...
...
Next Story

Delhi liquor case : రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై సీబీఐ అప్పీల్ - ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ అప్పీల్ చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

Published on: Feb 27, 2026, 19:43:37 IST
Advertisement

ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ అప్పీల్ చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది.

ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ పిటిషన్….

ఢిల్లీ హైకోర్టు (ఫైల్ ఫొటో)
ఢిల్లీ హైకోర్టు (ఫైల్ ఫొటో)

రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే సీబీఐ… తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా తాము సేకరించిన కీలక అంశాలను మరియు సాక్ష్యాలను ట్రయల్ కోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ) పేర్కొంది. దర్యాప్తు సంస్థ సమర్పించిన సాక్ష్యాధారాలను విస్మరించడం జరిగిందని… తక్షణమే ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని హైకోర్టును కోరింది.

రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేయటంతో…. ఈ పిటిషన్ పై హైకోర్టు ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. సుమారు రెండేళ్లుగా సాగుతున్న ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్, సిసోడియా తదితరులు జైలు శిక్షను అనుభవించి బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా దిగువ కోర్టు(రౌస్ అవెన్యూ కోర్టు) క్లీన్ చిట్ ఇచ్చింది. అయినప్పటికీ గంటల వ్యవధిలోనే సీబీఐ… అప్పీల్ పిటిషన్ దాఖలు చేయటంతో ఈ కేసులో ఏమైనా కీలక పరిణామాలు ఉంటాయా అన్న చర్చ కూడా మొదలైంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా , మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులపై మోపిన అభియోగాలకు తగిన సాక్ష్యాధారాలు లేవని, నేరపూరిత కుట్ర జరిగినట్లు ఎక్కడా నిరూపితం కాలేదని స్పష్టం చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks