...
...
Next Story

DA hike news : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు- ఎంతంటే..

DA hike for central government employees : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఈసారి 2శాతం పెరిగింది! ఈ మేరకు కేంద్ర కేబినెట్​ నిర్ణయం తీసుకుంది.

Published on: Apr 18, 2026, 13:44:15 IST
Advertisement

DA hike from Jan 2026 : డీఏ పెంపు వార్త కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్​ న్యూస్​! డియర్​నెస్​ అలొవెన్స్​ని (కరవు భత్యం) ఈసారి 2శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్​ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు..

డీఏ పెంపుపై కేంద్రం తాజాగా చేసిన ప్రకటన జనవరి 2026 నుంచి వర్తిస్తుంది.

8వ వేతన సంఘంపై సర్వత్రా చర్చలు జరుగుతున్న వేళ ఈ డీఏ పెంపు వార్తకు సైతం సర్వత్రా ప్రాధాన్యతం సంతరించుకుంది.

ద్రవ్యోల్బణం కారణంగా సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి రెండుసార్లు (జనవరి, జులై) డీఏ పెరుగుతుంటుంది. వీటి ప్రకటనలు హోలీ, దీపావళి సమయంలో వస్తాయి. అయితే ఈసారి సగం ఏప్రిల్​ అయిపోయినా కూడా డీఏ పెంపుపై ప్రభుత్వం నుంచి ఇంకా ప్రకటన రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన కనిపించింది. చివరికి శనివారం డీఏ పెంపుపై కేబినెట్​ నిర్ణయం తీసుకుంది.

చివరిగా గతేడాది అక్టోబర్​లో కరవు భత్యాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా డీఏ 55శాతం నుంచి 58శాతానికి పెరిగింది. అది జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది.

అంటే, తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ.. బేసిక్​ పేలో 60శాతానికి చేరింది.

వేతన సవరణ దిశగా అడుగులు: ఉద్యోగుల భారీ డిమాండ్లు!

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఉద్యోగ సంఘాలు మాత్రం సంతృప్తిగా లేవు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాల్లో సమూల మార్పులు రావాలంటే 8వ వేతన సంఘాన్ని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. సాధారణంగా ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే సంప్రదాయం ఉంది. 7వ వేతన సంఘం గడువు ముగుస్తుండటంతో, కొత్త కమిషన్ ఎప్పుడొస్తుందా అని దాదాపు 1.2 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.

కనీస వేతనం రూ. 69 వేలు సాధ్యమేనా?

కేవలం జీతాల పెంపు మాత్రమే కాకుండా, ఇతర ప్రయోజనాలపై కూడా ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి:

వార్షిక ఇంక్రిమెంట్: ప్రతి ఏడాది ఇచ్చే ఇంక్రిమెంట్‌ను 6 శాతానికి పెంచాలి.

హెచ్‌ఆర్‌ఏ: ఇంటి అద్దె భత్యాన్ని కనీసం 30 శాతంగా నిర్ణయించాలి.

పాత పెన్షన్ స్కీమ్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలన్నది ఉద్యోగుల ప్రధాన ఎజెండా.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe