...
...
Next Story

Delhi blast : అదృష్టం అంటే ఇతనిదే! ఒక్క నిమిషంలో ప్రాణాలు కాపాడుకున్నాడు..

ఒక్క నిమిషం తేడాలో దిల్లీ పేలుడు నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి కథ ఇది! సోమవారం సాయంత్రం 6:52కి పేలుడు సంభవిచంగా.. అజయ్​ సింగ్​ అనే వ్యక్తి, 6:51కి అదే ప్రాంతంలోని మెట్రో టికెట్​ కొనుగోలు చేశారు. తొలుత క్యాబ్​ తీసుకుందామని ఆలోచించినా, చివరి నిమిషంలో మనసు మార్చుకుని మెట్రో ఎక్కారు.

Published on: Nov 12, 2025 07:30 AM IST
Advertisement

విధి ఆడే వింత నాటకం మనిషికి అంతుచిక్కదు! కొన్ని క్షణాల్లోనే జీవితం మారిపోతుంది అనేందుకు హిమాచల్​ ప్రదేశ్​ వాసి అజయ్​ సింగ్​కి జరిగిన సంఘటన చక్కటి ఉదాహరణ! సోమవారం జరిగిన దిల్లీ పేలుడు నుంచి అతను ఒక్క నిమిషం వ్యవధిలో తప్పించుకున్నారు. అసలేం జరిగిందంటే..

చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం.. ప్రాణాన్ని నిలబెట్టింది..

దిల్లీ పేలుడు నుంచి క్షణాల్లో తప్పించుకున్న వ్యక్తి..
దిల్లీ పేలుడు నుంచి క్షణాల్లో తప్పించుకున్న వ్యక్తి..

సోమవారం సాయంత్రం 6:52 గంటల ప్రాంతంలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 10 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే, సోమవారం సాయంత్రం అజయ్​ సింగ్​ అదే ప్రాంతంలో ఉన్నారు! తొలుత క్యాబ్‌లో ఇంటికి వెళ్లాలని అనుకున్న అతను, అనూహ్యంగా మనసు మార్చుకుని మెట్రో ఎంచుకున్నారు. పేలుడు సంభవించడానికి కేవలం ఒక్కటంటే ఒక్క నిమిషం ముందు, అంటే 6:51 గంటలకు ఆయన మెట్రో టికెట్ కొనుగోలు చేశారు.

మెరాకీ హాస్పిటాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన అజయ్ సింగ్, తన అనుభవాన్ని లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు. ప్లాన్​లో ఆకస్మిక మార్పు తన ప్రాణాన్ని ఎలా కాపాడిందో వివరించారు.

“నిన్న సాయంత్రం నేను చాందినీ చౌక్‌లో ఉన్నాను. ఇంటికి తిరిగి వెళ్లడానికి క్యాబ్ తీసుకోవడానికి రెడ్ ఫోర్ట్ వైపు నడుస్తున్నాను. కానీ, అకస్మాత్తుగా - ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు - నా మనసు మారి, మెట్రో తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను 6:51 పీఎంకి టికెట్ కొన్నాను. ఆ అనాలోచిత నిర్ణయం తీసుకోకపోయి ఉంటే, నేను సరిగ్గా పేలుడు జరిగిన ప్రాంతంలోనే, లేదా దానికి చాలా దగ్గరగా ఉండేవాడిని.”

'ఎప్పుడూ మెట్రోలో ఇంటికి వెళ్లలేదు'

"బహుశా అది ఇన్​స్టింక్ట్​ కావచ్చు. బహుశా అదృష్టం కావచ్చు. లేదా... కర్మ కావచ్చు. కొన్నిసార్లు, జీవితం మనకు సూక్ష్మమైన సంకేతాలను ఇస్తుంది - మనం ఊహించలేని దాని నుంచి మనల్ని దూరంగా ఉంచే సున్నితమైన తోసేస్తుంది. ఈ చిన్న నిర్ణయానికి, కనబడని రక్షణకు, ఎల్లప్పుడూ మనల్ని గమనిస్తున్న పెద్ద శక్తి ఒకటి ఉందని గుర్తుచేసినందుకు నేను ఈ రోజు చాలా కృతజ్ఞుడను," అని ఆయన అభిప్రాయపడ్డారు.

హిమాలయాల్లో కొత్త జీవితం..

చండీగఢ్‌లో రక్షణ రంగ కుటుంబంలో జన్మించి, చెన్నైలో పెరిగిన అజయ్.. తన ఇరవైలలో మంచి జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి, హిమాలయాల్లో మరింత సంతృప్తికరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం, ఆయన కంఫర్ట్, కమ్యూనిటీ, సాహసాలను కలిపి అందించే బౌటిక్ ఎయిర్‌బీఎన్‌బీ స్టే సముదాయం అయిన మెరాకీ హాస్పిటాలిటీకి నాయకత్వం వహిస్తున్నారు.

"నా 20 ఏళ్ల ప్రారంభంలోనే, మంచి జీతం ఇచ్చే ఉద్యోగాన్ని వదిలి, హిమాలయాలను అన్వేషించడం, ఇతరులు కూడా దాని మ్యాజిక్‌ను అనుభవించేందుకు సహాయం చేయడం వంటి మరింత ఉత్తేజకరమైన దానిని ఎంచుకున్నాను!" అని ఆయన తన ప్రొఫైల్‌లో పంచుకున్నారు.

అజయ్ సింగ్ కథ... జీవితం క్షణాల్లో మారిపోతుంది అనే సత్యాన్ని మనందరికీ గుర్తు చేస్తుంది!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe