...
...
Next Story

Tata safari EV : టాటా సఫారీ ఈవీలో అదిరిపోయే హైటెక్ ఫీచర్లు! మహీంద్రాకి గట్టి పోటీ..

Tata safari EV launch date : మచ్ అవైటెడ్​ టాటా సఫారీ ఈవీ.. ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతోంది! ఈ నేపథ్యంలోనే తొలిసారి భారత రోడ్లపై టెస్టింగ్​ చేస్తూ కనిపించింది. ఫలితంగా స్పై షాట్స్​ నుంచి కొన్ని కీలక విషయాలు వెలువడ్డాయి. ఆ వివరాలు..

Published on: Jun 2, 2026, 05:58:52 IST
Advertisement

Tata safari EV price : టాటా మోటార్స్ రాబోయే ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘టాటా సఫారీ ఈవీ’.. భారత రోడ్లపై మొదటిసారి టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కింది. లీకైన చిత్రాల (స్పై షాట్స్) ప్రకారం.. ఈ భారీ ఈవీలో హారియర్ ఈవీ లాంటి సరికొత్త రియర్ సస్పెన్షన్, అధునాతన ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. టాటా ఎలక్ట్రిక్ వాహనాల లైనప్‌లోనే అత్యంత ఖరీదైన, ప్రీమియం మోడల్‌గా రాబోతున్న ఈ సఫారీ ఈవీ.. మార్కెట్​లోకి రాబోతున్న మూడు వరుసల సీటింగ్ గల 'మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్' కి గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ ఏడాది పండుగ సీజన్​లో ఈ టాటా ఎలక్ట్రిక్ కారు లాంచ్​కానుంది.

టాటా సఫారీ ఈవీ..
టాటా సఫారీ ఈవీ..

ప్రస్తుతమున్న డీజిల్ సఫారీ బాడీ డిజైన్/సిల్హౌట్ లాగే ఈ కొత్త ఈవీ ఉన్నప్పటికీ.. కారు వెనుక భాగంలో సైలెన్సర్ లేకపోవడం, అలాగే 'హారియర్ ఈవీ' తరహాలోనే ఇండిపెండెంట్ మల్టీ-లింక్ రియర్ సస్పెన్షన్ సెటప్ కలిగి ఉండటం వల్ల ఇది సఫారీ ఎలక్ట్రిక్ వెర్షన్ అని స్పష్టమవుతోంది. ఈ కారును టాటా కంపెనీ తన సరికొత్త Acti.ev+ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తోంది.

టెస్టింగ్‌లో వెల్లడైన ముఖ్యాంశాలు, అంచనా స్పెసిఫికేషన్ల విశ్లేషణ ఇదీ:

టాటా సఫారీ ఈవీ- డిజైన్, ఎక్స్​టీరియర్..

సైడ్ స్టెప్ ఫీచర్: లీకైన చిత్రాలలో ఈ కారుకు 'సైడ్ స్టెప్' అమర్చి ఉండటం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న రెగ్యులర్ డీజిల్ సఫారీ మోడల్‌లో ఈ ఫీచర్‌ను కంపెనీ అందించడం లేదు. ఎక్కడానికి, దిగడానికి వీలుగా ఈ యూటిలిటీ ఫీచర్‌ను జోడించారు.

ఈవీ లుక్: ఎలక్ట్రిక్ కారు మొత్తం ముసుగుతో కప్పి ఉంచినప్పటికీ, ఎలక్ట్రిక్ వెర్షన్ కోసం రీడిజైన్ చేసిన ఫ్రంట్ అండ్ రేర్ బంపర్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్, ప్రత్యేక ఈవీ బ్యాడ్జింగ్‌లతో ఇది రానుంది. డైమెన్షన్స్​ మాత్రం రెగ్యులర్ మోడల్ లాగే ఉంటాయి.

టాటా సఫారీ ఈవీ- TiDAL టెక్నాలజీతో అల్ట్రా-మోడరన్ ఇంటీరియర్1

కారులోని మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు:

  • ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్
  • ఆటో పార్క్ అసిస్ట్, కారును పిలుచుకునే సమ్మన్ మోడ్
  • లో-స్పీడ్ క్రూయిజ్ కంట్రోల్ (ట్రాఫిక్‌లో ఉపయోగపడుతుంది)
  • యూపీఐ ఆధారిత ఇన్-కార్ పేమెంట్ సర్వీసెస్ (కారులో నుంచే టోల్ గేట్లు, పెట్రోల్ బంకుల్లో పేమెంట్స్ చేయవచ్చు)
  • 540-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా సిస్టమ్.

టాటా సఫారీ ఈవీ- బ్యాటరీ, రేంజ్..

అధికారిక వివరాలు వెల్లడి కానప్పటికీ, సఫారీ ఈవీలో హారియర్ ఈవీ లాగే 65kWh, 75kWh బ్యాటరీ ఆప్షన్లను అందించే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీ (75kWh) వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) కోసం డ్యూయల్ మోటార్ సెటప్ లభిస్తుంది.

హారియర్ ఈవీ పవర్ గణాంకాల ఆధారంగా అంచనా:

వేరియంట్పవర్టార్క్
రియర్-వీల్ డ్రైవ్238 hp315 Nm
ఆల్-వీల్ డ్రైవ్354 hp (238hp + 116hp ఫ్రంట్ మోటార్)504 Nm

టాటా సఫారీ ఈవీ- రైడింగ్ రేంజ్ ఎంత ఉండవచ్చు?

హారియర్ ఈవీతో పోలిస్తే సఫారీ ఈవీ పరిమాణంలో పెద్దదిగా, ఎక్కువ బరువుగా ఉండటం వల్ల దీని రేంజ్ కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది. (హారియర్ ఈవీ 65kWh మోడల్ 538 కి.మీ, 75kWh RWD మోడల్ 628 కి.మీ రేంజ్ ఇస్తుండగా.. సఫారీ ఈవీ రేంజ్ సింగిల్ ఛార్జ్‌పై సుమారు 480 నుంచి 550 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది).

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks