ELSS vs Index mutual funds : సంపద సృష్టికి ఏది ఉత్తమం? నిపుణుల మాటలు ఇవి..

ఈఎల్​ఎస్​ఎస్​ వర్సెస్​ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? దేన్ని ఎంచుకోవాలి? సంపద సృష్టికి ఏది ఉత్తమం? నిపుణుల సూచనలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Dec 6, 2025, 10:40:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మీరు లాంగ్​ టర్మ్​ వెల్త్​ క్రియేషన్​పై దృష్టి పెట్టాలని అనుకుంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్​ మంచి ఆప్షన్​ అవుతుంది. అయితే, ఈ తరహా ఇన్వెస్ట్​మెంట్​లోనూ అనేక మార్గాలు ఉన్నాయి. వీటిల్లో రెండు.. రిటైల్ పెట్టుబడిదారుల్లో బాగా ఫేమస్​ అయ్యాయి. అవి.. ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్​ఎస్​ఎస్​), ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.

ఈఎల్​ఎస్​ఎస్​ వర్సెస్​ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్..
ఈఎల్​ఎస్​ఎస్​ వర్సెస్​ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్..

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) డేటా ప్రకారం.. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఎక్కువ ప్రజాదరణ పొందాయి. మొత్తం 345 స్కీమ్‌లతో, వీటి కింద ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) రూ. 3.20 లక్షల కోట్లుగా ఉంది. మరోవైపు, మొత్తం మ్యూచువల్ ఫండ్ ప్రపంచంలో ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్ ఫండ్ల సంఖ్య 42 మాత్రమే కాగా, వాటి మొత్తం ఆస్తుల విలువ రూ. 2.53 లక్షల కోట్లు!

ఈఎల్​ఎస్​ఎస్​ వర్సెస్​ ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్స్​- ముఖ్యమైన వ్యత్యాసం ఏంటి?

ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి పాసివ్​ ఫండ్స్​! అంటే, అవి ఒక నిర్దిష్ట బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను (ఉదాహరణకు, నిఫ్టీ 50) అనుసరిస్తాయి. అయితే, చాలా వరకు ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్లు యాక్టివ్‌ ఫండ్స్​. అంటే ఇండెక్స్​ ఇచ్చే రిటర్నులను బీట్​ చేసే విధంగా స్టాక్​ పోర్ట్​ఫోలియోను ఫండ్​ మేనేజర్​ తన ఎనాలసిస్​తో క్రియేట్​ చేయాలి.

గతంలో (మే 2022కి ముందు), ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్లు యాక్టివ్‌గా మాత్రమే ఉండేవి. కానీ సెబీ 25 మే 2025న ఫండ్ హౌస్‌లను పాసివ్ ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్‌లను కూడా ప్రారంభించడానికి అనుమతించింది!

పెట్టుబడిదారులు దేన్ని ఎంచుకోవాలి?

ఈక్విటీ ద్వారా దీర్ఘకాలికంగా సంపదను సృష్టించడానికి ఈ రెండు పెట్టుబడి మార్గాలు తగినవే అని నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ, పెట్టుబడిదారుడి వ్యక్తిగత అవసరాలు, అభిరుచుల ఆధారంగా ఒకటి మరొకదాని కంటే మెరుగైనది కావచ్చు.

సెబీ-రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్, అప్నా ధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకురాలు ప్రీతి జెండే ప్రకారం.. దేన్ని ఎంచుకోవాలనేది పెట్టుబడిదారుడి మైండ్​సెట్​పై ఆధారపడి ఉంటుంది.

"ఈక్విటీ పెట్టుబడులు సహనం, క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక విధానాన్ని కోరుకుంటాయి. ఈఎల్​ఎస్​ఎస్​, ఇండెక్స్ ఫండ్స్ రెండింటికీ ఇది అవసరం. మీరు ఏ ఉత్పత్తిని ఎంచుకోవాలనేది మీ మైండ్​సెట్​, ఎమోషనల్​ బిహేవియర్​పై ఆధారపడి ఉంటుంది," అని ఆమె అన్నారు.

"ఈఎల్​ఎస్​ఎస్​, ఇండెక్స్ ఫండ్స్ రెండూ దీర్ఘకాలిక సంపదను సృష్టించడానికి సహాయపడే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సే. అయితే భయం, దురాశ అనే రెండు మానవ భావోద్వేగాల ద్వారా త్వరగా ప్రభావితమయ్యే వారు ఈఎల్​ఎస్​ఎస్ ట్రై చేయొచ్చు. ఇవి​ మెరుగైన కాంపౌండింగ్​ బెనిఫిట్స్​ అందించగలదు. కనీసం ఒక దశాబ్దం పాటు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని సాధారణంగా సలహా ఇస్తారు," అని ఆమె జోడించారు.

ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, షేర్.మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్ హెడ్ నీలేష్ డీ నాయక్ మాట్లాడుతూ.. “వాటి అనుకూలత మీ వ్యక్తిగత అవసరాలు, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. మీరు పాత పన్ను విధానం కింద ఉండి, సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలను పొందాలని చూస్తున్నట్లయితే, ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్‌లు అనుకూలంగా ఉంటాయి," అని అన్నారు.

"చాలా ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్‌లు యాక్టివ్​గా ఉంటాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను అధిగమించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి. అందుకే, ఫండ్ పనితీరు స్థిరత్వం, రిస్క్, పెట్టుబడి శైలిని సరైన అంచనా వేసిన తర్వాత సరైన ఫండ్‌ను ఎంచుకోవడం ముఖ్యం. మరోవైపు, ఇండెక్స్ ఫండ్‌లు పాసివ్ ఫండ్‌లు. ఇవి కేవలం బెంచ్‌మార్క్ ఇండెక్స్‌కు అనుగుణంగా రాబడులను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి,” అని ఆయన వివరించారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించాల్సి ఉంటుంది.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More