అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి మధ్యంతర ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగలడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశాలు కనిపిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు శరవేగంగా పడిపోతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర బ్యారెల్‌కు 94 డాలర్ల దిగువకు పడిపోయింది. గత కొన్ని నెలల కాలంలో క్రూడాయిల్ ధర ఈ స్థాయికి తగ్గడం ఇదే తొలిసారి.

రాయిటర్స్ కథనం ప్రకారం.. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93.50 డాలర్ల వద్ద ట్రేడైంది. అంతకుముందు సెషన్లోనే ఇది ఏకంగా 8.7 శాతం మేర క్షీణించింది. అమెరికా బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) కూడా 4.5 శాతం తగ్గి బ్యారెల్‌కు 91.73 డాలర్లకు చేరగా, ఆ తర్వాత 87 డాలర్ల దిగువకు పడిపోయింది.
యుద్ధం ముగింపుపై ఆశలు.. కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు
ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ముగింపునకు రావచ్చుననే అంచనాలు చమురు మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. మధ్యంతర ఎన్నికల ఫలితాలతో అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ డెమోక్రాట్లు ఆధిపత్యం సాధించారు. దీంతో ఇంధన ధరల మంటకు కారణమైన ఇరాన్ యుద్ధానికి అవసరమైన నిధుల సమీకరణ చేయడం ట్రంప్‌కు తీవ్ర సవాలుగా మారనుంది. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో రాకపోకల ఆటంకాలు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
"మధ్యప్రాచ్యం నుంచి చమురు ఎగుమతులు పెరగడం, ఇరాన్‌పై వెంటనే దాడులు చేసే ఆలోచన లేదని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ధర తగ్గుదలకు దోహదపడ్డాయి. కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల ఆధిపత్యం వల్ల మిడిల్ ఈస్ట్‌లో అమెరికా సైనిక వ్యయం తగ్గడమే కాకుండా, శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడే అవకాశం ఉంది" అని అమెరికాకు చెందిన బీఓకే ఫైనాన్షియల్ ట్రేడింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెనిస్ కిస్లర్ పేర్కొన్నారు.
ఇరాన్ దాడులపై ట్రంప్ వ్యాఖ్యలు
ఇరాన్‌పై తక్షణమే దాడులు చేసే ఆలోచన ఏదీ లేదని అధ్యక్షుడు ట్రంప్ 'ఫైనాన్షియల్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమికి ఇరాన్ యుద్ధమే ప్రధాన కారణమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ సైతం వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు యుద్ధ వాతావరణం చల్లబడేలా చేస్తున్నాయి. అయితే, చర్చల విషయంలో ఇరాన్ కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో శాంతి ఒప్పందం ఏ మేరకు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాలి.
భారత్‌కు లభించే లబ్ధి ఏంటి?
{{/usCountry}}ఇరాన్‌పై తక్షణమే దాడులు చేసే ఆలోచన ఏదీ లేదని అధ్యక్షుడు ట్రంప్ 'ఫైనాన్షియల్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమికి ఇరాన్ యుద్ధమే ప్రధాన కారణమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ సైతం వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు యుద్ధ వాతావరణం చల్లబడేలా చేస్తున్నాయి. అయితే, చర్చల విషయంలో ఇరాన్ కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో శాంతి ఒప్పందం ఏ మేరకు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాలి.
భారత్‌కు లభించే లబ్ధి ఏంటి?
{{/usCountry}}చమురు ధరల క్షీణత, పశ్చిమాసియాలో శాంతి యత్నాలు భారత్‌కు లబ్ధి చేకూర్చే అంశాలు. భారత్ తన అవసరాలకు కావలసిన ఇంధనంలో దాదాపు 90 శాతాన్ని దిగుమతుల ద్వారానే పొందుతోంది.
గతంలో రష్యా నుంచి భారత్ పెద్దమొత్తంలో క్రూడాయిల్ దిగుమతి చేసుకున్నప్పటికీ, రవాణా ఖర్చులు పెరగడం, రాయితీలు తగ్గడంతో అది భారత్‌కు భారం కానుంది. హార్ముజ్ జలసంధిలో పరిస్థితులు చక్కబడితే గల్ఫ్ దేశాల నుంచి భారత్ మళ్లీ చమురు దిగుమతులను పునరుద్ధరించే లేదా పెంచే అవకాశం లభిస్తుంది.
ఇప్పటికే భారత్, చైనా, ఇరాక్, ఖతార్ దేశాల నౌకలపై హార్ముజ్ జలసంధి ఆంక్షలను ఇరాన్ తొలగించడంతో భారత్ గల్ఫ్ సరఫరాలను పెంచింది. యుద్ధం ప్రారంభంలో ఎదురైన కొరత కారణంగా భారత్ ఆఫ్రికా దేశాల నుంచి కూడా ముడిచమురు కొనుగోలు చేస్తూ సరఫరాలను సమతుల్యం చేసుకుంది.
గల్ఫ్‌లో యుద్ధం తలెత్తిన తర్వాత పరిమాణం తగ్గినా, భారత్ దిగుమతుల బిల్లు మాత్రం పెరిగింది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో భారత్ 59.7 మిలియన్ టన్నుల ముడిచమురును దిగుమతి చేసుకుంది. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 18 శాతం తక్కువ. అయినప్పటికీ, అంతర్జాతీయంగా ధరలు మండిపోవడంతో దిగుమతుల బిల్లు 26 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్ల నుంచి 49 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. ఇప్పుడు ధరలు తగ్గి శాంతి నెలకొంటే భారత ఆర్థిక వ్యవస్థపై భారం గణనీయంగా తగ్గుతుంది.
మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల పరాజయం
అమెరికా కాంగ్రెస్‌పై ఆధిపత్యాన్ని రిపబ్లికన్లు కోల్పోగా డెమోక్రాట్లు ఘన విజయం సాధించారు. సెనేట్‌లో డెమోక్రాట్లు ఏడు స్థానాలను చేజిక్కించుకుని మొత్తం 54 స్థానాలకు చేరగా, మరో రెండింట్లో ఆధిక్యంలో ఉన్నారు. రిపబ్లికన్ల బలం 44కు పడిపోయింది. ప్రతినిధుల సభలోనూ డెమోక్రాట్లు ఇప్పటివరకు 240 స్థానాలు గెలుచుకోగా, రిపబ్లికన్లు 147 స్థానాలకే పరిమితమయ్యారు.