బెంగళూరు వంటి మెట్రో నగరంలో సొంతిల్లు అనేది ఒక కల. కానీ, ఐటీ హబ్‌గా వెలుగొందుతున్న ఈ నగరంలో సామాన్యుడికి ఆ కల క్రమంగా భారమవుతోంది. ఒకప్పుడు ఐశ్వర్యానికి చిహ్నంగా భావించే 'కోటి రూపాయల బడ్జెట్'.. నేడు బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కేవలం ఒక ప్రాథమిక స్థాయి ధరగా మారిపోయింది.

ముఖ్యంగా వైట్‌ఫీల్డ్, సర్జాపుర, యలహంక వంటి ఐటీ కారిడార్లలో ఒక సాధారణ 2 బీహెచ్‌కే ఫ్లాట్ కొనాలన్నా ఇప్పుడు కోటి రూపాయలకు పైనే ఖర్చు చేయాల్సి వస్తోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో చదరపు అడుగు ధర సగటున రూ. 15,000 నుంచి రూ. 18,000 వరకు పలుకుతుండటమే దీనికి ప్రధాన కారణం.
శివార్లలోనే రూ. 1 కోటి లోపు..
నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. 2025లో బెంగళూరులో నివాస గృహాల ధరలు.. ఏడాది ప్రాతిపదికన 12శాతం పెరిగాయి. ఈ ధరల పెరుగుదల వల్ల కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారు నగరం నడిబొడ్డున కాకుండా 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
"ప్రస్తుతం కోటి రూపాయల బడ్జెట్‌లో ఇల్లు కావాలంటే కెంగురి, జిగణి, దొడ్డబల్లాపుర రోడ్ లేదా సర్జాపుర లోపలి ప్రాంతాలకు వెళ్లాల్సిందే." అని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు.
నోబ్రోకర్ నివేదిక ప్రకారం, గతేడాదితో పోలిస్తే కోటి రూపాయల లోపు గృహాలకు డిమాండ్ పెరిగినప్పటికీ, మార్కెట్లో వాటి లభ్యత మాత్రం తగ్గిపోయింది.
కోటి రూపాయల బడ్జెట్ ఉంటే ఎక్కడ వెతకాలి?
మీ బడ్జెట్ రూ. 1 కోటి లోపు ఉంటే, ఈ కింది ప్రాంతాలు కొంత ఆశావహంగా ఉన్నాయి:
దక్షిణ బెంగళూరు: కనకపుర రోడ్.
{{/usCountry}}దక్షిణ బెంగళూరు: కనకపుర రోడ్.
{{/usCountry}}ఉత్తర బెంగళూరు: దేనహళ్లి, దొడ్డబల్లాపుర రోడ్.
తూర్పు బెంగళూరు: వర్తూరు దాటిన తర్వాత వచ్చే ప్రాంతాలు.
దేవనహళ్లిలోని బ్రిగేడ్ ఆర్చర్డ్స్ వంటి కొన్ని బ్రాండెడ్ టౌన్‌షిప్‌లలో ఇప్పటికీ 2 బీహెచ్‌కే యూనిట్లు కోటి రూపాయల లోపే లభిస్తున్నాయి.
నగరం లోపల ఇల్లు కావాలంటే రాజీ పడాల్సిందే!
ఇక బెంగళూరులోని ఇందిరానగర్, కోరమంగళ, జేపీ నగర్ వంటి ప్రీమియం ఏరియాల్లో కొత్త ఫ్లాట్లు రూ. 2 కోట్ల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఒకవేళ నగరం లోపలే ఉండాలి, బడ్జెట్ కోటి దాటకూడదు అనుకుంటే మాత్రం చాలా పాత ఇళ్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
"సిటీ లోపల కోటి రూపాయల బడ్జెట్‌లో పాత ఫ్లాట్లు దొరకవచ్చు. ఇందిరానగర్‌లో 30ఏళ్ల నాటి అపార్ట్మెంట్లు కొనుగోలు చేయవచ్చు. కానీ, అక్కడ కారు పార్కింగ్ సౌకర్యం ఉండకపోవచ్చు. అంతేకాదు ఆధునిక అపార్ట్‌మెంట్లలో ఉండే జిమ్, క్లబ్ హౌస్ వంటి సదుపాయాలను వదులుకోవాల్సి వస్తుంది," అని హను రెడ్డి రియల్టీకి చెందిన కిరణ్ కుమార్ వివరించారు.
కోటీ రూపాయల లోపు ఇళ్లులు శివారు ప్రాంతాల్లో దొరుకుతాయి. కానీ ఆఫీసులు మాత్రం బెంగళూరు మధ్యలో ఉంటాయి. దీని వల్ల ప్రయాణ సమయం భారీగా పెరుగుతుంది. పైగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, నీటి సరఫరా, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి మౌలిక సదుపాయాలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. అందుకే, ధర తక్కువగా ఉందని ఇల్లు కొనే ముందు నిత్యావసర సదుపాయాల లభ్యతను కూడా బేరీజు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.