నేడు (అక్టోబర్ 21న) దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన అధికారిక జాబితా ప్రకారం….. కొన్ని పరిమిత నగరాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు అమలులో ఉంది. విజయాదశమి, దుర్గాపూజ, మహా దశమి పండుగల సందర్భంగా ఆయా ప్రాంతీయ పద్ధతులను బట్టి ఈ సెలవులను కేటాయించారు.
ఏ ఏ నగరాల్లో బ్యాంకులు బంద్?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI) సహా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల శాఖలు నేడు ఎనిమిది ప్రధాన నగరాల్లో మూతపడనున్నాయి. అగర్తలా, బెంగళూరు, గ్యాంగ్‌టక్, గువాహటి నగరాలతో పాటు కొచ్చి, కోల్‌కతా, షిల్లాంగ్, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
హైదరాబాద్, ఢిల్లీలో సేవలు యథాతథం
దేశంలోని మిగిలిన ప్రధాన నగరాల్లో బ్యాంకులు ఎప్పటిలాగే సేవలు అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌తో పాటు ముంబై, న్యూఢిల్లీ, చెన్నై నగరాల్లో నేడు బ్యాంకులు తెరిచే ఉంటాయి. అహ్మదాబాద్, భోపాల్, జైపూర్, లక్నో, పాట్నా నగరాల్లో కూడా ఖాతాదారులు నేరుగా బ్యాంకు శాఖలకు వెళ్లవచ్చు.
ఈ నగరాలన్నింటికీ అక్టోబర్ 20నే దసరా సెలవు పూర్తయింది. అందువల్ల నేడు ఖాతాదారులు నగదు జమ, విత్‌డ్రా లేదా ఇతర పనుల కోసం సాధారణ వేళల్లో బ్యాంకులను సందర్శించవచ్చు. అయితే, బ్యాంకుకు వెళ్లే ముందు మీ నగరంలో సెలవు ఉందో లేదో ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
అక్టోబర్ 20న దేశంలోని మెజారిటీ నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. దసరా, మహార్నవమి, ఆయుధ పూజ, దుర్గాపూజల సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజు గ్యాంగ్‌టక్, ఇంఫాల్ మినహా మిగిలిన దాదాపు అన్ని చోట్లా బ్యాంకులు మూసివేశారు.
బెంగళూరు, గువాహటి, కొచ్చి, కోల్‌కతా, షిల్లాంగ్, తిరువనంతపురం నగరాల్లో అక్టోబర్ 20న కూడా బ్యాంకులు పనిచేయలేదు. తిరువనంతపురం, కోల్‌కతా, కొచ్చి, గువాహటిలలో అక్టోబర్ 19 నుంచి వరుసగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు.
- అక్టోబర్ 22 (గురువారం): దుర్గాపూజ (దశైన్) సందర్భంగా కేవలం గ్యాంగ్‌టక్‌లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. మిగిలిన అన్ని నగరాల్లో బ్యాంకులు యథాతథంగా పనిచేస్తాయి.
- అక్టోబర్ 23 (శుక్రవారం): ఈ రోజు కూడా దుర్గాపూజ సందర్భంగా గ్యాంగ్టక్లోనే సెలవు వర్తిస్తుంది. ఇతర ప్రాంతాలలో బ్యాంకింగ్ కార్యకలాపాలు సాధారణంగా సాగుతాయి.
- అక్టోబర్ 24 (శనివారం): ఈ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతినెల రెండవ, నాలుగో శనివారాల్లో అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులకు ప్రభుత్వ సెలవు ఉంటుంది. ఇది అక్టోబర్ నెలలో నాలుగో శనివారం కావడం వల్ల దేశమంతటా బ్యాంకులు బంద్ ఉంటాయి.
- అక్టోబర్ 25 (ఆదివారం): వారాంతపు సాధారణ సెలవు కావడం వల్ల దేశ వ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.

అక్టోబర్ 26 (సోమవారం)వ తేదీన మరో విడతగా బ్యాంకులకు సెలవులు రానున్నాయి. లక్ష్మీపూజ, యాక్సెస్ డే, మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా అగర్తలా, బెంగళూరు, ఛండీగఢ్, జమ్మూ, షిమ్లా, శ్రీనగర్ నగరాల్లో బ్యాంకులు మూసివుంటాయి.
సెలవులు నగరాన్ని బట్టి మారుతుంటాయి కాబట్టి, ఖాతాదారులు నగదు డిపాజిట్, చెక్కుల క్లియరెన్స్ లేదా పత్రాల సమర్పణ వంటి ముఖ్యమైన పనుల కోసం బ్యాంకుకు వెళ్లేముందు ఆర్బీఐ సెలవుల పట్టికను తనిఖీ చేసుకోవడం శ్రేయస్కరం.