...
...
Next Story

బుకింగ్స్​లో టాటా సియెర్రా​ సంచలనం- మరి డెలివరీ ఎప్పుడు? పూర్తి వివరాలు..

టాటా సియెర్రా ఎస్​యూవీని బుక్​ చేశారా? లేదా బుక్​ చేసుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే టాటా సియెర్రా డెలివరీ ప్రారంభ తేదీ, వేరియంట్​ వారీగా డెలివరీలు సహా ఈ ఎస్​యూవీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 19, 2025, 15:02:06 IST
Advertisement

భారత ఆటోమొబైల్ రంగంలో సెన్సేషన్ సృష్టిస్తోంది 'టాటా సియెర్రా'. ఈ కారు కోసం భారతీయులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి దీనికి వచ్చిన 70,000 బుకింగ్‌లే (ఒక్క రోజులో) నిదర్శనం! మరి మీరు కూడా ఈ కారును బుక్ చేసుకున్నారా? లేదా బుక్​ చేసుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! టాటా సియెర్రా డెలివరీ డేట్​తో పాటు ధరలు, వేరియంట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా సియెర్రా ఎస్​యూవీ- డెలివరీ ఎప్పుడు?

టాటా సియెర్రా డెలివరీ ఎప్పుటి నుంచి?
టాటా సియెర్రా డెలివరీ ఎప్పుటి నుంచి?

టాటా సియెర్రా డెలివరీలు జనవరి 15న ప్రారంభం అవుతాయని కంపెనీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

తొలి విడతలో టాప్ ఎండ్ వేరియంట్లను, ఆ తర్వాత మిడ్- బేస్ వేరియంట్లను టాటా మోటార్స్​ డెలివరీ చేస్తుంది. మీరు ఎంచుకున్న కలర్​, వేరియంట్, నగరాన్ని బట్టి వెయిటింగ్ పీరియడ్ మారుతుంటుంది.

అదిరిపోయే బుకింగ్స్​ దక్కించుకుంది కాబట్టి, టాటా సియెర్రా వేరియంట్​ పీరియడ్​ కాస్త ఎక్కువగానే ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

టాటా సియెర్రా ఎస్​యూవీ- ధర ఎంత?

టాటా సియెర్రా క్లిక్​ అవ్వడానికి కారణం దాని ప్రైజింగ్​! అదిరిపోయే డిజైన్​తో వస్తున్న ఈ ఎస్​యూవీ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిర్ణయించింది కంపెనీ.

  • దీని ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).
  • టాప్ మోడల్ ధర రూ. 21.29 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

హైదరాబాద్​లో టాటా సియెర్రా ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

టాటా సియెర్రా ఎస్​యూవీ- ఎన్ని వేరియంట్లు ఉన్నాయి?

ఈ ఎస్​యూవీ.. మొత్తం ఏడు వేరియంట్లలో లభిస్తుంది. అవి..

స్మార్ట్+, ప్యూర్, ప్యూర్+, అడ్వెంచర్, అడ్వెంచర్+, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్+.

టాటా సియెర్రాలో మొత్తం మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లను ఇచ్చారు:

1.5 లీటర్ పెట్రోల్ (హైపీరియన్​ సిరీస్​): ఇది 104 హెచ్​పీ పవర్, 145 ఎన్​ఎం టార్క్‌ను ఇస్తుంది. దీనిలో 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

1.5 లీటర్ టర్బో-పెట్రోల్: ఇది మరింత పవర్‌ఫుల్. 157 హెచ్​పీ పవర్, 255 ఎన్​ఎం టార్క్‌ను ఇస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ జతచేశారు.

1.5 లీటర్ డీజిల్: మైలేజీ కోరుకునే వారికి ఇది బెస్ట్. 116 హెచ్​పీ పవర్‌తో వస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ రెండూ అందుబాటులో ఉన్నాయి.

టాటా సియెర్రా ఫీచర్లు.. నెక్ట్స్​ లెవల్ అంతే!

ఫీచర్ల విషయంలో ఈ టాటా సియెర్రా ఎస్‌యూవీ తన విభాగంలోనే టాప్ అని చెప్పొచ్చు!

ట్రిపుల్ స్క్రీన్ సెటప్: లోపల ఏకంగా మూడు స్క్రీన్లు ఉంటాయి. డ్రైవర్ కోసం ఒకటి, మధ్యలో ఒకటి, ముందు కూర్చునే ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా ఒక స్క్రీన్ ఇచ్చారు.

పానోరమిక్ సన్‌రూఫ్: ఆకాశాన్ని చూస్తూ ప్రయాణించేలా పెద్ద సన్‌రూఫ్ కూడా ఇందులో ఉంది.

ఆడియో: మ్యూజిక్​ లవర్స్​ కోసం 12 స్పీకర్లతో కూడిన జేబీఎల్​ ఆడియో సిస్టమ్ ఉంటుంది.

ఇతర సౌకర్యాలు: వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, రెండు వేర్వేరు జోన్లలో ఏసీని కంట్రోల్ చేసుకునే సదుపాయం ఉన్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe