అర్ధరాత్రి హఠాత్తుగా నిద్రలేస్తున్నారా? ఇది ప్రమాదకర సంకేతం..!
అర్ధరాత్రి 1 లేదా 2 గంటలకు హఠాత్తుగా మెలకువ వస్తోందా? ఇది సాధారణ విషయంగా కొట్టిపారేయకండి. ఇది మీ శరీరం అధిక ఒత్తిడిలో ఉన్నట్టు సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా అర్ధరాత్రి నిద్ర లేవడానికి కారణం ఏంటి? ఇక్కడ తెలుసుకోండి..
మీ శరీరం ఒత్తిడికి గురవుతుందోందని చెప్పేందుకు ఒక సింపుల్ సంకేతం ఉంది! అది.. రాత్రిపూట, ముఖ్యంగా 1 గంట లేదా 2 గంటల సమయంలో హఠాత్తుగా మెలకువ రావడం. ఈ విషయాన్ని అమెరికా కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ భోజ్‌రాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు. గుండె జబ్బులకు చికిత్స చేయడంలో డాక్టర్ భోజ్‌రాజ్‌కు 20 ఏళ్ల అనుభవం ఉంది.

హఠాత్తుగా నిద్ర లేవడం- దీనికి కారణం ఏంటి?
డాక్టర్ భోజ్‌రాజ్ ప్రకారం.. ఉదయం వేళల్లో పీక్ స్థాయికి చేరాల్సిన కార్టిసాల్ హార్మోన్, అసాధారణంగా వేరే సమయాల్లో పెరగడం వల్ల ఇలా రాత్రిపూట మెలకువ వస్తుంది.
కార్టిసాల్ అనేది శరీరంలో ప్రధాన ఒత్తిడి హార్మోన్.
తాను పోస్ట్ చేసిన వీడియోలో, రాత్రిపూట హఠాత్తుగా మెలకువ రావడం అనేది ఒత్తిడికి సంబంధించిన కీలకమైన జీవసంబంధ సంకేతం అని ఆయన వివరించారు.
అధిక ఒత్తిడికి సంకేతం..
"చాలా మంది పట్టించుకోని, మీ శరీరం ఒత్తిడికి గురైందని చెప్పే సంకేతం ఏంటంటే, అర్ధరాత్రి మేల్కొనడం. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు, కార్టిసాల్ పీక్ స్థాయిలు సరైన సమయం కానప్పుడు కూడా పెరుగుతాయి. సాధారణంగా, మీరు మేల్కొనడానికి కొద్దిసేపటి ముందు కార్టిసాల్ అత్యధికంగా ఉండాలి. కానీ అర్ధరాత్రి 1 లేదా 2 గంటలకు హఠాత్తుగా మెలకువ వచ్చి, మళ్లీ నిద్ర పట్టకపోతే, 'మీరు ఒత్తిడికి గురవుతున్నారు' అని మీ శరీరం మీకు చెబుతున్నట్టే," అని డాక్టర్ భోజ్‌రాజ్ అన్నారు.
ఆయన తన క్యాప్షన్‌లో ఇలా పేర్కొన్నారు: “ఒత్తిడికి సంబంధించిన ఎకకువగా విస్మరించే సిగ్నల్.. ఆందోళన లేదా చిరాకు కాదు, రాత్రి నిద్రలో మధ్యలో హఠాత్తుగా మెలకువ రావడం. చాలా మంది దీనిని 'సాధారణం' అని కొట్టిపారేస్తారు. కానీ, శారీరక పరంగా చూస్తే, మీ నాడీ వ్యవస్థ కష్టపడుతోందని చెప్పడానికి ఇది చాలా స్పష్టమైన సంకేతాలలో ఒకటి.”
దీని వెనుక ఉన్న సైన్స్..
ఈ పరిస్థితికి వెనుక ఉన్న కారణాన్ని ఆయన ఇలా వివరించారు:
"రాత్రిపూట మీ శరీరం పారాసింపథెటిక్ (విశ్రాంతి, మరమ్మత్తు) స్థితిలో ఉండాలి. కానీ, ఇన్ఫ్లమేషన్, రక్తంలో చక్కెర స్థాయిలలో అస్థిరత, సరిగ్గా నిద్ర లేకపోవడం లేదా భావోద్వేగ భారం వంటి కారణాల వల్ల ఒత్తిడి హార్మోన్లు పెరిగిపోయి ఉన్నప్పుడు, కార్టిసాల్ సరైన సమయం కానప్పుడు పెరుగుతుంది. ఈ పెరుగుదల మిమ్మల్ని తెల్లవారుజామున 1-3 గంటల మధ్య నిద్ర నుంచి బయటకు లాగుతుంది."
దీన్ని సాధారణంగా కొట్టిపారేయకండి!
“ఇది కేవలం యాదృచ్ఛికంగా వచ్చిన మెలకువలా అనిపించవచ్చు, కానీ ఇది నిజంగా ఒక జీవక్రియ అలారం. మీ కాలేయం అధికంగా పనిచేస్తోంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతున్నాయి. మీ కార్టిసాల్ పెరుగుతోంది. లేదా మీ నాడీ వ్యవస్థ పూర్తిగా షట్‌డౌన్ అవ్వలేదు. ఫంక్షనల్ మెడిసిన్‌లో, ఈ పద్ధతులు చాలా ముఖ్యమైనవి. మీరు గ్రహించిన దానికంటే ఎక్కువ ఒత్తిడిని మీ శరీరం మోస్తోందని, సాధ్యమయ్యే ఏకైక మార్గంలో అది మీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని ఈ సంకేతాలు మనకు చెబుతాయి," అని వివరించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


