...
...
Next Story

Dhruv Rathee : పోలీసుల అదుపులో ధ్రువ్​ రాఠీ.. సీజేపీ నిరసనల వేళ హై- టెన్షన్!

ప్రముఖ యూట్యూబర్​ ధ్రువ్​ రాఠీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలో జరగనున్న సీజేపీ నిరసనల్లో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతున్న ధ్రువ్​ రాఠీని, గురుగ్రామ్​లోని ఆయన నివాసంలో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Updated on: Oct 10, 2026, 09:52:59 IST
Advertisement

ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్​ రాఠీని దిల్లీ, గురుగ్రామ్ పోలీసులు శనివారం ఉదయం అదుపులో తీసుకున్నారు. గురుగ్రామ్ సెక్టార్ 56లోని ఆయన నివాసం నుంచి పోలీసులు ధ్రువ్​ రాఠీని డీటైన్ చేశారు.

సీజేపీ ఫౌండర్​ అభిజిత్​ దీప్కేతో ధ్రువ్​ రాఠీ.. (PTI)
సీజేపీ ఫౌండర్​ అభిజిత్​ దీప్కేతో ధ్రువ్​ రాఠీ.. (PTI)

దిల్లీలో ఇంకొద్దిసేపట్లో ప్రారంభంకానున్న సీజేపీ నిరసనల్లో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతున్న ధ్రువ్​ రాఠీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శనివారం భారీ నిరసనలకు పిలుపునిచ్చింది.

దిల్లీ నిరసనల నేపథ్యంలో సీజేపీ ఫౌండర్​ అభిజిత్ దీప్కే, ప్రతినిథి సౌరవ్​ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

రాత్రి నుంచే ఇంటి ముందు పోలీసులు?

గురుగ్రామ్​ సెక్టర్​ 56లోని కేంద్రీయ పార్క్ విహార్​లో ధ్రువ్​ రాఠీ నివాసం ఉంది. అనేక మీడియా కథనాల ప్రకారం.. ఆయన ఇంటి వద్ద శుక్రవారం రాత్రి నుంచి దాదాపు 50 మంది పోలీసులు గుమిగుడారు. చివరికి శనివారం ఉదయం 7 గంటల 50 నిమిషాలకు, రాఠీ ఇంట్లోకి వెళ్లారు. నిరసనల్లో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లొద్దని పోలీసులు చెప్పినట్టు, ధ్రువ్​ రాఠీ వినకపోవడంతో ఆయన్ని అదుపులోకి తీసుకునట్టు తెలుస్తోంది.

ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీకి వ్యతిరేకంగా అనేక సంవత్సరాలుగా ధ్రువ్​ రాఠీ తన యూట్యూబ్​ ఛానెల్​లో వీడియోలు చేస్తున్న విషయం తెలిసిందే. జర్మనీలో నివసించే ధ్రువ్​ రాఠీ.. ఇటీవలే బెంగళూరులో జరిగిన సీజేపీ నిరసనల్లో పాల్గొన్నారు.

ఇప్పటికే 400 మంది డీటైన్?

మరోవైపు నిరసనలు ప్రారంభం అవ్వకముందే, ఇప్పటికే 400మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నిరసనలు, భద్రత, ఆంక్షలతో దిల్లీ అతలాకుతలమవుతోంది. 45 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. 70 రైళ్లను రద్దు చేశారు. 30కిపైగా ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. ఫలితంగా దిల్లీ ప్రజలు శనివారం తెల్లవారుజామున నుంచే తీవ్ర ట్రాఫిక్​ జామ్స్​లో ఇరుక్కుపోయారు.

దిల్లీ నిరసనల వేళ పోలీసులు ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

“ఒక్క అధికారి (జ్ఞానేష్ కుమార్)ని కాపాడేందుకు, దిల్లీ ప్రజలందరిని ఈ తరహాలో ఇబ్బంది పెట్టడం ఏంటి?” అని సీజేపీ ప్రతినిథులు ప్రశ్నిస్తున్నారు.

న్యూదిల్లీ జిల్లాలో ప్రస్తుతం ఆంక్షలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఫలితంగా అక్కడి రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయని, 2020 లాక్​డౌన్ తరహా పరిస్థితులను చూస్తున్నామని క్షేత్రస్థాయిలో ఉన్న మీడియా రిపోర్టర్లు చెబుతున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks