దేశ వ్యాప్తంగా లాస్ట్-మైల్ డెలివరీ విభాగంలో పనిచేస్తున్న వేలాది మంది గిగ్ వర్కర్లు, డెలివరీ భాగస్వాముల సంక్షేమానికి ప్రముఖ ఈవీ-యాజ్-ఏ-సర్వీస్ ప్లాట్ఫామ్ ‘హాలా మొబిలిటీ’ ముందుకొచ్చింది! తమ 'సీడ్' (SEED - Sustainable Ecosystem to Empower Delivery Partners) వ్యవస్థలో భాగంగా డెలివరీ బాయ్స్ ఆర్థిక భద్రత, సులువైన ఆదాయ ప్రాప్యత, వేగవంతమైన ఛార్జింగ్ అవసరాలను తీర్చేందుకు మూడు వినూత్న సేవలను ఆవిష్కరించింది. వాటి వివరాలను ఇక్కడ డీటైల్డ్గా తెలుసుకోండి..
హాలా మొబిలిటీ నుంచి మూడు కొత్త సేవలు ఇవే..

1. కవచ్ (ఆరోగ్య, ప్రమాద బీమా):
రోజువారీ డెలివరీలపై ఆధారపడే గిగ్ వర్కర్లకు సాంప్రదాయ ఇన్సూరెన్స్ పాలసీల వ్యయం భారంగా మారుతుంది. దీనిని అధిగమించేందుకు రోజుకు కేవలం రూ. 2తో అత్యంత సరసమైన ప్రీమియంతో హెల్త్, యాక్సిడెంట్ కవరేజ్ను హాలా అందిస్తోంది. ఇది రైడర్లకు అత్యవసర సమయాల్లో కొండంత అభయాన్ని ఇస్తుంది.
2. స్వయమ్ (ముందస్తు ఆదాయ సదుపాయం):
డెలివరీ బాయ్స్ నిత్యం కష్టపడి సంపాదించినప్పటికీ, పే-డే (జీతం వచ్చే రోజు) వరకు వేచి చూడాల్సి వస్తుంది. 'స్వయమ్' ఫీచర్ ద్వారా అర్హులైన రైడర్లు తాము ఇప్పటికే సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని ముందే పొందే వెసులుబాటు దక్కుతుంది. రైడర్ల పనితీరు, ఆదాయ డేటాను పరిశీలించి హాలా సంస్థ ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఇది బ్యాంకులతో సంబంధం లేకుండా క్రెడిట్ హిస్టరీని ఏర్పాటు చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది.
3. ట్విన్ఫినిటీ (60 సెకన్ల బ్యాటరీ స్వాపింగ్):
ఈవీ వాహనాలు ఛార్జింగ్ కావడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో డెలివరీ రైడర్ల సమయం వృథా అవుతోంది. దీనిని నివారించేందుకు హాలా సంస్థ సొంతంగా 'ట్విన్ఫినిటీ' బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా రైడర్లు ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని తీసి, కేవలం 60 సెకన్ల వ్యవధిలోనే పూర్తి ఛార్జింగ్ ఉన్న బ్యాటరీని అమర్చుకోవచ్చు. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్, స్వాపింగ్ స్టేషన్లను సంస్థ ఇన్-హౌస్గా రూపొందించింది.
‘రైడర్ల సంక్షేమమే మా ప్రాధాన్యత’
ఈ కొత్త సేవల ఆవిష్కరణ సందర్భంగా హాలా మొబిలిటీ కో-ఫౌండర్, సీఈఓ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి కాళకొండ మాట్లాడుతూ..
{{/usCountry}}ఈ కొత్త సేవల ఆవిష్కరణ సందర్భంగా హాలా మొబిలిటీ కో-ఫౌండర్, సీఈఓ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి కాళకొండ మాట్లాడుతూ..
{{/usCountry}}"గిగ్ వర్కర్ల జీవనోపాధి వారికి దక్కే సరైన మద్దతుపైనే ఆధారపడి ఉంటుంది. 'కవచ్' ద్వారా రోజుకు రూ. 2 కే బీమా రక్షణను, 'స్వయమ్' తో సంపాదించిన సొమ్మును వెంటనే పొందే వెసులుబాటును, 'ట్విన్ఫినిటీ' ద్వారా ఛార్జింగ్ నిరీక్షణ సమయాన్ని తగ్గించి ఎక్కువ సంపాదన పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాం. కేవలం వాహనాన్ని అందించడమే కాకుండా రైడర్ల దైనందిన సవాళ్లను పరిష్కరించి, వారి ఆర్థిక భద్రతను పెంపొందించడమే మా ప్రధాన లక్ష్యం," అని అన్నారు.
నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న క్విక్ కామర్స్, ఈ-కామర్స్ డెలివరీ రంగాల్లో లక్షలాది మంది యువత భాగస్వాములవుతున్నారు. వారి రోజువారీ ఇబ్బందులను తీరుస్తూ ఈవీ వాహన రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు హాలా మొబిలిటీ తీసుకొచ్చిన ఈ సీడ్ ప్లాట్ఫామ్ వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతోంది.
ఇక హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా 2020లో ప్రారంభమైన హాలా మొబిలిటీ.. ప్రస్తుతం భాగ్యనగరంతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై, దిల్లీ-ఎన్సీఆర్, పూణె, అహ్మదాబాద్, జైపూర్, కోల్కతాతో పాటు తొమ్మిది ప్రధాన నగరాల్లో 25,000 మందికి పైగా డెలివరీ భాగస్వాములకు సేవలందిస్తోంది.