బెంగళూరు లాంటి మెట్రో నగరంలో సొంతిల్లు అనేది ఒక భావోద్వేగంతో కూడిన నిర్ణయం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అది కేవలం ఇష్టం మాత్రమే కాదు, ఒక పెద్ద సవాలుగా మారింది. ఐటీ హబ్‌లకు దగ్గరగా ఉండే ఫ్లాట్ కొనాలా? లేక కాస్త దూరమైనా ప్రశాంతంగా ఉండే శివార్లలో విల్లా తీసుకోవాలా? అనే అంశంపై ఇప్పుడు బెంగళూరు వాసుల్లో పెద్ద చర్చ నడుస్తోంది. తాజాగా రెడిట (Reddit) వేదికగా ఐటీ ఉద్యోగులు పంచుకున్న అనుభవాలు ఈ అయోమయాన్ని కళ్లకు కడుతున్నాయి.
ఉద్యోగం మారింది.. ట్రాఫిక్ మొదలైంది

మారతహళ్లిలో ఉంటున్న ఒక ఉద్యోగి తన గోడు వెళ్లబోసుకుంటూ.. "15 ఏళ్ల పాత ఫ్లాట్‌ను భారీ ధర చెల్లించి కొన్నాను. తీరా చూస్తే ఆఫీస్ ఎయిర్‌పోర్ట్ వైపు మారిపోయింది. వారానికి నాలుగు రోజులు ఆఫీస్‌కు రావాలంటున్నారు. ఇప్పుడు ఆ ప్రయాణం నరకంలా అనిపిస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, 2018లో బెల్లందూరులో ఫ్లాట్ కొన్న ఒక వ్యక్తి, కొన్న 14 నెలలకే మరో చోటికి బదిలీ అయ్యారు. "ప్రస్తుతం ఆ ఇల్లు అద్దెకు ఇచ్చాను. కానీ 15-20 ఏళ్ల తర్వాత నా రిటైర్మెంట్ లైఫ్ అక్కడే గడపాలని ప్లాన్ చేసుకున్నాను. అందుకే ఈ తిప్పలు తప్పడం లేదు" అని చెప్పుకొచ్చారు. ఉద్యోగ రీత్యా ఊర్లు మారాల్సి వస్తున్నప్పుడు, కొన్న ఇల్లు భారం కాకూడదంటే దీర్ఘకాలిక ఆలోచన అవసరమని ఈ ఉదాహరణలు చెబుతున్నాయి.
కుటుంబం.. మెట్రో.. సౌకర్యాలు
ప్రయాణం కష్టమైనా సరే, పిల్లల చదువులు, సామాజిక అనుబంధాల కోసం సిటీలోనే ఉండాలని కొందరు భావిస్తున్నారు. "ప్రయాణ సమయం పెరిగినా పర్వాలేదు, పిల్లల స్కూళ్లు మార్చడం ఇష్టం లేక పాత ఏరియాలోనే ఉంటున్నాం" అని ఒక తండ్రి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మెట్రో స్టేషన్లకు దగ్గరగా ఇల్లు తీసుకోవడం వల్ల ఆఫీస్ మారినా ప్రయాణం సులభం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
శివార్ల వైపే మొగ్గు ఎందుకు?
సిటీ సెంటర్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, యువ జంటలు ఇప్పుడు నగరం వెలుపల ఉన్న వైట్‌ఫీల్డ్ పరిసరాలు, ఉత్తర బెంగళూరు వైపు చూస్తున్నారు.
{{/usCountry}}సిటీ సెంటర్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, యువ జంటలు ఇప్పుడు నగరం వెలుపల ఉన్న వైట్‌ఫీల్డ్ పరిసరాలు, ఉత్తర బెంగళూరు వైపు చూస్తున్నారు.
{{/usCountry}}"సిటీ సెంటర్‌తో పోలిస్తే శివార్లలో ప్రాపర్టీ విలువ 2% ఎక్కువగా పెరుగుతోంది" అని హను రెడ్డి రియాల్టీకి చెందిన కిరణ్ కుమార్ తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఇద్దరికీ సమాన దూరంలో ఉండే శివార్లను ఎంచుకోవడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది.
ఉత్తర బెంగళూరులో రియల్ జోరు
అనరాక్ (ANAROCK) సంస్థ గణాంకాల ప్రకారం.. ఉత్తర బెంగళూరులోని దేవనహళ్లి ప్రాంతంలో గత ఆరేళ్లలో ఇళ్ల ధరలు ఏకంగా 49% పెరిగాయి. 2019లో చదరపు అడుగు రూ.4,982 ఉండగా, 2024 నాటికి అది రూ.7,400కు చేరుకుంది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ సిటీలో ధరలు 38% మాత్రమే పెరిగాయి.
"మెట్రో విస్తరణ, కొత్త ఫ్లైఓవర్లు, ఐటీ పార్కుల రాకతో హెన్నూరు, దొడ్డబల్లాపూర్ రోడ్ వంటి ప్రాంతాలకు డిమాండ్ పెరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ధరలు ఏడాదికి 8-12% పెరిగే అవకాశం ఉంది" అని క్రెడాయ్ బెంగళూరు మాజీ అధ్యక్షుడు అమర్ మైసూర్ వివరించారు.
నిపుణుల సలహా
బెంగళూరు కొత్తగా వచ్చేవారు ముందుగా అద్దెకు ఉండి, ట్రాఫిక్, ఆఫీస్ లొకేషన్లపై అవగాహన పెంచుకున్నాకే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. 15-20 ఏళ్ల దీర్ఘకాలిక లక్ష్యంతో ఇల్లు కొనేవారికి రిలోకేషన్ సమస్యలు తక్కువగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.