పండగల సీజన్లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఉక్కుపాదం మోపింది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు రెండు నెలల పాటు దేశవ్యాప్తంగా సాగిన ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌లో భారీ స్థాయిలో అక్రమాలను బయటపెట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన తయారీదారులు, విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటూ సుమారు రూ. 81.80 కోట్ల విలువైన 3,270 మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
56 వేల కేంద్రాల్లో విస్తృత తనిఖీలు

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రతా అధికారులతో కలిసి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ మెగా డ్రైవ్‌ను నిర్వహించింది. ఈ కాలంలో ఏకంగా 56,431 ఆహార తయారీ, విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. నాణ్యతా లోపాలు ఉన్న 10,047 సంస్థలకు సవరణ నోటీసులు (ఇంప్రూవ్మెంట్ నోటీసులు) జారీ చేశారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన 1,133 సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేయగా, 52 కేంద్రాల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేశారు.
314 షాపులకు సీల్.. 410 కేసులు నమోదు
పరిశుభ్రత లోపించడమే కాకుండా కల్తీకి పాల్పడుతున్న 314 వ్యాపార సంస్థలను అధికారులు తక్షణమే సీల్ చేశారు. చట్టపరమైన చర్యల్లో భాగంగా నిబంధనలు ధిక్కరించిన యాజమాన్యాలపై 410 కేసుల్లో ప్రాసిక్యూషన్ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా అధికారులు మొత్తం 43,939 ఆహార నమూనాలను సేకరించగా, అందులో 23,648 నమూనాల విశ్లేషణ పూర్తయింది. ఈ ల్యాబ్ పరీక్షల్లో 2,273 ఆహార నమూనాలు నిబంధనలకు విరుద్ధంగా, ప్రామాణిక నాణ్యత లేనివిగా తేలడం గమనార్హం.
పాలు, నూనెలు, పండగ స్వీట్లలోనూ కల్తీ
సీజ్ చేసిన ఉత్పత్తుల్లో నిత్యం వాడే వంటనూనెలు, పాలు, పన్నీరు, నెయ్యితో పాటు పండగల వేళ ఎక్కువగా విక్రయించే మిఠాయిలు, బేకరీ వస్తువులు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, నమ్కీన్, ప్యాకేజ్డ్ ఫుడ్, పండగ గిఫ్ట్ హ్యాంపర్లు భారీగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
"సురక్షితమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే ఈ విస్తృత తనిఖీలు చేపట్టాం. ఆహార రంగంలో ప్రమాణాలను పక్కాగా అమలు చేసేందుకు రాష్ట్ర అధికారులతో కలిసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తాం" అని ఎఫ్ఎస్ఎస్ఏఐ 'ఎక్స్' వేదికగా తెలిపింది.
పండగల వేళ పటిష్ట పర్యవేక్షణ
{{/usCountry}}"సురక్షితమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే ఈ విస్తృత తనిఖీలు చేపట్టాం. ఆహార రంగంలో ప్రమాణాలను పక్కాగా అమలు చేసేందుకు రాష్ట్ర అధికారులతో కలిసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తాం" అని ఎఫ్ఎస్ఎస్ఏఐ 'ఎక్స్' వేదికగా తెలిపింది.
పండగల వేళ పటిష్ట పర్యవేక్షణ
{{/usCountry}}పండగల సీజన్లో కల్తీ, నకిలీ, నాసిరకం ఆహార ఉత్పత్తుల విక్రయాలను అరికట్టాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే ప్రముఖ హోటళ్లు, ఈ-కామర్స్ సంస్థల విక్రయాలపైనా నిఘా పెంచింది. న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో గల 'ది లలిత్' హోటల్ నుండి సేకరించిన నెస్లే 'లో ఫ్యాట్ డైరీ వైటనర్' నమూనా సురక్షితం కాదని, ప్రామాణికంగా లేదని తేలడంతో గతంలో దాని విక్రయాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాబోయే రోజుల్లోనూ ఈ తనిఖీలను మరింత తీవ్రతరం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.