ఇన్‌స్టెంట్ లోన్ వర్సెస్ క్రెడిట్ కార్డ్ లోన్- ఏది ఉత్తమం?
ఇన్‌స్టెంట్ లోన్ వర్సెస్ క్రెడిట్ కార్డ్ రుణం: అత్యవసర నిధుల కోసం ఏది ఉత్తమం? ఎవరికి ఏది ప్రయోజనకరం? తీసుకునే ముందు ఎలాంటి విషయాలను పరిగణించాలి? నష్టపోకూడదు అంటే ఈ వివరాలను కచ్చితంగా తెలుసుకోవాలి..
మీరు నిధుల కొరతతో ఉన్నట్లయితే, పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఆమోదయోగ్యమైన, ఆచరణాత్మకమైన మార్గం. అయితే మార్కెట్లో చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉండటంతో.. ఏది ఎంచుకోవాలో తెలియక అయోమయం చెందడం సహజంగా మారింది. 'ఇన్‌స్టెంట్ లోన్' తీసుకోవాలా? లేదా ‘క్రెడిట్ కార్డు లోన్’ తీసుకోవాలా? అనేది అంత తేలికైన నిర్ణయం కాదు. ఈ రెండు అన్‌సెక్యూర్డ్ లోన్‌లను పోల్చి చూస్తూ, ఎవరికి ఏది ఉత్తమమమైన ఎంపిక అవుతుందో ఇక్కడ తెలుసుకుందాము..

సాధారణంగా, లోన్ ఎగైనెస్ట్ క్రెడిట్ కార్డులు అనేవి ముందుగానే ఆమోదించి ఉంటాయి. మీరు ఒకసారి క్లిక్ చేస్తే చాలు, డబ్బు మీ ఖాతాలోకి బదిలీ అవుతుంది. ఇది సాధారణంగా మీ క్రెడిట్ కార్డ్ పరిమితిపై ఇవ్వడం జరుగుతుంది. కానీ దీనిని ఒక ప్రత్యేక రుణంగా పరిగణిస్తారు.
మరోవైపు ఇన్‌స్టంట్ లోన్‌లకు దరఖాస్తు చేయడానికి మంచి క్రెడిట్ స్కోర్, కనీస జీతం, కేవైసీ వంటి కొన్ని ప్రాథమిక అర్హతలు అవసరం.
ఇన్‌స్టెంట్ లోన్ వర్సెస్ క్రెడిట్ కార్డ్ లోన్: ఎలా నిర్ణయించుకోవాలి?
I. వడ్డీ రేటు:
ఏ రుణాన్ని ఎంచుకోవాలి అనే విషయంలో అత్యంత ముఖ్యమైన అంశం వడ్డీ రేటు. సాధారణంగా, క్రెడిట్ కార్డ్ రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, సాపేక్షంగా తక్కువ వడ్డీ ఉన్నదాన్ని ఎంచుకోవాలి. రుణం మొత్తం ఎక్కువగా ఉండి, కాలపరిమితి దీర్ఘకాలంగా ఉంటే, వడ్డీ రేటులో 60-70 బేసిస్ పాయింట్ల చిన్న తేడా కూడా చాలా పెద్ద వ్యత్యాసాన్ని చూపగలదు.
II. ప్రాసెసింగ్ ఫీజు:
రుణం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును కూడా వసూలు చేస్తాయి. ఈ ఫీజు, రుణంగా విడుదల చేసిన మొత్తం నుంచి తీసివేయడం జరుగుతుంది. దీనివల్ల మీ ఖాతాకు బదిలీ అయ్యే తుది మొత్తం తగ్గుతుంది. కాబట్టి, ఏ రకమైన రుణం తీసుకోవాలో నిర్ణయించుకునే ముందు ఈ ఫీజును పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
III. పంపిణీ వేగం:
ఒక రుణానికి బదులుగా మరొకటి ఎంచుకోవడానికి దోహదపడే మరో అంశం.. రుణం విడుదలయ్యే వేగం. మీకు అత్యవసరంగా నిధులు అవసరమైతే, మీ అవసరాలను తక్షణమే తీర్చే రుణాన్ని ఎంచుకోవడం సహజం. ఇన్‌స్టెంట్ లోన్లు లేదా ప్రీ-అప్రూవ్డ్ లోన్లు ఈ విషయంలో వేగంగా ఉంటాయి.
IV. ఇతర ఖర్చులు:
తరువాత ముఖ్యమైన అంశం ఆ రుణంతో ముడిపడి ఉన్న అనుబంధ ఖర్చులు. ఉదాహరణకు జీఎస్టీ లేదా ఇతర హిడెన్ ఛార్జీలు. ఒక రుణంలో ఈ అనుబంధ ఖర్చులు ఎక్కువగా ఉంటే, అది మరొక రుణంతో పోలిస్తే మరింత ఖరీదైనదిగా మారుతుంది.
V. క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం:
చివరగా, చాలా ముఖ్యమైన అంశం క్రెడిట్ స్కోర్‌పై పడే ప్రభావాన్ని పరిశీలించడం. మీ క్రెడిట్ కార్డుపై తీసుకున్న రుణం, మీ మొత్తం క్రెడిట్ పరిమితిని పూర్తిగా ఉపయోగించినట్లయితే, అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, మీ క్రెడిట్ స్కోర్‌కు తక్కువ హాని కలిగించే రుణ ఎంపికను ఎంచుకోవాలి.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. లోన్ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


