Budget Smartphone : రూ. 15వేల కన్నా తక్కువ ధరకే 6300ఎంఏహెచ్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్- ఫీచర్లు అదుర్స్!

Redmi A7 Pro 5G : రెడ్​మీ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్ బడ్జెట్​ ఫ్రెండ్లీ సెగ్మెంట్​లోకి అడుగుపెట్టింది. దాని పేరు రెడ్​మీ ఏ7 ప్రో. తక్కువ ధరలో లాంగ్​ లాస్టింగ్​ బ్యాటరీ, మంచి పర్ఫార్మెన్స్​తో కూడిన గ్యాడ్టెస్​ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్​ అవుతుంది. ఈ స్మార్ట్​ఫోన్ ఫీచర్స్ మీకోసం..

Published on: Apr 14, 2026, 09:59:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Redmi A7 Pro price in India : బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో పోటీని పెంచుతూ షావోమీ తన తాజా మోడల్ రెడ్​మీ ఏ7 ప్రో 5జీని ఇటీవలే భారత్‌లోకి తీసుకొచ్చింది. కేవలం ధర మాత్రమే కాకుండా, ఈ ఫోన్‌లో అందించిన బ్యాటరీ సామర్థ్యం, లాంగ్ టర్మ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇప్పుడు టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రెడ్​మీ ఏ7 ప్రో 5జీ.. (Redmi)
రెడ్​మీ ఏ7 ప్రో 5జీ.. (Redmi)

రెడ్​మీ ఏ7 ప్రో 5జీ- ధర, లభ్యత..

రెడ్‌మీ ఏ7 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది:

4 జీబీ + 64 జీబీ: రూ. 11,499

4 జీబీ + 128 జీబీ: రూ. 12,499

ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 15 నుంచి అమెజాన్, షావోమీ అధికారిక వెబ్‌సైట్లలో విక్రయానికి రానుంది. మిస్ట్ బ్లూ, బ్లాక్, సన్‌సెట్ ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.

రెడ్​మీ ఏ7 ప్రో 5జీ- స్పెసిఫికేషన్స్​..

Display6.9-inch HD+ LCD, 120Hz refresh rate
ProcessorUnisoc T8300 (6nm, up to 2.2GHz)
RAM & Storage4GB RAM, up to 128GB storage (UFS 2.2)
Rear Camera32MP dual camera setup
Front Camera8MP selfie camera
Battery6,300mAh
Charging15W wired, 7W reverse wired charging
OSAndroid 16-based HyperOS 3 (4 OS upgrades, 6 years security updates)

రెడ్​మీ ఏ7 ప్రో 5జీ- భారీ బ్యాటరీ..

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 6.9- ఇంచ్ భారీ ఎల్​సీడీ డిస్​ప్లే. దీనికి 120 హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్ తోడు కావడంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 6,300ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అమర్చారు. ఈ సెగ్మెంట్లో ఇంత పెద్ద బ్యాటరీ ఉండటం ఇదే మొదటిసారి.

ఛార్జింగ్: 15డబ్ల్యూ ఛార్జింగ్‌తో పాటు 7డబ్ల్యూ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. అంటే, మీ ఫోన్ ద్వారా ఇతర చిన్న చిన్న గాడ్జెట్లను (ఇయర్‌బడ్స్ వంటివి) ఛార్జ్ చేసుకోవచ్చు.

రెడ్​మీ ఏ7 ప్రో 5జీ- పర్ఫార్మెన్స్, కెమెరా..

ఈ రెడ్​మీ ఏ7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ యూనీఎస్​ఓసీ టీ8300 (6ఎన్​ఎం) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 2.2జీహెచ్​జెడ్ క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. కెమెరా విభాగంలో వెనుకవైపు 32ఎంపీ మెయిన్ కెమెరా, ముందు భాగంలో సెల్ఫీల కోసం 8ఎంపీ కెమెరాను అందించారు. సాధారణ ఫోటోగ్రఫీ అవసరాలకు ఇది సరిపోతుంది.

రెడ్​మీ ఏ7 ప్రో 5జీ- సాఫ్ట్‌వేర్ రంగంలో 'గేమ్ ఛేంజర్'!

సాధారణంగా బడ్జెట్ ఫోన్లకు ఒకటి లేదా రెండు ఏళ్ల అప్‌డేట్స్ మాత్రమే లభిస్తాయి. కానీ రెడ్‌మీ ఏ7 ప్రో 5జీ విషయంలో షావోమీ భారీ హామీ ఇచ్చింది!

ఓఎస్ అప్‌డేట్స్: ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్​ఓఎస్ 3పై పనిచేసే ఈ ఫోన్‌కు 4 ఏళ్ల మేజర్ ఓఎస్ అప్‌డేట్స్ లభిస్తాయి.

సెక్యూరిటీ అప్‌డేట్స్: ఏకంగా 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.

ఏఐ ఫీచర్లు: గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్, సర్కిల్ టు సెర్చ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. రెడ్‌మీ ఏ7 ప్రో 5జీ ప్రారంభ ధర ఎంత?

భారత్‌లో దీని ప్రారంభ ధర రూ. 11,499 (4GB+64GB వేరియంట్).

2. ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుంది?

6,300mAh భారీ బ్యాటరీ కావడంతో, సాధారణ వినియోగదారులకు రెండు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది.

3. ఇందులో 5జీ సపోర్ట్ ఉందా?

అవును, ఇది యూనిసోక్ టీ8300 చిప్‌సెట్‌తో కూడిన 5జీ స్మార్ట్‌ఫోన్.

4. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఎన్ని ఏళ్లు వస్తాయి?

షావోమీ ఈ ఫోన్‌కు 4 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ప్రామిస్ చేసింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More