...
...
Next Story

ఒమన్‌లో ఇరాన్ డ్రోన్ దాడి.. భారతీయుడు మృతి.. నెతన్యాహు ఆఫీస్‌పై మిస్సైల్స్!

పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో అల్లకల్లోల పరిస్థితి ఉంది. ఈ దాడుల్లో భారతీయుడు ఒకరు మృతి చెందారు.

Published on: Mar 2, 2026, 17:08:54 IST
Advertisement

పశ్చిమాసియా దాడులు, ప్రతీకార దాడులతో అట్టుడుకుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. రాయబార కార్యాలయాలపై కూడా దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ డ్రోన్ దాడులతో అనేక ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు

ఒమన్‌లో ఇరాన్ డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. ఒమన్ గల్ఫ్‌లో ఒక ఇరాన్ డ్రోన్ ఆయిల్ ట్యాంకర్‌పై దాడి చేసింది. ఆ నౌకను MKD VYOMగా గుర్తించారు. హార్ముజ్ జలసంధిని సమీపిస్తున్న ఓడలను ఇరాన్ బెదిరిస్తోంది. ఒమన్ గల్ఫ్‌లో జరిగిన దాడిని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఒమన్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. చనిపోయిన సిబ్బంది భారతదేశానికి చెందినవారని తెలిపింది.

వార్తా సంస్థ రాయిటర్స్ MKD VYOMను ఒక డ్రోన్ ఢీకొట్టిందని తెలిపింది. ఆ ప్రమాదంలో ఓడ ఒమన్ తీరం వెంబడి ప్రయాణిస్తుండగా అందులో ఉన్న ఒక సిబ్బంది మరణించారని పేర్కొంది. మెుదటగా బాధితుడిని గుర్తించలేదు, తర్వాత భారతీయుడని తెలిసింది. సంఘటన జరిగిన సమయంలో ఇంజిన్ గదిలో ఉన్న భారతదేశానికి చెందిన వ్యక్తి మరణించారు.

నెతన్యాహు కార్యాలయంపై దాడి!

మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ మిస్సైల్స్ దాడి చేసిందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నివేదించింది. ఆపరేషన్ ట్రూప్ ప్రామిస్ 4లో భాగంగా ఇరాన్ అటాక్ చేసినట్టుగా ప్రకటించింది. ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండర్ ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టుగా వెల్లడించింది. ప్రస్తుతం నెతన్యాహు ఎక్కడ ఉన్నారో తెలియని పేర్కొంది. అయితే ఇరాన్ చేసిన ప్రకటనను మాత్రం ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. ఇరాన్‌లో ఇద్దరు సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారులను చంపేసినట్టుగా ఇజ్రాయెల్ ప్రకటన చేసింది.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యతో ఇరాన్ ప్రతీకారదాడులు చేస్తోంది. గల్ఫ్ ప్రాంతం అంతా ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులపై వరుసగా దాడులు కొనసాగిస్తోంది ఇరాన్.

ప్రధాని మోదీ ఆందోళన

ఇటువంటి వివాదాలను పరిష్కరించడానికి భారతదేశం ఎల్లప్పుడూ చర్చలు, దౌత్యం కోసం సలహా ఇస్తుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. భారత ప్రభుత్వం అన్ని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోందని, భారత పౌరుల భద్రతను నిర్ధారించడానికి ఈ ప్రాంతంలోని దేశాలతో సంప్రదింపులు జరుపుతోందని కూడా మోదీ వ్యాఖ్యానించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe