మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్ అనేది ఒక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఇది ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా, అత్యవసర సమయాల్లో ఆదుకుంటుంది. అయితే ఈ కాలంలో క్రెడిట్ కార్డ్ పొందడం ఈజీ అని అందరు చెబుతున్నప్పటికీ, చాలా మంది అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంటుంది. ఇది అనేక ఇబ్బందులకు దారి తీస్తుంది. మరి అసలు బ్యాంకులు అప్లికేషన్లను ఎందుకు రిజెక్ట్ చేస్తాయి? ఇది తెలుసుకుంటే మీ అప్రూవల్ ఛాన్సెస్ పెంచుకోవచ్చు!
క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ తిరస్కరణకు 5 ప్రధాన కారణాలు:

1. బలహీనమైన క్రెడిట్ హిస్టరీ: క్రెడిట్ కార్డ్ మంజూరు చేయడంలో మీ గత ఆర్థిక లావాదేవీల రికార్డే కీలకం.
గతంలో తీసుకున్న అప్పులను బాధ్యతాయుతంగా చెల్లించిన దాఖలాలు లేకపోతే బ్యాంకులు మీకు కార్డ్ ఇచ్చేందుకు వెనకడుగు వేస్తాయి.
లోన్ ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టడంలో ఆలస్యం చేసినా, ఒక్క నెలను మిస్ చేసినా అది మీ రిస్క్ ప్రొఫైల్‌ను పెంచుతుంది.
మీకు ఇచ్చిన క్రెడిట్ లిమిట్‌లో ఎక్కువ భాగం వాడేస్తుంటే, మీరు అప్పుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారని భావించి ఆర్థిక సంస్థలు అప్లికేషన్‌ను తిరస్కరిస్తారు.
2. ఆదాయం తక్కువగా ఉండటం లేదా ఉద్యోగంలో అస్థిరత:
తిరిగి చెల్లించే సామర్థ్యం ఉంటేనే బ్యాంకులు కార్డును ఇస్తాయి.
బ్యాంకు నిర్ణయించిన కనిష్ట ఆదాయ పరిమితి కంటే మీ సంపాదన తక్కువగా ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. తరచుగా ఉద్యోగాలు మారుతున్నా లేదా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో చేరి తక్కువ కాలమే అయినా బ్యాంకులు మీ ఆర్థిక స్తోమతను విశ్వసించవు.
ఫ్రీలాన్సర్లు, పార్ట్-టైమ్ ఉద్యోగుల విషయంలో ఆదాయం స్థిరంగా లేకపోతే కఠినమైన నిబంధనల వల్ల అప్రూవల్ రావడం కష్టం.
3. అప్పుల భారం ఎక్కువగా ఉండటం:
{{/usCountry}}3. అప్పుల భారం ఎక్కువగా ఉండటం:
{{/usCountry}}మీ సంపాదనలో ఎక్కువ భాగం అప్పులకే పోతుంటే కొత్త కార్డ్ రావడం కష్టమే.
అదే సమయంలో ఇప్పటికే పలు పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులు ఉంటే బ్యాంకులు మీకు కొత్తగా అప్పు ఇవ్వడానికి ఇష్టపడవు.
దీనిని 'క్రెడిట్ హంగ్రీ' ప్రవర్తనగా బ్యాంకులు పరిగణిస్తాయి. సాధారణంగా, మీ నెలవారీ ఆదాయంలో అప్పుల చెల్లింపులు 30% మించకుండా ఉండటం మంచిది.
4. దరఖాస్తులో తప్పులు లేదా అసంపూర్ణ డాక్యుమెంటేషన్:
చిన్న పొరపాట్లు కూడా పెద్ద అడ్డంకులుగా మారుతాయి.
ఆధార్, పాన్ కార్డుల్లో ఉన్నట్లుగా పేరు స్పెల్లింగ్ లేకపోయినా, అడ్రస్ వివరాల్లో తప్పులు ఉన్నా అప్లికేషన్ ఆగిపోతుంది.
కేవైసీ పత్రాలు సరిగ్గా లేకపోయినా, ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించకపోయినా బ్యాంకులు నేరుగా రిజెక్ట్ చేస్తాయి.
5. వయస్సు, ఇతర అర్హతలు:
ప్రతి బ్యాంకు కొన్ని కనీస నిబంధనలు విధిస్తుంది.
నిర్ణీత వయస్సు పరిమితిలో లేనివారికి కార్డులు మంజూరు చేయరు.
కొన్ని కార్డులు కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి. సరైన పౌరసత్వ ఆధారాలు లేకపోయినా అనర్హులుగా ప్రకటిస్తారు.
చివరిగా.. క్రెడిట్ కార్డ్ అనేది ఒక సౌకర్యం మాత్రమే కాదు, అది ఒక బాధ్యత కూడా. దీన్ని సరిగ్గా వాడకపోతే భారీ వడ్డీలు, అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, కార్డ్ కోసం అప్లై చేసే ముందే మీ ఖర్చు చేసే అలవాట్లను సమీక్షించుకోండి. క్రమశిక్షణతో కూడిన రీపేమెంట్ అలవాటు మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను బలోపేతం చేస్తుంది.