...
...
Next Story

Best 7 seater cars : ఇండియాలో టాప్​ 5 అఫార్డిబుల్​ 7 సీటర్​ కార్లు ఇవి- ధర రూ. 5.6లక్షల నుంచే..!

కుటుంబ అవసరాలకు సరిపడా 7 సీటర్​ కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో ప్రస్తుతం లభిస్తున్న టాప్​- 5 అఫార్డిబుల్​ 7 సీటర్​ కార్ల వివరాలను, వాటి ధరలను, వాటి ఫీచర్లను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Feb 21, 2026, 07:30:34 IST
Advertisement

భారతదేశంలో 7-సీటర్ కార్లకు కొరత లేదు! కానీ ప్రీమియం ఫీచర్లు, ప్రాక్టికాలిటీని తక్కువ ధరలో అందించే వాహనాన్ని కనుగొనడం చాలా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మీరు పెద్ద కుటుంబం కోసం కారు కొంటున్నా, సుదూర ప్రయాణాల కోసం చూస్తున్నా లేదా బడ్జెట్ పరిమితుల్లో ఫ్లెక్సిబుల్ త్రీ-రో వాహనం కావాలనుకున్నా.. కొన్ని అద్భుతమైన ఆప్షన్స్​ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో టాప్​- 5 చౌకైన​ 7 సీటర్​ కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండియాలో టాప్​- 5 అఫార్డిబుల్​ 7 సీటర్​ కార్లు ఇవి..

ఇండియాలో లభిస్తున్న చౌకైన 7 సీటర్​ కార్లు ఇవి..
ఇండియాలో లభిస్తున్న చౌకైన 7 సీటర్​ కార్లు ఇవి..

1. కియా కారెన్స్ క్లేవిస్ – రూ. 11.07 లక్షలు

రెగ్యులర్ కారెన్స్ ఎంపీవీకి ఈ కారెన్స్ క్లేవిస్ ఒక ప్రీమియం ప్రత్యామ్నాయం. ఇది అప్‌డేటెడ్ టెక్నాలజీ, మెరుగైన సౌకర్యం, కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో మూడు 1.5-లీటర్ పవర్‌ట్రైన్‌లు ఉన్నాయి. అవి నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో-పెట్రోల్, టర్బో-డీజిల్.

లోపల, మీరు 12.3-ఇంచ్​ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-ఇంచ్​ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో కూడిన కనెక్టెడ్ పనోరమిక్ డిస్‌ప్లేను పొందుతారు. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 4-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పనోరమిక్ సన్‌రూఫ్, 8-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

కారెన్స్ క్లేవిస్‌లో 6 ఎయిర్‌బ్యాగులు, ఈసీఎస్​, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ వంటి 18 సేఫ్టీ ఫీచర్లు ప్రామాణికంగా వస్తాయి. హై-ఎండ్ వేరియంట్లలో లెవల్-2 అడాస్​ సూట్ కూడా లభిస్తుంది.

2. మహీంద్రా బొలెరో నియో – రూ. 8.69 లక్షలు

లాడర్-ఫ్రేమ్, ఆర్​డబ్ల్యూడీ డైనమిక్స్‌తో, మహీంద్రా బొలెరో నియో నిజమైన ఎస్​యూవీ. సాధారణ బొలెరో కంటే ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారి కోసం దీనిని తీసుకొచ్చారు. ఇందులో 9- ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ (ఆండ్రాయిడ్ ఆటో అండ్​ యాపిల్ కార్ ప్లే సపోర్ట్), రియర్ వ్యూ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్స్ ఉన్నాయి.

3. సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్​ – రూ. 11.57 లక్షలు

ఇది సిట్రోయెన్ 7-సీటర్ మోడల్. ఇది బ్రాండ్ షార్ప్ డిజైన్ లాంగ్వేజ్‌ని, ప్రీమియం టెక్నాలజీతో కూడిన ఇంటీరియర్స్‌ను కలిగి ఉంది. ఈ ఎస్​యూవీ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో, 6-స్పీడ్ మాన్యువల్ లేదా టార్క్ కన్వర్టర్ ఆప్షన్లలో లభిస్తుంది.

దీని క్యాబిన్ సాఫ్ట్-టచ్ డ్యాష్‌బోర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ హాలో కెమెరాను కలిగి ఉంటుంది. ఇందులో 10.25- ఇంచ్​ ఇన్ఫోటైన్‌మెంట్, 7- ఇంచ్​ డిజిటల్ టీఎఫ్​టీ క్లస్టర్ ఉన్నాయి. భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగులు, ఈఎస్​పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, టీపీఎంఎస్​ వంటి ఫీచర్లు లభిస్తాయి.

4. రెనాల్ట్ ట్రైబర్ – రూ. 5.76 లక్షలు

రెనాల్ట్ తన సబ్-4ఎం 7-సీటర్ ట్రైబర్‌ను కొత్త డిజైన్ మరియు ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. ఇది 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో (5-స్పీడ్ ఎంటీ లేదా ఏఎంటీ) వస్తుంది.

ఇంటీరియర్‌లో ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ కాక్‌పిట్, కొత్త అప్​హోలిస్ట్రీ, రివైజ్డ్ యూఐ ఉన్నాయి. దీని ప్రత్యేకత.. రిమూవెబుల్​ థర్డ్​ రో సీట్లు! ఫీచర్లలో కూల్డ్ గ్లోవ్‌బాక్స్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. భద్రత కోసం 4 ఎయిర్‌బ్యాగులు (హయ్యర్ ట్రిమ్స్), ఏబీఎస్​, ఈబీడీ, రివర్స్ కెమెరా ఉన్నాయి.

5. నిస్సాన్ గ్రావైట్ – రూ. 5.65 లక్షలు

ప్రస్తుతం మార్కెట్​లో అత్యంత సరసమైన 7-సీటర్ నిస్సాన్ గ్రావైట్. ఈ ఎంపీవీ ఇటీవలే లాంచ్​ అయ్యింది. ఇది ట్రైబర్ సీఎంఎఫ్​-ఏ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది, అదే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. అయితే, దీని డిజైన్ నిస్సాన్ గ్లోబల్ స్టైలింగ్‌ను ప్రతిబింబిస్తుంది.

ఇందులో డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్, రిమూవెబుల్ థర్డ్ రో సీట్లు, 8-ఇంచ్​ ఇన్ఫోటైన్‌మెంట్ ఉన్నాయి. ప్రయాణికుల కోసం సెకండ్, థర్డ్ రో లో ఇండిపెండెంట్​ ఏసీ వెంట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, అదనపు లంబార్ కుషనింగ్ ఉన్నాయి. సేఫ్టీ ప్యాకేజీలో 6 ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్​, ఈబీడీ, హిల్ స్టార్ట్ అసిస్ట్, టీపీఎంఎస్​, ఈఎస్​సీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

*పైన చెప్పినవి ఎక్స్​షోరూం ధరలు అని గుర్తుపెట్టుకోవాలి.

ప్రశ్నలు- సమాధానాలు :-

ప్రశ్న- నిస్సాన్ గ్రావైట్ , రెనాల్ట్ ట్రైబర్ మధ్య ఉన్న ప్రధాన తేడాలేమిటి?

నిస్సాన్ గ్రావైట్, రెనాల్ట్ ట్రైబర్ రెండూ ఒకే ప్లాట్‌ఫారమ్, ఇంజన్‌ను పంచుకున్నప్పటికీ, వాటి డిజైన్- సేఫ్టీ ఫీచర్లలో మార్పులు ఉన్నాయి. గ్రావైట్ నిస్సాన్ గ్లోబల్ డిజైన్ శైలిని కలిగి ఉండటమే కాకుండా, ప్రారంభ వేరియంట్ నుంచి 6 ఎయిర్‌బ్యాగులను ప్రామాణికంగా అందిస్తోంది. అదే సమయంలో ట్రైబర్ తన విశాలమైన క్యాబిన్, కొత్తగా అప్‌డేట్ చేసిన డిజిటల్ కాక్‌పిట్‌తో ఆకట్టుకుంటుంది.

2. కియా కారెన్స్ క్లేవిస్​లోని 'అడాస్​' ఫీచర్ వల్ల ప్రయోజనం ఏంటి?

కియా కారెన్స్ క్లేవిస్ ఎగువ వేరియంట్లలో లభించే లెవల్​ 2 అడాస్​ అనేది ఒక అత్యాధునిక భద్రతా సాంకేతికత. ఇది రోడ్డుపై ప్రమాదాలను గుర్తించి డ్రైవర్‌ను హెచ్చరించడమే కాకుండా, అత్యవసర సమయాల్లో ఆటోమేటిక్ బ్రేకింగ్ వేయడం, లేన్ మారుతున్నప్పుడు సరిచేయడం, ముందున్న వాహనాల వేగానికి అనుగుణంగా కారు వేగాన్ని నియంత్రించడం వంటి పనులను చేస్తుంది. దీనివల్ల సుదూర ప్రయాణాలు మరింత సురక్షితంగా మారుతాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe