వివో ఎక్స్200 సిరీస్ అరంగేట్రం చేసినప్పటి నుంచి మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఇప్పుడు, పలు మీడియా నివేదికల ప్రకారం ఈ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు రెడీ అవుతోందని తెలుస్తోంది. దాని పేరు వివో ఎక్స్200టీ. ఫ్లాగ్‌షిప్ పవర్‌ని, సరసమైన ధరను బ్యాలెన్స్ చేసే పరికరం కోసం వేచి చూస్తున్న వారికి, ఇది ఒక మంచి ఆప్షన్ కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో ఎక్స్200టీ లాంచ్ టైమ్‌లైన్..

టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ అందించిన వివరాల ప్రకారం.. వివో ఎక్స్200టీ స్మార్ట్‌ఫోన్ 2026 జనవరి నెలాఖరులో భారతదేశంలో విడుదల కానుంది.
2026లో మార్కెట్లో అనేక కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్కానున్నాయి. ఈ సమయంలోనే ఈ ఎక్స్200టీని విడుదల చేయడం వ్యూహాత్మకంగా నిర్ణయం! దీని ద్వారా, ఇటీవల లాంచ్ అయిన ఎక్స్300 సిరీస్, ఎక్స్200టీ మోడల్స్ మధ్య తగినంత గ్యాప్ లభిస్తుంది. ఫలితంగా, వివో అమ్మకాలను గరిష్ఠంగా పెంచుకోవచ్చు.
వివో ఎక్స్200టీ నుంచి ఏంమి ఆశించవచ్చు?
మీడియా నివేదికల్లో అత్యంత ఆసక్తికరమైన సమాచారం ఏంటంటే.. ఈ ఫోన్ పొజీషనింగ్! ఎక్స్200టీని "ఎక్స్200, ఎక్స్200 ఎఫ్ఈల కలయిక" గా అభివర్ణిస్తున్నారు.
ఈ హైబ్రిడ్ సిద్ధాంతం నిజమైతే, ఎక్స్200 ఎఫ్ఈ నుంచి కాంపాక్ట్, సౌకర్యవంతమైన డిజైన్‌ను, ఎక్స్200 నుంచి శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ డీఎన్ఏని ఈ ఎక్స్200టీ తీసుకుంటుంది.
- 6830ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్మీ కొత్త స్మార్ట్‌ఫోన్! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇందులో ZEISS-బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. అయితే, ఇది ప్రధానంగా పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంది.
సాధారణంగా ఉండే 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు, ఇందులో పెద్ద బ్యాటరీని ఆశించవచ్చు. బహుశా, ఇది ఎక్స్200ఎఫ్ఈలో ఉన్న బ్యాటరీ పరిమాణానికి దగ్గరగా ఉండొచ్చు.
వివో ఎక్స్200టీ- ధర..
{{/usCountry}}సాధారణంగా ఉండే 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు, ఇందులో పెద్ద బ్యాటరీని ఆశించవచ్చు. బహుశా, ఇది ఎక్స్200ఎఫ్ఈలో ఉన్న బ్యాటరీ పరిమాణానికి దగ్గరగా ఉండొచ్చు.
వివో ఎక్స్200టీ- ధర..
{{/usCountry}}ఇది ఇటీవల లాంచ్ అయిన ఫ్లాగ్‌షిప్ ఎక్స్300 సిరీస్ కంటే, అలాగే ఎక్స్200 కంటే కూడా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం, వివో సంస్థలో ఎక్స్200 ఎఫ్ఈ ఫ్లాగ్‌షిప్ రూ. 54,999 ధరతో అందుబాటులో ఉంది. కాబట్టి, వివో ఎక్స్200టీ ధర కూడా దాదాపు అదే స్థాయిలో లేదా కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది.
2026 ప్రారంభంలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, దీని గురించి పూర్తి వివరాలు ఇంకా గోప్యంగా ఉన్నాయి. ఈ ఫోన్ నిజంగా మార్కెట్లోకి వస్తే, ఇది ఒక ఆసక్తికరమైన ఎంపిక అవుతుంది. మీరు ఒక ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, వివో ఎక్స్200టీ కోసం మరికొంత కాలం వేచి చూడటం మంచిదేమో!
రానున్న రోజుల్లో ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వాటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.