిటీ.
నగర ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటూనే, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్లాలనుకునే వారికి అవెంజర్ 220 స్ట్రీట్ ఒక సరైన ఎంపికగా నిలవనుంది.
మరి మీరు ఈ బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ కొంటారా?
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. అవెంజర్ 220 స్ట్రీట్, 220 క్రూయిజ్ మధ్య ప్రధాన తేడా ఏంటి?
స్ట్రీట్ వెర్షన్‌లో అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, ఫ్లాట్ హ్యాండిల్ బార్ ఉంటాయి. క్రూయిజ్ వెర్షన్‌లో స్పోక్ వీల్స్, ట్యూబ్ టైర్లు, ఎత్తైన హ్యాండిల్ బార్‌తో పాటు క్రోమ్ ఫినిషింగ్ ఎక్కువగా ఉంటుంది.
2. ఈ బైక్ మైలేజ్ ఎంత ఉండవచ్చు?
బజాజ్ 220 సీసీ ఇంజిన్ సాధారణంగా లీటరుకు 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
3. అవెంజర్ 160 స్ట్రీట్ ఇంకా అందుబాటులో ఉందా?
లేదు, బజాజ్ సంస్థ అవెంజర్ 160 స్ట్రీట్‌ను నిలిపివేసింది. దాని స్థానంలోనే ఇప్పుడు ఈ 220 స్ట్రీట్ మోడల్‌ను లాంచ్ చేస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


