డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సృష్టించిన విప్లవం యూపీఐ. అయితే, ఇప్పుడు యూపీఐ, రూపే లావాదేవీల రుసుములపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్‌మెంట్ బిల్లు' దేశీయంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలోనే.. చెల్లింపుల చట్టంలోని సెక్షన్ 10ఏకి సవరణలు చేస్తూ తెచ్చిన ఈ బిల్లుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ చేసిన తీవ్ర విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంతే ఘాటుగా సమాధానమిచ్చారు.
అసలు వివాదం ఏంటంటే..

ఇప్పటివరకు యూపీఐ, రూపే కార్డుల లావాదేవీలపై వ్యాపారులకు ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్ - వ్యాపారులు చెల్లించే రుసుము) ఉండేది కాదు. అంటే ఇది జీరో-ఎండీఆర్‌గా అమల్లో ఉంది. అయితే కొత్త బిల్లు ద్వారా ఈ నిబంధనను సవరించి, భవిష్యత్తులో పరిస్థితులకు అనుగుణంగా ఫీజులపై నోటిఫికేషన్ ఇచ్చే హక్కును ప్రభుత్వం తన వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది.
జైరాం రమేష్ ఆరోపణలు.. ట్రంప్ ఒత్తిడే కారణమా?
ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తీవ్రంగా తప్పుపట్టారు. ఉచితంగా లభించే డిజిటల్ సేవలకు చట్టబద్ధమైన రక్షణను ప్రభుత్వం తొలగిస్తోందని, దీనివల్ల పరోక్షంగా వినియోగదారులపైనే ఆర్థిక భారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2025-26 సంవత్సరానికి గానూ రూ.2.86 లక్షల కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసిందని, ఆ డబ్బుతో యూపీఐ మౌలిక సదుపాయాలను ఉచితంగానే నిర్వహించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
"యూపీఐ వ్యవస్థను ఆర్థికంగా నిలబెట్టుకోవడానికి ఛార్జీలు విధించడమే ఏకైక మార్గమని మోదీ ప్రభుత్వం చెప్పడం పూర్తిగా తప్పు. వ్యాపారులు లేదా వినియోగదారులపై ఎలాంటి అదనపు రుసుములు వేయకుండానే యూపీఐ వ్యవస్థను సజావుగా నడిపేందుకు ఆర్బీఐ వద్ద తగినంత సామర్థ్యం ఉంది," అని జైరాం రమేష్ అన్నారు.
అంతేకాకుండా, ఈ మార్పు వెనుక అమెరికా ఒత్తిడి ఉందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. యూఎస్టీఆర్ 2026 నివేదిక ప్రకారం.. భారత్‌లోని యూపీఐ, రూపేల వల్ల అమెరికాకు చెందిన వీసా, మాస్టర్‌కార్డ్ వంటి సంస్థలు దెబ్బతింటున్నాయని పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయి మోదీ ప్రభుత్వం మన రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలను బలిపెడుతూ ఈ నిర్ణయం తీసుకుందని జైరాం రమేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ..
{{/usCountry}}అంతేకాకుండా, ఈ మార్పు వెనుక అమెరికా ఒత్తిడి ఉందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. యూఎస్టీఆర్ 2026 నివేదిక ప్రకారం.. భారత్‌లోని యూపీఐ, రూపేల వల్ల అమెరికాకు చెందిన వీసా, మాస్టర్‌కార్డ్ వంటి సంస్థలు దెబ్బతింటున్నాయని పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయి మోదీ ప్రభుత్వం మన రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలను బలిపెడుతూ ఈ నిర్ణయం తీసుకుందని జైరాం రమేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ..
{{/usCountry}}జైరాం రమేష్ చేసిన ఆరోపణలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ఈ బిల్లు వల్ల సాధారణ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడదని స్పష్టం చేశారు.
ఎండీఆర్ రుసుములు అనేది కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తాయని, సాధారణ ప్రజలు చేసే లావాదేవీలపై రూపాయి కూడా ఛార్జీ పడదని ఆమె వివరించారు. బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు తమ నెట్‌వర్క్ భద్రత, సాంకేతికత, మౌలిక సదుపాయాల మెరుగుదలకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని, ఈ ప్రతిపాదన చివరికి వినియోగదారులకే మేలు చేస్తుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా.. ఈ రుసుముల అమలుపై ఇంకా ఎలాంటి ఆఖరి నిర్ణయం తీసుకోలేదని మంత్రి చెప్పారు. బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత ఎన్‌పీసీఐ నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ దీనిపై స్పష్టత ఇస్తుందన్నారు.
"మీ పార్టీ.. పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు సభలో నిర్మాణాత్మకంగా పాల్గొని ఉంటే ఈ విషయాలన్నీ చర్చకు వచ్చేవి," అని పార్లమెంట్ సమావేశాల్లో నిరసనలు చేస్తున్న కాంగ్రెస్‌ని నిర్మలా సీతారామన్ ఎద్దేవా చేశారు.
సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు..
ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
"ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో యూపీఐ లావాదేవీలపై కూడా పన్నులు వేసే ప్రమాదం ఉంది. రేపు అన్ని యూపీఐ ట్రాన్సాక్షన్లపై 1% ఛార్జ్ పెట్టినా ఆశ్చర్యం లేదు," అని ఒక నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
మరొక నెటిజన్ స్పందిస్తూ.. "భారతీయ ఇ-కామర్స్, డిజిటల్ చెల్లింపుల్లో ఎక్కువ భాగం వీసా వంటి విదేశీ సంస్థల ద్వారాలే జరుగుతున్నాయి. అలాంటప్పుడు భారతీయ యూపీఐకి కూడా సరైన ఎండీఆర్ వాటా దక్కడం అవసరమే," అని మద్దతు తెలిపారు.
"వ్యాపారులపై ఛార్జీలు వేస్తే, వారు వస్తువుల ధరలను పెంచరా? అప్పుడు ఆ భారం అంతిమంగా వినియోగదారుడిపైనే పడుతుంది కదా! ఈ ప్రభావం వ్యవస్థపై ఎలా ఉంటుందో ప్రభుత్వానికి తెలియదా?" అని మరో వినియోగదారుడు ప్రశ్నించారు.