దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న మూడు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో పాటు కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు ఇందులో ఉన్నాయి.

మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో పార్లమెంటులో వాడివేడి చర్చ జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే… కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ 2 బిల్లులను ప్రవేశపెట్టగా… మరో బిల్లును కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా వీటిని ప్రతిపాదించారు. అనంతరం వీటిని సభలో ప్రవేశపెట్టేందుకు చర్చ చేపట్టారు. ఈ బిల్లులను విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. డివిజన్ ఓటింగ్‌కు పట్టుబట్టాయి. అందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు.
లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఓటింగ్ జరగగా… ఓటింగ్‌లో 333 మంది ఎంపీలు పాల్గొన్నారు. బిల్లును ప్రవేశపెట్టేందుకు మద్దతుగా 207 ఓట్లు రాగా… బిల్లును ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 126 ఓట్లు వచ్చాయి. మెజారిటీ సభ్యుల మద్దతు లభించడంతో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మిగిలిన రెండు బిల్లులను ప్రభుత్వం…. లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
నారీ శక్తి వందన్ అధినియమ్ ను సవరణను ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా 2029 లోక్ సభ ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడానికి సవరణ బిల్లును ఆమోదించడానికి ప్రభుత్వం ప్రతిపక్షాల మద్దతును కోరుతోంది.
2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళల రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేలా సవరణకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీలను కోరారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పించే అంశానికి నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపెట్టడమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ కీలకమైన బిల్లులపై లోక్‌సభలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రధాని మోదీ ఈ సాయంత్రం లోక్‌సభలో ప్రసంగిస్తారు.
ఇక ప్రస్తుతం దేశంలో 1971 జనాభా లెక్కల ప్రకారమే లోక్‌సభ స్థానాలు కొనసాగుతున్నాయి. గతంలో 2002లో పునర్విభజన జరిగినప్పటికీ, కేవలం నియోజకవర్గాల సరిహద్దులు మాత్రమే మారాయి తప్ప సీట్ల సంఖ్య పెరగలేదు. కానీ ఇప్పుడు 2011 జనాభా గణాంకాల ప్రకారం సీట్లను భారీగా పెంచబోతున్నారు. ఇందులో 815 స్థానాలు రాష్ట్రాలకు, 35 స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించనున్నారు.
{{/usCountry}}ఇక ప్రస్తుతం దేశంలో 1971 జనాభా లెక్కల ప్రకారమే లోక్‌సభ స్థానాలు కొనసాగుతున్నాయి. గతంలో 2002లో పునర్విభజన జరిగినప్పటికీ, కేవలం నియోజకవర్గాల సరిహద్దులు మాత్రమే మారాయి తప్ప సీట్ల సంఖ్య పెరగలేదు. కానీ ఇప్పుడు 2011 జనాభా గణాంకాల ప్రకారం సీట్లను భారీగా పెంచబోతున్నారు. ఇందులో 815 స్థానాలు రాష్ట్రాలకు, 35 స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించనున్నారు.
{{/usCountry}}ఇక మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే పునర్విభజన తప్పనిసరి అని కేంద్రం వాదిస్తోంది. అయితే ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగేలా ఈ ప్రక్రియ సాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి విపక్షాల డిమాండ్ మేరకు కేంద్రం ఏవైనా మార్పులు చేస్తుందా లేదా అనేది పార్లమెంట్ సమావేశాల్లో తేలనుంది. ఈ కీలకమైన బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం లభిస్తే… దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.