ఫిట్‌నెస్ ప్రపంచంలో కొత్త ఆవిష్కరణలు రావడం సహజమే కానీ, తాజాగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త మాత్రం నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఇప్పటివరకు ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ బార్ల గురించి విన్న మనకు, ఇప్పుడు ఏకంగా "ప్రోటీన్ కండోమ్స్" పరిచయమయ్యాయి! అవును, మీరు చదివింది నిజమే! ప్రముఖ ఇండియన్ ఫిట్‌నెస్ బ్రాండ్ ‘బీస్ట్ లైఫ్’ ఈ వింత ప్రకటనతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రపంచంలోనే తొలి ప్రోటీన్ కండోమ్!

ప్రముఖ కంటెంట్ క్రియేటర్, ఫిట్‌నెస్ ఫ్రీక్ గౌరవ్ తనేజా స్థాపించిన ఈ బ్రాండ్, ఆదివారం ఒక సర్‌ప్రైజ్ పోస్ట్ పెట్టింది.
"ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రోటీన్ కండోమ్‌ను పరిచయం చేస్తున్నాము.. మీ నైట్ పర్ఫార్మెన్స్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి మేము వస్తున్నాము," అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సప్లిమెంట్లకు పేరొందిన ఈ బ్రాండ్ నుంచి ఇలాంటి ప్రకటన రావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌ని ఇక్కడ చూసేయండి :
సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు..
ఈ ప్రోటీన్ కండోమ్ పోస్ట్ చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? కామెంట్ సెక్షన్లో జోకులు, సెటైర్లతో రెచ్చిపోతున్నారు.
{{/usCountry}}ఈ ప్రోటీన్ కండోమ్ పోస్ట్ చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? కామెంట్ సెక్షన్లో జోకులు, సెటైర్లతో రెచ్చిపోతున్నారు.
{{/usCountry}}"ఇది వే-ఐసోలేటా లేక నార్మల్ ప్రోటీనా?" అని ఒకరు ప్రశ్నిస్తే..
"అవసరం లేని సమస్యకు అద్భుతమైన పరిష్కారం దొరికింది" అంటూ మరొకరు చమత్కరించారు.
"ఇలాంటి ప్రోటీన్ కండోమ్ గురించి మా వంశంలోనే వింటున్న మొదటి వ్యక్తిని నేనే" అని ఇంకొకరు నవ్వులు పూయించారు.
"బీస్ట్ లైఫ్ అన్ని విభాగాల్లోనూ పర్ఫార్మెన్స్ చూపిస్తోంది" అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇదంతా ఏప్రిల్ ఫూల్ ప్లానేనా?
ఈ ప్రోటీన్ కండోమ్ ప్రకటన చూస్తుంటే ఇదంతా 'ఏప్రిల్ ఫూల్' ప్రాంక్ కోసమేనని మెజారిటీ నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. ఏప్రిల్ 1 దగ్గర పడుతుండటంతో, బ్రాండ్ ప్రమోషన్ కోసం చేస్తున్న గిమ్మిక్కు ఇదని చాలా మంది కొట్టిపారేస్తున్నారు.
"ఏప్రిల్ ఫూల్ చేయడానికి గట్టిగానే ప్లాన్ చేశారు" అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై బ్రాండ్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.
పోస్ట్‌లో "కమింగ్ సూన్" అని ఉండటం గమనార్హం. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
గతంలోనూ డిజిటల్ కండోమ్..
ఇలాంటి వింత ఆలోచనలు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో జర్మనీకి చెందిన 'బిల్లీ బాయ్' అనే సంస్థ ‘క్యామ్‌డోమ్’ పేరుతో ఒక డిజిటల్ కండోమ్ యాప్‌ను తీసుకొచ్చింది. సన్నిహితంగా ఉన్న సమయంలో ఎవరూ అనధికారికంగా వీడియోలు తీయకుండా అడ్డుకోవడమే ఆ యాప్ ఉద్దేశం.
ఇక ఈ 'ప్రోటీన్ కండోమ్' నిజంగా మార్కెట్లోకి వస్తుందా లేక కేవలం ఫన్నీ మార్కెటింగ్ స్టంటా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా, ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. కండోమ్ వాడటం వల్ల గర్భధారణను 100% నిరోధించవచ్చా?
సమాధానం: సాధారణంగా ఏ గర్భనిరోధక సాధనమూ 100% గ్యారెంటీ ఇవ్వదు. అయితే, కండోమ్‌లను సరైన పద్ధతిలో వాడితే అవి 98% వరకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. పొరపాట్ల వల్ల (ఉదాహరణకు: గడువు ముగిసినవి వాడటం, సరిగ్గా ధరించకపోవడం లేదా చిరిగిపోవడం) ఈ ప్రభావం 85% నుంచి 82% కి తగ్గే అవకాశం ఉంది. అందుకే నాణ్యమైన కండోమ్‌లను ఎంచుకోవడం, వాటి ఎక్స్‌పైరీ డేట్ చూసుకోవడం చాలా ముఖ్యం.
2. ఒకేసారి రెండు కండోమ్‌లు వాడటం వల్ల రక్షణ పెరుగుతుందా?
సమాధానం: ఖచ్చితంగా పెరగదు, పైగా అది ప్రమాదకరం. ఒకేసారి రెండు కండోమ్‌లు వాడటం వల్ల వాటి మధ్య ఫ్రిక్షన్ ఏర్పడి, కండోమ్‌లు చిరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్షణను పెంచడానికి బదులు, గర్భధారణ లేదా లైంగిక వ్యాధులు సోకే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఎప్పుడూ ఒకే ఒక కొత్త కండోమ్‌ను మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తారు.