budget 2026 : బడ్జెట్​ తర్వాత వేటి ధరలు తగ్గుతాయి? ఏ వస్తువుల రేట్లు పెరుగుతాయి?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంట్​లో బడ్జెట్​ 2026ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో పన్నుల విషయంలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఫలితంగా బడ్జెట్​ 2026 అనంతరం వేటి ధరలు తగ్గుతాయి? వేటి ధరలు పెరుగుతాయి? పూర్తి జాబితాను ఇక్కడ చూసేయండి..

Published on: Feb 1, 2026, 13:18:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేంద్ర బడ్జెట్ 2026 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూనే, సామాన్యులు, పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించేలా కస్టమ్స్ సుంకాలలో మార్పులు చేశారు. దీనివల్ల నిత్యావసర మందులు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనుండగా, విలాస వస్తువుల ధరలు పెరగనున్నాయి.

నిర్మలా సీతారామన్​.. (Sansad TV via PTI Photo)
నిర్మలా సీతారామన్​.. (Sansad TV via PTI Photo)

బడ్జెట్ ప్రతిపాదనల తర్వాత ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి? ఏవి పెరగనున్నాయి? అనే పూర్తి జాబితా ఇక్కడ చూడండి..

బడ్జెట్​ 2026- ధరలు తగ్గే వస్తువుల జాబితా..

సామాన్యులకు, విద్యార్థులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం ఈ బడ్జెట్​ 2026లో ఈ కింది వస్తువులపై పన్నులు/సుంకాలను తగ్గించింది:

వైద్యం: 17 రకాల క్యాన్సర్, అరుదైన వ్యాధుల మందులపై కస్టమ్స్ సుంకం రద్దు.

ఎలక్ట్రానిక్స్: మొబైల్ ఫోన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, దేశీయంగా తయారైన టీవీ పరికరాలు, కెమెరాలు.

విద్య - ప్రయాణం: విదేశీ విద్య, విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ 5% నుంచి 2%కి తగ్గింపు.

పర్యావరణం: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీ తయారీకి వాడే లిథియం-అయాన్ సెల్స్.

తోలు - పాదరక్షలు: తోలు వస్తువులు, బూట్ల తయారీకి వాడే ముడి పదార్థాలు.

వినోదం: వీడియో గేమ్స్ తయారీ విడిభాగాలు, విదేశీ సినిమా షూటింగ్ కోసం తెచ్చే పరికరాలు.

విమాన విడిభాగాలు, బయో-ఫ్యూయల్ కలిపిన సిఎన్జీ, సోలార్ ప్యానెల్ తయారీకి వాడే సోడియం యాంటిమోనేట్ వంటి వాటి ధరలు తగ్గనున్నాయి.

బడ్జెట్​ 2026- ధరలు పెరిగే వస్తువుల జాబితా..

విలాస వస్తువులు, పర్యావరణానికి హాని చేసే వస్తువులపై ఈ బడ్జెట్​ 2026లో ప్రభుత్వం సుంకాలను పెంచింది:

విలాస వస్తువులు: బ్రాండెడ్ వాచీలు, దిగుమతి చేసుకున్న ఖరీదైన మద్యం.

ధూమపానం: సిగరెట్లు, పాన్ మసాలా (ఎక్సైజ్ డ్యూటీ పెంపు వల్ల).

పరిశ్రమలు: బొగ్గు, లోహపు వ్యర్థాలు.

కాఫీ: కాఫీ రోస్టింగ్, బ్రూయింగ్, వెండింగ్ మెషీన్లపై ఇన్నాళ్లూ ఉన్న మినహాయింపుల రద్దు.

వ్యవసాయం: అమోనియం ఫాస్ఫేట్ వంటి కొన్ని రకాల ఎరువుల ధరలు పెరగవచ్చు.

ఎలక్ట్రానిక్స్​: దిగుమతు చేసుకునే టీవీలు, కెమెరాలు, ఫిల్మింగ్​ కోసం దిగుమతి చేసుకునే సౌండ్​ రికార్డింగ్​ పరికరాల ధరలు పెరగొచ్చు.

ఈ ధరల మార్పులు ప్రధానంగా దిగుమతి సుంకాలు, ఎక్సైజ్ సుంకాల్లో మార్పుల వల్ల జరుగుతాయి. ఇవి ఏప్రిల్ 1, 2026 నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More